iDreamPost

IND vs PAK: టాస్ విషయంలో రోహిత్ నిర్ణయమే కరెక్ట్! ఎలా అంటే?

  • Published Sep 02, 2023 | 3:27 PMUpdated Sep 02, 2023 | 3:29 PM
  • Published Sep 02, 2023 | 3:27 PMUpdated Sep 02, 2023 | 3:29 PM
IND vs PAK: టాస్ విషయంలో రోహిత్ నిర్ణయమే కరెక్ట్! ఎలా అంటే?

క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైఓల్టేజ్‌ మ్యాచ్‌ ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ మొదలైపోయింది. ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియం వేదికగా భారత్‌-పాక్‌ జట్లు తలపడుతున్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌పై మ్యాచ్‌ ఆరంభానికి ముందు వరకు కూడా అసలు మ్యాచ్‌ జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు తలెత్తాయి. పల్లెకెలెలో వర్షం వచ్చే సూచన ఉండటంతో మ్యాచ్‌ జరగడం సాధ్యం కాదని అంతా అనుకున్నారు. కానీ, వర్షం రాకపోవడంతో మ్యాచ్‌ అనుకున్న సమయానికి ప్రారంభమైంది. దీంతో క్రికెట్‌ అభిమానులంతా ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

పైగా ఇండియానే టాస్‌ గెలవడంతో మరింత సంతోష పడ్డారు. కానీ, టాస్‌ నెగ్గిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తీసుకున్న నిర్ణయంపై మాత్రం భారత క్రికెట్‌ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్‌ మధ్యలో వర్షం వచ్చే సూచనలు కనిపిస్తుండటంతో తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంటాడని చాలా మంది భావించారు. కానీ, రోహిత్‌ అనూహ్యంగా తొలుత బ్యాటింగ్‌ చేసేందుకు నిర్ణయించాడు. ఇది సరైన నిర్ణయం కాదని ఫ్యాన్స్‌ అంటున్నారు. టీమిండియా బ్యాటింగ్‌ తర్వాత వర్షం పడితే.. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో ఎన్ని ఓవర్లకు ఎన్ని పరుగులు చేసుకుంటూ పోతే మ్యాచ్‌లో గెలిచే అవకాశం ఉంటుందో తెలుస్తుందని, దాని ప్రకారం పాక్‌ బ్యాటింగ్‌ చేస్తూ.. విజయం దిశగా వెళ్తుంది.

ఇలా సెకండ్‌ బ్యాటింగ్‌ చేసే టీమ్‌కు అడ్వాంటేజ్‌ ఉండేదని, టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకునే అవకాశం ఉన్నా.. రోహిత్‌ అనవసరంగా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడంటూ మండిపడుతున్నారు క్రికెట్‌ అభిమానులు. మరికొందరు మాత్రం రోహిత్‌ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుని భారీ స్కోర్‌ చేస్తే.. మన బ్యాటింగ్‌ చివర్లో వర్షం వచ్చినా.. వర్షం తర్వాత బౌలింగ్‌ బాగా పడుతుందని.. పాకిస్థాన్‌కు బ్యాటింగ్‌ చేయడం అంత సులువుకాదని, తొలుత బ్యాటింగ్‌ చేయాలన్న రోహిత్‌ నిర్ణయం సరైందే అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కోహ్లీ విషయంలో తప్పు చేస్తే భారీ మూల్యం తప్పదు: గవాస్కర్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి