iDreamPost
android-app
ios-app

Hardik Pandya: పాక్​కు శాపంగా మారిన హార్దిక్.. అతడి వల్లే వరుస ఓటములు!

  • Published Jan 19, 2024 | 8:08 PM Updated Updated Jan 19, 2024 | 8:08 PM

టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాను చూసి పాకిస్థాన్ జట్టు వణుకుతోంది. అతడి వల్లే తమకు వరుస ఓటములు వస్తున్నాయని ఆరోపిస్తోంది.

టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాను చూసి పాకిస్థాన్ జట్టు వణుకుతోంది. అతడి వల్లే తమకు వరుస ఓటములు వస్తున్నాయని ఆరోపిస్తోంది.

  • Published Jan 19, 2024 | 8:08 PMUpdated Jan 19, 2024 | 8:08 PM
Hardik Pandya: పాక్​కు శాపంగా మారిన హార్దిక్.. అతడి వల్లే వరుస ఓటములు!

సెంటిమెంట్.. ఇది అన్ని రంగాల్లోనూ కనిపిస్తుంది. దీనికి క్రికెట్ కూడా మినహాయింపేమీ కాదు. ఫలానా విషయాలు కలిసొస్తే టీమ్ గెలుస్తుంది లేదా ఓడిపోతుంది లాంటి వాటిని నమ్మడాన్ని చూస్తూనే ఉంటాం. క్రికెటర్ల కిట్​లో కూడా దేవుడి ఫొటోలు లేదా తమకు నచ్చిన వస్తువులు ఉంచుకోవడం కూడా కామనే. ఒక టీమ్ గెలుపు లేదా ఓటమికి సంబంధించి ఏయే విషయాలు ఎక్కువ కీలకంగా ఉంటున్నాయనేది ఆ జట్టు అభిమానులు బాగా పట్టించుకుంటారు. ఇప్పుడు పాకిస్థాన్ ఫ్యాన్స్ కూడా ఇలాగే ఆలోచిస్తూ టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాను బద్నాం చేస్తున్నారు. అతడి వల్లే తమ టీమ్​ను వరుస ఓటములు పలకరిస్తున్నాయని అంటున్నారు. హార్దిక్ వేసిన మంత్రం ఇంకా పనిచేస్తోందని.. దాని ప్రభావం వల్లే తమ జట్టు ఓటముల బారి నుంచి బయటపడలేకపోతోందని ఆరోపిస్తున్నారు. అసలు పాక్ ఓటములతో హార్దిక్​కు ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం..

అది వన్డే వరల్డ్ కప్-2023. తాము ఆడిన తొలి మ్యాచ్​లో శ్రీలంకను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. పాకిస్థాన్. 344 పరుగుల భారీ టార్గెట్​ను ఛేజ్ చేశామనే జోష్​లో నెక్స్ట్ టీమిండియాతో ఆడే గ్రూప్ మ్యాచ్​కు రెడీ అయింది. ఎన్నో అంచనాలతో స్వదేశంలో ఆడుతున్న భారత జట్టును సొంత ప్రేక్షకుల మధ్య ఓడించాలని అనుకుంది పాక్. వరల్డ్ కప్స్​లో భారత్​పై ఉన్న ఓటముల రికార్డులను తిరగరాయాలని అనుకుంది. కానీ మళ్లీ నిరాశే మిగిలింది. ఆ మ్యాచ్​లో రోహిత్ సేన చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది దాయాది జట్టు. అయితే ఆ మ్యాచ్​లో జరిగిన ఓ ఘటన వల్లే తమ జట్టుకు ఇన్ని ఓటములు వస్తున్నాయని పాక్ ఫ్యాన్స్ అంటున్నారు.

ఆ మ్యాచ్​లో పాక్ ఇన్నింగ్స్​ టైమ్​లో వికెట్ దక్కలేదనే కసితో మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా.. చివరికి ఇమాముల్ హక్​ను ఔట్ చేశాడు. అయితే అతడ్ని ఔట్ చేసిన బాల్​ వేయడానికి ముందు ఏదో మంత్రం చదువుతూ కనిపించాడు పాండ్యా. ఈ దెబ్బకు ఇమాముల్​తో పాటు మరో 120 పరుగుల గ్యాప్​లో పాక్ టీమ్ మొత్తం కుప్పకూలిపోయింది. అప్పట్లోనే ఈ విషయం వైరల్​గా మారింది. వరల్డ్ కప్​లో టీమిండియా చేతిలో ఓటమి తర్వాత పాకిస్థాన్ ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. మెగాటోర్నీలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ లాంటి బలమైన జట్లతో పాటు ఆఫ్ఘానిస్థాన్ చేతిలోనూ ఓడి సెమీస్​కు చేరకుండానే బయటకు వచ్చేసింది. ప్రపంచ కప్ ముగిసిన తర్వాత కోచింగ్ స్టాఫ్​ మొత్తాన్ని మార్చేసింది పాక్. బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో.. వైట్​బాల్ క్రికెట్​లో పేసర్ షాహిన్ అఫ్రిదీకి జట్టు పగ్గాలు అప్పగించింది పీసీబీ.

ఇక, వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియా టూర్​కు వెళ్లిన దాయాది జట్టు అక్కడ జరిగిన టెస్ట్ సిరీస్​లో వైట్​వాష్​కు గురైంది. అనంతరం ఐదు టీ20ల సిరీస్ కోసం న్యూజిలాండ్​కు వెళ్లగా.. ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది. దీంతో వరల్డ్ కప్​లో పాండ్యా వేసిన మంత్రం వల్లే తమ జట్టు ఇలా ఓడిపోతోందని పాక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అర్థం పర్థం లేని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, మెగాటోర్నీలో పాక్​తో మ్యాచ్ తర్వాత తానేమీ మంత్రం వేయలేదని.. తనను తాను మోటివేట్ చేసుకున్నానని హార్దిక్ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చాడు. మరి.. పాక్​కు హార్దిక్ శాపంగా మారాడనే వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.