iDreamPost

RCB vs GT: వీడియో: పరువు తీసుకున్న రషీద్.. బిల్డప్‌ ఇచ్చి మ్యాచ్​లో తుస్సుమన్నాడు!

  • Published May 05, 2024 | 11:52 AMUpdated May 05, 2024 | 11:52 AM

గుజరాత్ టైటాన్స్​ ఆల్​రౌండర్ రషీద్ ఖాన్ తన పరువు తానే తీసుకున్నాడు. మ్యాచ్​కు ముందు బిల్డప్ ఇచ్చిన ఈ ఆఫ్ఘానీ కరెక్ట్ టైమ్​కు తుస్సుమన్నాడు.

గుజరాత్ టైటాన్స్​ ఆల్​రౌండర్ రషీద్ ఖాన్ తన పరువు తానే తీసుకున్నాడు. మ్యాచ్​కు ముందు బిల్డప్ ఇచ్చిన ఈ ఆఫ్ఘానీ కరెక్ట్ టైమ్​కు తుస్సుమన్నాడు.

  • Published May 05, 2024 | 11:52 AMUpdated May 05, 2024 | 11:52 AM
RCB vs GT: వీడియో: పరువు తీసుకున్న రషీద్.. బిల్డప్‌ ఇచ్చి మ్యాచ్​లో తుస్సుమన్నాడు!

గుజరాత్ టైటాన్స్.. ఐపీఎల్​లో కొత్త జట్లలో ఇదొకటి. ఆ టీమ్​కు ఇది మూడో సీజన్ మాత్రమే. అయితే ఎక్స్​పెక్టేషన్స్ మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి. దీనికి కారణం ట్రాక్ రికార్డే. లీగ్​లోకి అడుగుపెట్టిన తొలి సీజన్​లోనే జీటీ ఛాంపియన్​గా నిలిచింది. గతేడాది రన్నరప్​గా నిలిచి తృటిలో ట్రోఫీని మిస్సైంది. ఈసారి కూడా ఆ జట్టు మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆట మాత్రం అందుకు తగ్గట్లుగా లేదు. ఆడిన 11 మ్యాచుల్లో 4 విజయాలు, 7 పరాజయాలతో ప్లేఆఫ్స్ రేసు నుంచి ఆ టీమ్ టెక్నికల్​గా తప్పుకుంది. తదుపరి ఆడే మూడు మ్యాచుల్లోనూ నెగ్గినా ఆ టీమ్ ప్లేఆఫ్స్​కు వెళ్లడం కష్టమే. టాప్ టీమ్స్ మీదే కాదు.. ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన ఆర్సీబీ మీద కూడా ఆ జట్టు నిన్న ఓడిపోయింది.

ఆర్సీబీతో జరిగిన మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన జీటీ అన్ని ఓవర్లు కూడా ఆడలేకపోయింది. 19.3 ఓవర్లకు 147 పరుగులు చేసి కుప్పకూలింది. సాధారణ లక్ష్యాన్ని బెంగళూరు జట్టు 13.4 ఓవర్లలో ఛేజ్ చేసేసింది. అయితే ఈ మ్యాచ్​లో రషీద్ ఖాన్ ఔట్ అయిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత రెండు సీజన్లలో గుజరాత్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు రషీద్. బాల్​తో పాటు బ్యాట్​తోనూ విలువైన పరుగులు చేస్తూ మ్యాచ్ విన్నర్​గా తన రోల్​కు న్యాయం చేశాడు. కానీ ఈ సీజన్​లో అతడి బ్యాట్ గర్జించడం లేదు. బాల్​తో కూడా భారీగా పరుగులు ఇచ్చుకుంటున్నాడు. నిన్న ఆర్సీబీతో మ్యాచ్​లో అనవసర బిల్డప్ ఇచ్చి ఔట్ అయ్యాడు రషీద్.

బెంగళూరుతో మ్యాచ్​కు ముందు ప్రాక్టీస్ సెషన్స్​లో పేస్ బౌలింగ్​లో అలవోకగా స్కూప్ షాట్ కొట్టాడు. క్రీజులో నుంచి కాస్త పక్కకు జరిగి బ్యాట్​ను కరెక్ట్​ టైమ్​కు ఫ్లిక్ చేశాడు. అయితే ఇదే షాట్​ను మ్యాచ్​ టైమ్​లో ఆడమంటే మాత్రం తుస్సయ్యాడు. జీటీ ఇన్నింగ్స్​లో 18వ ఓవర్ వేసేందుకు బౌలింగ్​కు వచ్చాడు ఆర్సీబీ పేసర్ యష్ దయాల్. అప్పటికే 13 బంతుల్లో 18 పరుగులు చేసి ఊపు మీదున్నాడు రషీద్. దయాల్​ను టార్గెట్ చేసుకొని భారీ షాట్లు ఆడదామని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలో యష్ బాల్ వేయడానికి ముందే క్రీజులో నుంచి కుడి వైపునకు కదిలాడు రషీద్. దీంతో తెలివిగా లెగ్ స్టంప్​ను లక్ష్యంగా చేసుకొని బ్రిలియంట్ యార్కర్ వేశాడు. అయితే తనకు అలవాటైన రీతిలో ఈజీగా దాన్ని బౌండరీకి తరలిద్దామని స్కూప్ షాట్ ఆడాడు రషీద్. కానీ బ్యాట్​ను దాటుకొని వెళ్లిన బాల్ వికెట్లను గిరాటేసింది. దీన్ని చూసిన నెటిజన్స్ నెట్స్​లో కాదు.. మ్యాచ్​లో ఆడినోడే గొప్ప అని అంటున్నారు. ​బిల్డప్​లు తగ్గించి గేమ్​పై కాన్​సంట్రేట్ చేయాలని సూచిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardik.__pandya.33)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి