Nidhan
మానిన గాయాన్ని రేపితే ఎలా ఉంటుందో ఆస్ట్రేలియాకు తెలియడం లేదు. భారత కెప్టెన్ రోహిత్ శర్మను మరోమారు టార్గెట్ చేసుకుంటూ కంగారూలు చేస్తున్న పనిపై నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
మానిన గాయాన్ని రేపితే ఎలా ఉంటుందో ఆస్ట్రేలియాకు తెలియడం లేదు. భారత కెప్టెన్ రోహిత్ శర్మను మరోమారు టార్గెట్ చేసుకుంటూ కంగారూలు చేస్తున్న పనిపై నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Nidhan
ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే ఏ ఆటగాడికైనా వరల్డ్ కప్ గెలవాలనేది బిగ్గెస్ట్ డ్రీమ్. ఇప్పుడంటే టీ20ల్లోనూ ప్రపంచ కప్ వచ్చింది గానీ వన్డే వరల్డ్ కప్ ముందు ఏదీ సాటిరాదు. ఈ మధ్య కాలంలో వన్డేలకు క్రేజ్ తగ్గుతున్నా ఆ ఫార్మాట్లో నిర్వహించే మెగా టోర్నీకి మాత్రం పాపులారిటీ అలాగే ఉంది. రెండేళ్లకు ఓసారి నిర్వహించే టీ20ల కంటే నాలుగేళ్లకు ఒకసారి నిర్వహించడం, ప్లేయర్ల అసలైన సత్తా ఏంటో బయటపడే ఫార్మాట్ కావడంతో దీనిపై అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంక ప్లేయర్లకు ఇదో జీవితకాలపు కల అనే చెప్పాలి. అయితే సచిన్ టెండూల్కర్ లాంటి లెజెండ్‌కే వరల్డ్ కప్ డ్రీమ్ నెరవేర్చుకోవడానికి దాదాపు రెండు దశాబ్దాలు పట్టింది. వ్యక్తిగత ప్రదర్శన, టీమ్ పెర్ఫార్మెన్స్తో పాటు మెగా టోర్నీలో టైటిల్ ఒడిసి పట్టాలంటే కాస్త లక్ కూడా కలసిరావాలి.
ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ వరకు వరుసగా గెలుస్తూ వచ్చిన టీమిండియా.. ఆఖరి మెట్టు మీద బోల్తా పడి కప్పును చేజార్చుకుంది. అప్పటిదాకా ఓటమి అనేదే లేకుండా విజయాలతో దూసుకొచ్చిన భారత జట్టు.. ఫైనల్లో ఒత్తిడిని తట్టుకోలేక చిత్తయింది. ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో ఎలా ఆడాలో ట్రిక్ తెలిసిన ఆస్ట్రేలియా.. టాస్ నుంచి మ్యాచ్ పూర్తయ్యే వరకు డేరింగ్ డెసిజన్స్ తీసుకుంటూ, అటాకింగ్ గేమ్‌తో విజయం సాధించింది. ఎలాంటి టెన్షన్ లేకుండా ఆడి ట్రోఫీని ఎరగేసుకుపోయింది. ఈ మ్యాచ్ ఓటమి బాధలో నుంచి భారత ప్లేయర్లు, ఫ్యాన్స్ ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. నెక్స్ట్ ఆడే మ్యాచులు, సిరీస్‌ల మీద ఫోకస్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో అందులోనైనా విజేతగా నిలవాలని భావిస్తున్నారు. ఇక, వరల్డ్ కప్ ఓటమి బాధలో భారత టీమ్ ఉంటే.. అటు ఆస్ట్రేలియా మాత్రం మానిన గాయాన్ని మళ్లీ రేపుతోంది.
కెప్టెన్ రోహిత్ శర్మను వరుసగా రెండో మారు టార్గెట్ చేసి అటాక్ చేసింది ఆసీస్. మొదటిసారి మెగా టోర్నీ ఫైనల్‌కు ముందు ప్రకటించిన బెస్ట్ ఎలెవన్‌లో హిట్‌మ్యాన్‌కు చోటు ఇవ్వకుండా అవమానించింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ అదే రీతిలో ప్రవర్తించి అభాసుపాలు అవుతోంది. ప్రస్తుతం పాకిస్థాన్‌తో టెస్ట్ సిరీస్‌లో ఆడుతోంది కంగారూ జట్టు. అయితే ఈ సిరీస్‌ను టెలికాస్ట్ చేస్తున్న ఫాక్స్ క్రికెట్ సంస్థ మ్యాచ్ మధ్యలో పదే పదే రోహిత్‌ను చూపిస్తోంది. వరల్డ్ కప్ ఫైనల్లో గ్లెన్ మాక్స్వెల్ బౌలింగ్‌లో రోహిత్ ఔటైన వీడియోను ఆసీస్-పాక్ మ్యాచ్ మధ్యలో టెలికాస్ట్ చేస్తోంది. దీంతో ఆస్ట్రేలియా తీరుపై భారత అభిమానులు సీరియస్ అవుతున్నారు. హిట్‌మ్యాన్‌ను అనవసరంగా రెచ్చగొట్టొద్దని.. అవకాశం దొరికినప్పుడు అంతకంతా రివేంజ్ తీర్చుకుంటాడని వార్నింగ్ ఇస్తున్నారు. ఒకవేళ ప్రపంచ కప్ ఫైనల్లో రోహిత్ 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసుంటే మీ పరిస్థితి ఏమయ్యేదని ఏకిపారేస్తున్నారు. మరి.. టీమిండియా కెప్టెన్ విషయంలో ఆసీస్ మీడియా ప్రవర్తిస్తున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Cricket Facts: క్రికెట్‌లో ఎవ్వరూ నమ్మలేని నిజాలు! 7 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్
FOX cricket showing Rohit Sharma’s World Cup Final dismissal during Australia Vs Pakistan Test match. 😓 pic.twitter.com/0iqTVrqgKe
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 14, 2023