రచిన్ బ్యాటింగ్​ను మెచ్చుకున్న ద్రవిడ్.. అతడిలో అది ఎక్కువంటూ..!

  • Author singhj Published - 06:24 PM, Sat - 7 October 23
  • Author singhj Published - 06:24 PM, Sat - 7 October 23
రచిన్ బ్యాటింగ్​ను మెచ్చుకున్న ద్రవిడ్.. అతడిలో అది ఎక్కువంటూ..!

ఒకే ఒక్క ఇన్నింగ్స్​తో ఓవర్​నైట్ స్టార్ అయిపోయాడు న్యూజిలాండ్ ఆల్​రౌండర్ రచిన్ రవీంద్ర. వన్డే వరల్డ్ కప్ ఓపెనింగ్ మ్యాచ్​లో ఇంగ్లండ్​పై అదరగొట్టాడతను. మెరుపు సెంచరీతో ఇంగ్లీష్ బౌలర్లను ఉతికి ఆరేశాడీ యువ సంచలనం. డెవిన్ కాన్వేతో కలసి మ్యాచ్​ను వన్ సైడ్ చేసేశాడు. దీంతో రచిన్​పై అందరూ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. బెంగళూరులో పుట్టిన అతడి పేరెంట్స్.. రాహుల్ ద్రవిడ్ నుంచి ‘Ra’, సచిన్ టెండూల్కర్ నుంచి ‘Chin’లతో తమ కొడుక్కి రచిన్ రవీంద్ర అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే.

ఇంగ్లండ్​పై రచిన్ రవీంద్ర బ్యాటింగ్ చేసిన తీరుపై టీమిండియా హెచ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. రచిన్ బ్యాటింగ్​లో సచిన్ టెండూల్కర్ ప్రభావమే ఎక్కువగా కనిపిస్తోందన్నాడు. అతడి మీద తన ఎఫెక్ట్ తక్కువగా ఉందని సరదాగా తన మీదే జోకులు వేసుకున్నాడు. రచిన్ బ్యాటింగ్ చూశానని.. అతడు ఐదు సిక్సులు బాదాడని ద్రవిడ్ అన్నాడు. అతడి గేమ్ చూస్తుంటే ‘Chin’ ప్రభావమే అధికంగా ఉందనిపిస్తోందన్నాడు. తాను ఆఫ్ ది స్క్వేర్​లో బాల్​ను కొట్టలేనని.. బహుశా సచిన్ అందులో అతడికి సాయం చేసి ఉండొచ్చంటూ నవ్వులు పూయించాడు ద్రవిడ్.

‘ఇంగ్లండ్​తో మ్యాచ్​లో కాన్వే, రచిన్ ఇద్దరూ బాగా బ్యాటింగ్ చేశారు. టోర్నీలో న్యూజిలాండ్​కు మంచి స్టార్ట్‌ దొరికింది. గేమ్ ముందుకు సాగుతున్న కొద్దీ పిచ్ వారికి సహకరించింది. 2021 కాన్పూర్ టెస్టులోనూ రచిన్ ఆఖర్లో బ్యాటింగ్​కు వచ్చి దాదాపు గంటన్నన సేపు బ్యాటింగ్ చేసి ఆ మ్యాచ్​ను డ్రాగా ముగించాడు’ అని రాహుల్ ద్రవిడ్ మెచ్చుకున్నాడు. ఇక, ఇంగ్లండ్​తో న్యూజిలాండ్ ఆడిన ఫస్ట్ మ్యాచ్​లో కేన్ విలియమ్సన్ ఆడలేదు. అతడి ప్లేసులో గ్రౌండ్​లోకి దిగిన రచిన్ రవీంద్ర (96 బంతుల్లో 123 నాటౌట్) అద్భుత సెంచరీతో ఇంప్రెస్ చేశాడు. ఎప్పుడూ లోయర్ ఆర్డర్​లో బ్యాటింగ్ చేసే రచిన్.. ఈ మ్యాచ్​లో వన్​డౌన్​లోకి వచ్చి ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోశాడు.

ఇదీ చదవండి: గిల్‌ దూరం కాలేదు! ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు రోహిత్‌ కీలక స్టేట్‌మెంట్‌!

Show comments