iDreamPost
android-app
ios-app

శ్రేయస్ అయ్యర్ కు గుడ్ న్యూస్.. కష్టానికి ఫలితం!

  • Published Mar 15, 2024 | 8:12 AM Updated Updated Mar 15, 2024 | 8:12 AM

రంజీ ట్రోఫీ 2024 ఫైనల్లో సత్తాచాటిన టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కు ఓ గుడ్ న్యూస్ అందబోతున్నట్లు సమాచారం. మరి ఆ శుభవార్త ఏంటి? తెలుసుకుందాం పదండి.

రంజీ ట్రోఫీ 2024 ఫైనల్లో సత్తాచాటిన టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కు ఓ గుడ్ న్యూస్ అందబోతున్నట్లు సమాచారం. మరి ఆ శుభవార్త ఏంటి? తెలుసుకుందాం పదండి.

శ్రేయస్ అయ్యర్ కు గుడ్ న్యూస్.. కష్టానికి ఫలితం!

ఆటగాళ్లు హద్దులు మీరితే ఫలితం ఎలా ఉంటుందో టీమిండియా ప్లేయర్లకు రుచి చూపించింది బీసీసీఐ. ముందు దేశం.. ఆ తర్వాతే ఏదైనా అంటూ వీపున ఓ దెబ్బ చరిచి మరీ చెప్పింది. బీసీసీఐ ఇటివలే సెంట్రల్ కాంట్రక్ట్ లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా చాలా మంది సీనియర్లకు కాంట్రాక్ట్ లో చోటు ఇవ్వకుండా మెుండిచేయి చూపిన విషయం తెలిసిందే. దేశవాలీ క్రికెట్ ఆడాలని చెప్పినా వినకపోవడంతో.. యంగ్ ప్లేయర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ లకు కాంట్రాక్ట్ లో చోటు కల్పించకుండా మెుట్టికాయలు వేసింది. దీంతో ఎట్టకేలకు దారికి వచ్చిన వీరిద్దరు డొమెస్టిక్ క్రికెట్ ఆడటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే శ్రేయస్ కు ఓ గుడ్ న్యూస్ అందబోతున్నట్లు సమాచారం.

శ్రేయస్ అయ్యర్.. తన ఆటతీరుతో టీమిండియాలో నిలకడైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. దీంతో మూడు ఫార్మాట్స్ లో జట్టులో కొనసాగుతూ వచ్చాడు. కానీ గత కొంతకాలంగా పూర్ ఫామ్ తో సతమతమవుతున్నాడు. పైగా గాయాలు కూడా ఒకవైపు అతడిని వేధించసాగాయి. ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు వెన్నునొప్పి గాయంతో నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో చేరాడు. అయితే అతడి వెన్నునొప్పి తగ్గిందని, ఫిట్ గా ఉన్నాడని సర్టిఫికెట్ ఇచ్చింది అకాడమీ. కానీ అయ్యర్ మాత్రం ఇటు టీమిండియాలోకి రాక, అటు రంజీల్లో ఆడకుండా గాయం ఇంకా తగ్గలేదని అబద్దం చెప్పి అక్కడే ఉండిపోయాడు. దీంతో బీసీసీఐకి చిర్రెత్తుకొచ్చింది. దెబ్బకు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించింది.

Good news for Shreyas Iyer

అయితే ఈ పరిణామం ఊహించని అయ్యర్ కంగుతిన్నాడు. పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి అని గ్రహించి.. మేల్కోన్నాడు. బీసీసీఐ వేసిన మెుట్టికాయకు రంజీ ట్రోఫీ బరిలోకి దిగాడు. ముంబై తరఫున ఆడిన అయ్యర్.. ఫైనల్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్ లో 7 రన్స్ కే పెవిలియన్ కు చేరి నిరాశపరిచిన అతడు.. రెండో ఇన్నింగ్స్ లో సత్తాచాటాడు. 111 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 95 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక ఈ ఇన్నింగ్స్ తో మంచి మార్కులు కొట్టేశాడు ఈ స్టార్ బ్యాటర్. దీంతో బీసీసీఐకి అయ్యర్ పై ఇంప్రెషన్ క్రియేట్ అయ్యింది. అతడి సెంట్రల్ కాంట్రాక్ట్ ను పునరుద్దరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇది అయ్యర్ కష్టానికి ఫలితమని అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్ పై ఎలాంటి విషయం తెలియరాలేదు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: టీమిండియా ప్లేయర్లకు BCCI భారీ షాక్! IPL లో మెరిసినా.. టీ20 వరల్డ్ కప్ లో చోటు కష్టమేనట!