iDreamPost
android-app
ios-app

IND vs PAK: వస్తూ వస్తూ.. వర్షం తెచ్చాడు! రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

  • Author Soma Sekhar Updated - 05:26 PM, Sat - 2 September 23
  • Author Soma Sekhar Updated - 05:26 PM, Sat - 2 September 23
IND vs PAK: వస్తూ వస్తూ.. వర్షం తెచ్చాడు! రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

ఆసియా కప్ 2023లో భాగంగా.. క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న మ్యాచ్ ప్రారంభం అయ్యింది. అదే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్. ఈ టోర్నీలో హై ఓల్టేజ్ మ్యాచ్ ఏదైనా ఉంది అంటే అది ఒక్క ఇండియా-పాక్ మ్యాచ్ అనే చెప్పాలి. పల్లేకెలే వేదికగా ప్రారంభం అయిన ఈ మ్యాచ్ లో టీమిండియా తడబడుతోంది. పాక్ బౌలర్లను ఎదుర్కొవడంలో.. భారత బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. ఈ మ్యాచ్ లో రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతడు రావడం వల్లే వర్షం వచ్చింది అంటూ కామెడీ చేశాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు పూశాయి.

ఆసియా కప్ లో భాగంగా పల్లేకెలే వేదికగా ఇండియా-పాక్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అయితే రోహిత్ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని కొద్ది క్షణాల్లో తెలిసింది. బ్యాటింగ్ కు దిగిన ఇండియా బ్యాటర్లను తమ కట్టుదిట్టమైన బౌలింగ్ ఇబ్బందులకు గురిచేశారు పాక్ బౌలర్లు. రెండు ఫోర్లతో మంచి ఊపుమీదున్నట్లు కనిపించిన రోహిత్ శర్మ 11 పరుగులు మాత్రమే చేసి షాహీన్ అఫ్రిదీ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఆవెంటనే ఆదుకుంటాడు అనుకున్న విరాట్ కోహ్లీ సైతం ఓ ఫోర్ కొట్టి షాహీన్ బౌలింగ్ లోనే బౌల్డ్ అయ్యాడు.

ఇక.. గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యార్ కూడా 14 పరుగులు చేసి హారిస్ రౌఫ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. రెండోసారి మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. తొలిసారి 5 ఓవర్ల తర్వాత వర్షం స్టార్ట్ అవ్వగా.. ఇక్కడ ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. రవిశాస్త్రి కామెంటరీ బాక్స్ లో కామెంటరీ ఇస్తుండగా.. 5 ఓవర్ల తర్వాత వర్షం వచ్చింది. ఈ క్రమంలోనే అప్పుడే కామెంటరీ బాక్స్ లోకి ఓ ఇంగ్లాండ్ కామెంటరీ మ్యాన్ వచ్చాడు. దీంతో తనలోని హాస్య చతురతను బయటపెట్టాడు రవిశాస్త్రి. నువ్వు వస్తూ వస్తూ.. వర్షాన్ని వెంటబెట్టుకుని వచ్చావ్ అంటూ చమత్కరించాడు. దీంతో అక్కడంతా నవ్వులు పూశాయి.

ఇక రెండో సారి కూడా వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. 11.2 ఓవర్లో మరోసారి వర్షం వచ్చింది. అప్పటి టీమిండియా స్కోర్ 3 వికెట్లకు 51 పరుగులు. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తుండటంతో.. టీమిండియా బ్యాటర్లు రన్స్ చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. భారత టాపార్డర్ కుప్పకూలడంతో.. భారం మెుత్తం యువ బ్యాటర్లు గిల్, ఇషాన్ కిషన్ లపై పడనుంది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిదీ నిప్పులు చెరిగాడు. 5 ఓవర్లలో 2 మెయిడెన్లతో 15 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు.