IPL 2025: మెగా ఆక్షన్ లో పాడినంత అమౌంట్ చేతికి ఇవ్వరా?

IPL 2025: ఐపిఎల్ 2025 వచ్చేస్తుంది. ఈసారి వేలం బాగా వైరల్ అయ్యింది.

IPL 2025: ఐపిఎల్ 2025 వచ్చేస్తుంది. ఈసారి వేలం బాగా వైరల్ అయ్యింది.

IPL 2025 మెగా వేలంలో ఇప్పుడు ఎవరికి ఎంత డబ్బులు వస్తున్నాయి అనే దాని పైన చర్చ జరుగుతోంది. ఇక ఈసారి జరిగిన మెగా వేలంలో రిషబ్ పంత్ అత్యధిక ధర పలికాడు. ఏకంగా 27 కోట్లకు రిషభ్ ను లక్నో పోటీపడి కొనుగోలు చేసింది. మెగా వేలంలో హైదరాబాద్ జట్టుతో పాటు లక్నో కూడా…రిషబ్ పంత్ కోసం పోటీ పడింది. ఫైనల్ గా రిషబ్ పంత్ కోసం 27 కోట్లు ఆఫర్ చేసి అతన్ని దక్కించుకుంది లక్నో. ఇక రిషబ్ పంత్ తరువాత శ్రేయస్ ని 26 కోట్ల 75 లక్షలకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకోగా.. వెంకటేశ్ అయ్యర్ ని 23 కోట్ల 75 లక్షలకు కోల్ కతా నైట్ రైడర్స్ టీం సొంతం చేసుకుంది. ప్రస్తుతం IPL 2025 మెగా వేలంలో వీరి ముగ్గురి ధరలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో అందరూ వామ్మో ఇన్ని కోట్లు పెట్టి కొన్నారా ? అని ఆశ్చర్యపోతున్నారు. కానీ భారత చట్టాల ప్రకారం అంత అమౌంట్ వీరి ఖాతాలో పడదు. చాలా వరకు టాక్స్ లు కట్ అవుతాయి. అయితే ఎంత వరకు ట్యాక్స్ లు కట్ అవుతాయి? ఫైనల్ గా వీరి చేతికి ఎంత అమౌంట్ వస్తుంది? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఎక్కువ ధర పలికిన రిషబ్ పంత్ కి తనకు వచ్చే 27 కోట్లలో దాదాపు 8.1 కోట్ల దాకా జీఎస్టీ ఇతర ట్యాక్స్ లు విధిస్తారు. ఈ లెక్కన రిషబ్ పంత్ చేతికి 18.9 కోట్లు మాత్రమే వస్తాయి. అంటే దాదాపు 40 శాతం దాకా తన జీతాన్ని… ప్రభుత్వానికి ట్యాక్స్ ల రూపంలో కట్టబోతున్నాడు పంత్. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా తన 26 కోట్ల 75 లక్షలలో ఈ ట్యాక్స్ కటింగ్స్ తరువాత దాదాపు 16.05 కోట్ల దాకా మాత్రమే పొందనున్నాడు. అలాగే శ్రీనివాస్ అయ్యర్ తన 23 కోట్ల 75 లక్షలలో ఈ ట్యాక్స్ కటింగ్స్ అన్నీ పోగా దాదాపు 14.25 కోట్ల దాకా మాత్రమే వెనకేసుకోగలడు..

ఒక్క వీళ్ళే కాకుండా… మెగా వేలంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా భారీగా GST ఇంకా ఇతర ట్యాక్స్ లు కచ్చితంగా కట్టాల్సిందే. కాబట్టి మన కళ్ళకి కనిపించే అమౌంట్ అయితే వీరు వెనకేసుకోలేరు. వీరి సంపాదనలో దాదాపు 40 శాతం దాకా ఇలా టాక్స్ లు కట్ అవుతాయి. ఇక ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఇదీ సంగతి.. ఇక IPL 2025 మెగా ఆక్షన్ గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments