iDreamPost
android-app
ios-app

మరోసారి పరువు తీసుకున్న పాకిస్థాన్.. రిచ్ బోర్డు అంటారు ఇంత దారుణ స్థితిలోనా?

  • Published May 05, 2024 | 2:09 PM Updated Updated May 05, 2024 | 2:09 PM

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరోసారి తన పరువు తానే తీసుకుంది. రిచ్ బోర్డు అంటూ బిల్డప్ ఇచ్చే పీసీబీ ఎంత దారుణ స్థితిలో ఉందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరోసారి తన పరువు తానే తీసుకుంది. రిచ్ బోర్డు అంటూ బిల్డప్ ఇచ్చే పీసీబీ ఎంత దారుణ స్థితిలో ఉందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

  • Published May 05, 2024 | 2:09 PMUpdated May 05, 2024 | 2:09 PM
మరోసారి పరువు తీసుకున్న పాకిస్థాన్.. రిచ్ బోర్డు అంటారు ఇంత దారుణ స్థితిలోనా?

పాకిస్థాన్ ఎప్పుడూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆ దేశ ఆటగాళ్లు వింత ఫీల్డింగ్, వెరైటీ ఔట్లు, అర్థం పర్థం లేని కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. తమ ఆటేదో తాము ఆడుకోకుండా నిత్యం భారత్​తో పోల్చుకోవడం వాళ్లకు అలవాటుగా మారింది. విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజం గ్రేట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ కంటే పాకిస్థాన్ సూపర్ లీగ్ గొప్ప, టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే తోపు అంటూ ఆ దేశ మాజీ ఆటగాళ్లు బిల్డప్ ఇవ్వడం తెలిసిందే. భారత క్రికెట్ బోర్డుతో గానీ ఇక్కడి ఆటగాళ్లు, జట్టుతో గానీ ఎందులోనూ పాక్ సరితూగదు. అందుకే వాళ్లు చేసే వ్యాఖ్యల్ని ఇండియన్ ఫ్యాన్స్ లైట్ తీసుకుంటారు. వాళ్ల పరువు వాళ్లే తీసుకుంటున్నారని సరదాగా నవ్వుకుంటారు.

పాకిస్థాన్ క్రికెట్ పరువు మళ్లీ పోయింది. ఈసారి ఆ దేశ బోర్డు తన పరువు తానే తీసుకుంది. వరల్డ్ క్రికెట్​లో తమ కంటే రిచ్ బోర్డు లేదని, తమ ముందు బీసీసీఐ కూడా జూజూబీ అంటూ గొప్పలకు పోవడం పీసీబీకి అలవాటుగా మారింది. అయితే ఆ దేశ క్రికెట్ ఎంత దుస్థితిలో ఉందో ఒక్క వీడియోతో బయటపడింది. పాక్​లోని స్టేడియాల్లో ముఖ్యమైనదిగా పెషావర్ స్టేడియాన్ని చెప్పొచ్చు. ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచులు, పీఎస్​ఎల్ మ్యాచ్​లు కూడా జరుగుతాయి. అయితే అలాంటి స్టేడియం నిర్వహణ విషయంలో లోపాలు తాజాగా బయటపడ్డాయి. ఆ మైదానంలో బాగా గడ్డి పెరిగిపోయింది. దీంతో గ్రాస్​ను కత్తిరించాల్సి ఉంది.

సాధారణంగా క్రికెట్ స్టేడియాల్లో గడ్డి పెరగడం, దాన్ని మెషీన్లతో కత్తిరించడం కామన్. చిన్న చిన్న దేశాల్లో కూడా గ్రాస్ కట్టింగ్ మెషీన్లు ఉంటాయి. కానీ పెషావర్​ స్టేడియంలో మాత్రం గడ్డిని కొందరు కూలీలను పెట్టి తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మైదానంలో కొందరు వ్యక్తులు కొడవళ్లతో గడ్డిని కోస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాళ్లతో పాటు మరికొంత మంది కూలీలు వేరే వైపు గడ్డిని కోయడం ఆ వీడియోలో చూడొచ్చు. దీన్ని చూసిన నెటిజన్స్.. ఇంతకంటే దారుణం ఏమీ ఉండదని అంటున్నారు. ఒక ఇంటర్నేషనల్ స్టేడియాన్ని నిర్వహించే తీరు ఇదేనా అంటూ సీరియస్ అవుతున్నారు. కనీసం ఓ యంత్రాన్ని కొనే స్థితిలో కూడా లేరా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి పాకిస్థాన్ ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ-2025ని ఎలా నిర్వహిస్తుందని నిలదీస్తున్నారు.