SNP
Pakistan, Arshad Nadeem, Paris Olympics 2024, Javelin Throw: భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రాను ఓడించి.. పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన అర్షద నదీమ్ లైఫ్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Pakistan, Arshad Nadeem, Paris Olympics 2024, Javelin Throw: భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రాను ఓడించి.. పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన అర్షద నదీమ్ లైఫ్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. 100 ఏళ్ల ఒలింపిక్ చరిత్రను తిరగరాస్తూ.. 92.97 మీటర్ల దూరం జావెలిన్ విసిరి.. కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఘనతతో పాకిస్థాన్ మొత్తం అర్షద్ నదీమ్‌ను ఆకాశానికెత్తేస్తోంది. ఒక్క గోల్డ్ మెడల్‌తో ప్రపంచ వ్యాప్తంగా పాకిస్థాన్ పేరు మారుమోగిపోయేలా చేశాడంటూ.. ప్రతి పాక్ పౌరుడు గర్వంగా చెప్పుకుంటున్నాడు. గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా.. కొత్త ఒలింపిక్ రికార్డు సృష్టించిన అర్షద్ నదీమ్.. ఈ స్థాయికి చేరుకోవడానికి మాత్రం ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, మరెన్నో కష్టాలు అధిగమించాడు. గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత నదీమ్ ఛాంపియన్ కాలేదు.. ఛాంపియన్‌గా జీవితాన్ని గెలిచిన తర్వాతే.. గోల్డ్ మెడల్ కొట్టాడు. మన శత్రుదేశంలో పుట్టినా.. తన ప్రతిభతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న అర్షద్ నదీమ్ లైఫ్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పాకిస్థాన్‌లోని పంజాబ్ రిజియన్‌లోని ఖనేవాల్ అనే గ్రామంలో 1997 జనవరి 2న జన్మించాడు అర్షద్ నదీమ్. అతని తల్లిదండ్రుల ఏడుగురు సంతానంలో నదీమ్ మూడో వాడు. అతని తండ్రి మొహమ్మద్ అష్రఫ్ ఒక కూలీ. నిర్మాణ రంగంలో రోజువారి కూలీగా పని చేస్తూ ఉంటాడు. కుటుంబానికి పోషించడానికి అష్రఫ్ రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడేవాడు. అయినా కూడా పెద్ద కుటుంబానికి పోషించాలంటే ఇబ్బంది అయ్యేది. ఒక్కోసారి కనీసం తిండికి కూడా ఇబ్బంది పడేవారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే.. మాసం తినేవారు. అది కూడా బక్రీద్‌కి. ఇతర ధనిక ముస్లింలు.. ఖుర్బానీ ఇస్తే ఆ రోజు మాసంతో భోజనం చేసేవారు. అంతేకానీ.. సొంతంగా మాసం కొనుక్కొని తినే అంత స్థోమత లేదు.
ఇంత పేదరికంలో కూడా.. అర్షద్ నదీమ్ జావెలిన్ విసరడంపై ఆసక్తి పెంచుకున్నాడు. మెల్లమెల్లగా అందులో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అయితే.. కఠిక పేదరికం కారణంగా.. ట్రైనింగ్ తీసుకోవడానికి, తన గ్రామం నుంచి వేరే ఊరెళ్లి పోటీల్లో పాల్గొనేందుకు కూడా అర్షద్ నదీమ్ వద్ద డబ్బులు ఉండేవి కావు. అతని ప్రతిభను గుర్తించిన గ్రామస్థులే.. తలా ఇంత చందాలుగా వేసుకుని.. నదీమ్‌ను ఇతర ప్రాంతాలకు పోటీల కోసం పంపేవారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. అర్షద్ నదీమ్ అంచెలంచెలుగా ఎదిగాడు. పారిస్ ఒలింపిక్స్‌కు పాకిస్థాన్ నుంచి కేవలం ఏడుగురు అథ్లెట్లు మాత్రమే వచ్చారు. అందులో అర్షద్ నదీమ్ ఒకడు. అయినా కానీ, పాకిస్థాన్‌కు దాదాపు 32 ఏళ్ల తర్వాత గోల్డ్ మెడల్ అందించాడు. వ్యక్తిగత విభాగంంలో మాత్రం పాకిస్థాన్‌కు ఇదే తొలి గోల్డ్ మెడల్. అంతకంటే ముందు.. 2023లో ది వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ గెలిచాడు. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. మరీ.. ఎప్పుడూ ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులు, పేదరికంలో మగ్గిపోయే పాకిస్థాన్‌కు గోల్డ్ మెడల్ మజాను రుచిచూపించిన అర్షద్ నదీమ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
किस हालात और विपरीत परिस्थिति में नदीम ने यह मुक़ाम हासिल किया। ग़ज़ब है
pic.twitter.com/8odQ2X6uBM— Narendra Nath Mishra (@iamnarendranath) August 9, 2024
Men’s javelin throw final was BIG 🔥
🥇 92.97m OR Arshad Nadeem 🇵🇰
🥈 89.45m @Neeraj_chopra1 🇮🇳
🥉 88.54m Anderson Peters 🇬🇩 #Paris2024 #Olympics pic.twitter.com/jPrVZZ6txl— World Athletics (@WorldAthletics) August 8, 2024