iDreamPost

టీమిండియా ప్లేయర్లకు BCCI భారీ షాక్! IPL లో మెరిసినా.. టీ20 వరల్డ్ కప్ లో చోటు కష్టమేనట!

ఐపీఎల్ 2024లో సత్తాచాటి, టీ20 వరల్డ్ కప్ టీమ్ లో ప్లేస్ కొట్టేద్దామనుకుంటున్న టీమిండియా ప్లేయర్లకు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీసీసీఐ తీసుకున్న ఈ డెసిషన్ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024లో సత్తాచాటి, టీ20 వరల్డ్ కప్ టీమ్ లో ప్లేస్ కొట్టేద్దామనుకుంటున్న టీమిండియా ప్లేయర్లకు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీసీసీఐ తీసుకున్న ఈ డెసిషన్ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

టీమిండియా ప్లేయర్లకు BCCI భారీ షాక్! IPL లో మెరిసినా.. టీ20 వరల్డ్ కప్ లో చోటు కష్టమేనట!

ప్రపంచ క్రికెట్ ప్రేమికుల చూపు ఇప్పుడు రెండే మెగాటోర్నీలపై ఉంది. అందులో ఒకటి మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ కాగా.. ఇంకోటి జూన్ నుంచి స్టార్ట్ కానున్న టీ20 వరల్డ్ కప్. మరీ ముఖ్యంగా టీమిండియా యువ, స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్ 2024 సీజన్ లో రాణించి.. పొట్టి ప్రపంచ కప్ టీమ్ లో ప్లేస్ కొట్టేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ థింకింగ్ తో ఉన్న ప్లేయర్లు ఊహించని షాకిచ్చినట్లు తెలుస్తోంది బీసీసీఐ. ఈ సీజన్ ఐపీఎల్ లో మెరిసినా.. టీ20 వరల్డ్ కప్ లో చోటు కష్టమే అంటోంది బీసీసీఐ. మరి దానికి కారణం ఏంటి? ఓసారి పరిశీలిద్దాం పదండి.

ఐపీఎల్ 2024 ఎడిషన్ లో సత్తాచాటి సగర్వంగా టీ20 వరల్డ్ కప్ జట్టులోకి రావాలని భావిస్తున్నారు టీమిండియాలోని చాలా మంది యంగ్ అండ్ సీనియర్ క్రికెటర్లు. కానీ అలాంటి కలలు కంటున్న ప్లేయర్లకు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలుడ్డాయి. ఆ కథనాల ప్రకారం..”ఐపీఎల్ ముఖ్యమైన లీగ్ అందులో ఏ మాత్రం సందేహం లేదు. కానీ ఈ లీగ్ లో చూపిన ప్రతిభ ఆధారంగా టీ20 ప్రపంచ కప్ జట్టులోకి రాగలరని అనుకుంటే మాత్రం అది తప్పు. ప్రతిష్టాత్మకమైన పొట్టి ప్రపంచ కప్ లో చోటుకు ఐపీఎల్ ప్రదర్శన ప్రామాణికం కాదు. ఇంటర్నేషనల్ లేదా దేశవాలీ క్రికెట్ లో ఇచ్చిన ప్రదర్శన కారణంగానే వారిని ఎంపిక చేస్తాం” అని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేసినట్లు ఆ కథనం పేర్కొంది.

shock fro team india players

బీసీసీఐ ఇలాంటి నిర్ణయానికి రావడానికి ఆటగాళ్ల స్వయం కృపరాధమే కారణం. ఎందుకంటే? ఐపీఎల్ లో డబ్బు కోసం, విలువ కోసం ఆటగాళ్లు గాయాలు, వ్యక్తిగత కారణాలు సాకుగా చూపి దేశవాలీ క్రికెట్ ఆడటం మానేస్తున్నారు. పైగా ఐపీఎల్ సన్నాహకాల్లో మునిగిపోతున్నారు. దీంతో బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆటగాళ్లకు షాకిస్తూ.. టీ20 వరల్డ్ కప్ టీమ్ లో చోటుకు ఐపీఎల్ ప్రదర్శన ప్రామాణికం కాదని పేర్కొంది. ప్రస్తుతం ఈ న్యూస్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే క్రీడా పండితులు, క్రికెట్ లవర్స్ మాత్రం ఇది మంచి నిర్ణయమే అని ఆటగాళ్లు ముందు దేశం కోసం ఆడాలని కామెంట్స్ చేస్తున్నారు. మరి బీసీసీఐ తీసుకోబోతున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: కంగారూల పొగరును అణచిన ఇద్దరు లెజెండ్స్.. ఈడెన్ విక్టరీకి 23 ఏళ్లు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి