iDreamPost

గిల్‌ దూరం కాలేదు! ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు రోహిత్‌ కీలక స్టేట్‌మెంట్‌!

  • Author singhj Published - 04:57 PM, Sat - 7 October 23
  • Author singhj Published - 04:57 PM, Sat - 7 October 23
గిల్‌ దూరం కాలేదు! ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు రోహిత్‌ కీలక స్టేట్‌మెంట్‌!

వన్డే వరల్డ్-2023 ఆరంభం కావడానికి ముందే టీమిండియాలో టెన్షన్ మొదలైంది. ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే, బరిలోకి దిగకుండానే జట్టులో గుబులు ప్రారంభమైంది. ఫస్ట్ మ్యాచ్​కు టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్లేయర్ల విషయంలో ఆందోళన కలుగుతోంది. భారత ఓపెనర్ శుబ్​మన్ గిల్ డెంగ్యూ బారిన పడినట్లు న్యూస్ వచ్చింది. ఈ వార్త కాస్తా కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అయితే అతడి పరిస్థితి బాగానే ఉందంటూ కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా బీసీసీఐ వర్గాలు చెప్పడంతో అభిమానులకు ఊరట లభించింది.

గిల్ హెల్త్​పై వర్నీ అవుతున్న సమయంలో మరో షాకింగ్ విషయం బయటికొచ్చింది. టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా వేలికి గాయమైందని సమాచారం. నెట్స్​లో ప్రాక్టీస్ చేస్తున్న టైమ్​లో అతడికి ఇలా జరిగిందని తెలుస్తోంది. అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. దీని మీద బీసీసీఐ అఫీషియల్​గా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆస్ట్రేలియాతో చెన్నైలోని చెపాక్​ వేదికగా జరిగే మ్యాచ్​లో పాండ్యా అందుబాటులో ఉండే ఛాన్స్ ఎక్కువేనని తెలుస్తోంది. కాగా, గిల్ అనారోగ్యం పాలైనట్లు చెప్పిన బీసీసీఐ.. అతడికి డెంగ్యూ వచ్చిందని కన్ఫర్మ్ చేయలేదు. డెంగ్యూ వస్తే కోలుకునేందుకు మినిమం 10 రోజులు పడుతుంది. ఒకవేళ గిల్​కు జ్వరం వస్తే మాత్రం పాకిస్థాన్​తో శనివారం జరిగే మ్యాచ్​ వరకు అందుబాటులో ఉండకపోవచ్చు.

గిల్ దూరమైతే మరో యంగ్​స్టర్ ఇషాన్ కిషన్​తో కలసి కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్​ను స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శుబ్​మన్ గిల్​ హెల్త్ కండీషన్​పై తాజాగా హిట్​మ్యాన్ స్పందించాడు. గిల్ ఇంకా అనారోగ్యంగానే ఉన్నాడని చెప్పిన రోహిత్.. మ్యాచ్ మొదలవ్వడానికి ముందు తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. ‘శుబ్​మన్ గిల్ చాలా సిక్ అయ్యాడు. అతడ్ని మా మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది. అతడి హై ఫీవర్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కెప్టెన్​గా కాకుండా ఒక మనిషిగా గిల్ త్వరగా రికవర్ కావాలని కోరుకుంటున్నాను’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. గిల్ ఇంకా టీమ్​కు అందుబాటులోనే ఉన్నాడని.. వరల్డ్ కప్​ నుంచి అతడు దూరమవ్వలేదని రోహిత్ పేర్కొన్నాడు. రికవరీ అయ్యేందుకు గిల్​కు అన్ని ఛాన్సులు ఇస్తామని హిట్​మ్యాన్ స్పష్టం చేశాడు. మరి.. గిల్ ఎప్పటివరకు కోలుకుంటాడో చూడాలి.

ఇదీ చదవండి: World Cup: అది మర్చిపోయి బ్యాటింగ్‌కు దిగిన బ్యాటర్‌! నవ్వులు తెప్పిస్తున్న వీడియో!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి