iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై .. IPL సస్పెన్షన్ ప్రభావం

  • Published May 12, 2025 | 10:58 AM Updated Updated May 12, 2025 | 10:58 AM

IPL సీజన్ లో టాలీవుడ్ లో థియేటర్స్ కాస్త వెలవెలబోతు ఉంటాయి. కానీ ఈసారి ఇప్పుడు ఇదే IPL సినిమాలకు పెద్ద ప్లస్ పాయింట్ అయిందని చెప్పి తీరాల్సిందే. ఈ వీకెండ్ టాలీవుడ్ లో థియేటర్స్ కళకళలాడాయి.

IPL సీజన్ లో టాలీవుడ్ లో థియేటర్స్ కాస్త వెలవెలబోతు ఉంటాయి. కానీ ఈసారి ఇప్పుడు ఇదే IPL సినిమాలకు పెద్ద ప్లస్ పాయింట్ అయిందని చెప్పి తీరాల్సిందే. ఈ వీకెండ్ టాలీవుడ్ లో థియేటర్స్ కళకళలాడాయి.

  • Published May 12, 2025 | 10:58 AMUpdated May 12, 2025 | 10:58 AM
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై .. IPL సస్పెన్షన్ ప్రభావం

క్రికెట్ మ్యాచ్ ల ప్రభావం సినిమాలపై గట్టిగా ఉంటుంది. అందులోను టాలీవుడ్ సినిమాలపై ఈ ఎఫెక్ట్ ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. IPL సీజన్ లో థియేటర్స్ కాస్త వేవెలబోతూ ఉంటాయి. కానీ గతవారం రిలీజ్ అయినా సినిమాలకు మాత్రం IPL సీజన్ ప్లస్ పాయింట్ అయిందని చెప్పితీరాల్సిందే. భారత్ పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో IPL మ్యాచ్ లను సస్పెండ్ చేశారు. దీనితో గతవారం రిలీజ్ అయిన సినిమాలపై అందరి కళ్ళు పడ్డాయి. లాస్ట్ వీకెండ్ థియేటర్స్ అన్ని కూడా జనంతో కకళలాడాయి. దీనితో సింగల్ , శుభం , హిట్ 3 సినిమాలు మంచి వసూళ్లను రాబట్టాయి.

శ్రీ విష్ణు నటించిన సింగిల్ సినిమా అందరిని ఆకరిషిస్తోంది. వన్ లైన్ పంచ్ లు , కామిడి టైమింగ్ అందరిని తెగ మెప్పించాయని చెప్పి తీరాల్సిందే. మూడు రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.16.30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు . ఇక సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమా కూడా గత వీకెండ్ 40% ఆక్యుపెన్సీ సాధిస్తూ హైదరాబాద్‌లో వీకెండ్ లోనే మంచి గ్రాస్ సాధించింది. వీటితో పాటు ఈ రెండిటికంటే ముందు రిలీజ్ అయిన నాని హిట్ 3 మూవీ ఇప్పటికి థియేటర్స్ లో హావ కొనసాగిస్తోంది. రెండో వీకెండ్‌లో కూడా 49.95% ఆక్యుపెన్సీతో దూసుకెళ్తోంది . ఈ సినిమాలు ఐపీఎల్ వాయిదా వల్ల ఈ వీకెండ్‌లో భారీ ఆదాయాన్ని అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి IPL సస్పెన్షన్ ఈ వీకెండ్ సినిమాలకు బాగా కలిసొచ్చిందని చెప్పి తీరాల్సిందే . ఇక లాంగ్ రన్ ఈ సినిమాలు ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటాయి చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.