iDreamPost
android-app
ios-app

సెమీస్ లో టీమిండియాతో తలపడే జట్టేదో ఇలా ముందే తెలుసుకోవచ్చు!

  • Author Soma Sekhar Published - 03:40 PM, Wed - 8 November 23

వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో టీమిండియాతో తలపడబోయే టీమ్ ఏదని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పాక్, న్యూజిలాండ్, ఆఫ్గాన్ జట్లలో సెమీస్ లో టీమిండియాతో తలపడే జట్టేదో ఇలా ముందే తెలుసుకోవచ్చు!

వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో టీమిండియాతో తలపడబోయే టీమ్ ఏదని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పాక్, న్యూజిలాండ్, ఆఫ్గాన్ జట్లలో సెమీస్ లో టీమిండియాతో తలపడే జట్టేదో ఇలా ముందే తెలుసుకోవచ్చు!

  • Author Soma Sekhar Published - 03:40 PM, Wed - 8 November 23
సెమీస్ లో టీమిండియాతో తలపడే జట్టేదో ఇలా ముందే తెలుసుకోవచ్చు!

ప్రపంచ కప్ 2023 తుది దశకు చేరుకుంటోంది. ఇక ఆఫ్గానిస్తాన్ పై ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించి సెమీస్ కు దూసుకెళ్లడంతో.. పోటీ రసవత్తరంగా మారింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానం కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. అందులో ఆఫ్గాన్, న్యూజిలాండ్, పాకిస్థాన్ టీమ్స్ ఉన్నాయి. ఇక ఇప్పటికే టీమిండియా, సౌతాఫ్రికా, ఆసీస్ జట్లు సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే. చివరిదైన నాలుగో ప్లేస్ కోసం ఈ మూడు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా.. ఈ త్రీ టీమ్స్ లో భారత్ తో సెమీస్ లో ఏ జట్టు తలపడే అవకాశం ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం.

వరల్డ్ కప్ లో నాలుగో స్థానం కోసం తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది. ఈ ఒక్క స్థానం కోసం మూడు జట్ల మధ్య పోరాటం రసవత్తరంగా మారింది. దీని కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్గాన్ జట్లు పోటీ పడుతున్నాయి. ఇక పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో నాలుగో ప్లేస్ లో కివీస్, ఐదో స్థానంలో పాక్, ఆరవ స్థానంలో ఆఫ్గాన్ జట్లు కొనసాగుతున్నాయి. ఈ మూడు టీమ్స్ తమ చివరి మ్యాచ్ లు త్వరలోనే ఆడనున్నాయి. ఈనెల 9న కివీస్-శ్రీలంక, 10న ఆఫ్గాన్-సౌతాఫ్రికా, 11న పాక్-ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. కాగా.. వీటిల్లో టీమిండియాతో కివీస్ తలపడాలంటే.. శ్రీలంకను ఓడించాలి. పాక్ జట్టుపై ఇంగ్లాండ్ విజయం సాధించాలి. అయితే ఇంగ్లాండ్ పై పాక్ గెలిచినప్పటికీ.. ఆ జట్టు 130 రన్స్ కంటే మించి ఎక్కువ పరుగులతో ఓడిపోకూడదు.

ఇదిలా ఉండగా.. సెమీస్ లో దాయాదుల సమరం చూడాలంటే లంకపై కివీస్ ఓడిపోవాలి. లేదా మ్యాచ్ టై, రద్దు కావాలి. ఇక ఆఖరిగా ఇండియా వర్సెస్ ఆఫ్గాన్ మ్యాచ్ సెమీస్ లో చూడాలంటే.. సౌతాఫ్రికాపై ఆఫ్గాన్ విజయం సాధించాల్సి ఉంటుంది. కివీస్ పై లంక ఓడిపోవాలి. పాక్ టీమ్ ఇంగ్లాండ్ పై ఓడిపోవాలి. ఇక ఈ గణాంకాల ప్రకారం చూసుకుంటే.. టీమిండియాతో సెమీస్ లో తలపడే అవకాశాలు ఎక్కువగా న్యూజిలాండ్ కే ఉన్నాయంటున్నారు క్రీడా పండితులు. ప్రస్తుతం మిగతా రెండు జట్ల కంటే న్యూజిలాండ్ రాణిస్తోంది. దీంతో ఆ టీమే వరల్డ్ కప్ సెమీస్ లో టీమిండియాను ఢీ కొంటుందని చెప్పుకొస్తున్నారు. మరి సెమీస్ లో భారత జట్టును ఢీ కొనబోయే టీమ్ ఏది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.