iDreamPost
android-app
ios-app

ఆడలేక మద్దెలు ఓడు అన్నట్లుంది.. పాకిస్తాన్ టీమ్ తీరు!

  • Author Soma Sekhar Published - 04:05 PM, Tue - 31 October 23

వరల్డ్ కప్ లో తమ జట్టు వైఫల్యానికి కారణాలు వెతుక్కునే పనిలో పడ్డాడు పాక్ కోచ్ గ్రాంట్ బ్రాడ్ బర్న్. పాక్ వైఫల్యానికి కొత్త కారణం చెప్పి నవ్వుల పాలవుతున్నాడు పాక్ కోచ్.

వరల్డ్ కప్ లో తమ జట్టు వైఫల్యానికి కారణాలు వెతుక్కునే పనిలో పడ్డాడు పాక్ కోచ్ గ్రాంట్ బ్రాడ్ బర్న్. పాక్ వైఫల్యానికి కొత్త కారణం చెప్పి నవ్వుల పాలవుతున్నాడు పాక్ కోచ్.

  • Author Soma Sekhar Published - 04:05 PM, Tue - 31 October 23
ఆడలేక మద్దెలు ఓడు అన్నట్లుంది.. పాకిస్తాన్ టీమ్ తీరు!

వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ చెత్త ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. తన కంటే చిన్న జట్టు అయిన ఆఫ్గానిస్తాన్ చేతిలో ఓడిపోయి.. పరువు పోగొట్టుకుంది. దీంతో పాక్ మాజీ ఆటగాళ్లే విమర్శలు గుప్పించారు. అదీకాక చిరకాల ప్రత్యర్థి అయిన టీమిండియాపై పాక్ ఓడిపోవడం పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు ప్రపంచ కప్ లో ఆడిన ఆరు మ్యాచ్ ల్లో కేవలం రెండు మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించి.. సెమీస్ చేరే అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. ఇక వరల్డ్ కప్ లో తమ జట్టు వైఫల్యానికి కారణాలు వెతుక్కునే పనిలో పడ్డారు పాక్ కోచ్ గ్రాంట్ బ్రాడ్ బర్న్. పాక్ వైఫల్యానికి కొత్త కారణం చెప్పి నవ్వుల పాలవుతున్నాడు పాక్ కోచ్. మరి వరల్డ్ కప్ లో వైఫల్యానికి పాక్ కోచ్ చెప్పిన రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

‘ఆడలేక మద్దెల ఓడు’.. అన్నట్లుంది పాక్ కోచ్ తీరు. వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఘోరంగా విఫలం అవుతోంది. ఆడిన 6 మ్యాచ్ ల్లో 2 విజయాలతో సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో జట్టుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితికి కారణం టీమిండియా అంటూ అర్ధం పర్థం లేని కామెంట్స్ చేశాడు. ప్రపంచ కప్ లో పాక్ వైఫల్యంపై కోచ్ బ్రాడ్ బర్న్ మాట్లాడుతూ..”భారత్ లో ప్రతీ మైదానం పాక్ ఆటగాళ్లకు కొత్తే. ఎందుకంటే? చాలా కాలంగా భారత్ లో క్రికెట్ ఆడలేదు పాకిస్థాన్ జట్టు. దీంతో పాక్ ఆటగాళ్లకు పిచ్ లపై సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎంత ప్రాక్టీస్ చేసినా.. లాభం లేకుండా పోయింది. టోర్నీ ప్రారంభంలో బాగానే ఆడినా.. తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

వరుస ఓటములతో ప్రస్తుతం కోలుకోలేని పరిస్థితిలో ఉంది. మ్యాచ్ లకు ముందు ఎంత బాగా సిద్దమైనా.. ఎన్ని వ్యూహాలు పన్నినా.. ప్రత్యర్థిని నిలువరించలేకపోతోంది. దానికి ఒకే ఒక్క కారణం భారత పిచ్ లపై పాక్ ఆడకపోవడమే” అంటూ చౌకబారు రీజన్స్ చెప్పి.. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ కామెంట్స్ విన్న క్రికెట్ ఫ్యాన్స్ పాక్ కోచ్ పై సెటైర్లు వేస్తున్నారు. మీకు ఆడటం చేతకాక.. పిచ్ లపై అబాండాలు వేస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఆడలేక మద్దెల ఓడు అంటే ఇదేనేమో అంటూ ఇంకొందరు సరదాగా పాక్ కోచ్ ను విమర్శిస్తున్నారు. ముందు మీ ఆటగాళ్లకు మంచిగా పాఠాలు నేర్పు అంటూ సలహాలు ఇస్తున్నారు. మరి వరల్డ్ కప్ లో పాక్ వైఫల్యాలపై కోచ్ బ్రాడ్ బర్న్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.