Aman Sehrawat: అమన్ సెహ్రావత్.. ఒలింపిక్ పతకం సాధించిన ఓ అనాథ సక్సెస్ స్టోరీ!

Aman Sehrawat Life Story: అమన్ సెహ్రావత్.. ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ కు రెజ్లింగ్ లో ఏకైక పతకాన్ని అందించిన హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు. అనాథ నుంచి ఒలింపిక్ విజేతగా నిలిచిన అమన్ విజయ స్ఫూర్తి ప్రస్థానం గురించి తెలుసుకుందాం పదండి.

Aman Sehrawat Life Story: అమన్ సెహ్రావత్.. ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ కు రెజ్లింగ్ లో ఏకైక పతకాన్ని అందించిన హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు. అనాథ నుంచి ఒలింపిక్ విజేతగా నిలిచిన అమన్ విజయ స్ఫూర్తి ప్రస్థానం గురించి తెలుసుకుందాం పదండి.

విధి అతడితో ఎన్నో వింత నాటకాలు ఆడింది. మోయలేని బరువును భుజాలపై మోపింది, అన్నింటి కంటే మించి కన్న తల్లిదండ్రులు పసితనంలోనే దూరం చేసింది. ఇన్ని కష్టాల మధ్య తాను కల కన్ననెరవేరుతుందా? అన్న సందేహం బంధువులు, సన్నిహితులకు వచ్చిందేమో కానీ, అతడిలో మాత్రం రాలేదనుకుంటా. వస్తే ఇప్పుడు మనం ఆ పోరాట యోధుడి గురించి మాట్లాడుకునే వాళ్లం కాదు. ఆ యోధుడి పేరే అమన్ సెహ్రావత్. ప్రస్తుతం దేశం మెుత్తాన్ని తలెత్తుకునేలా చేసిన విజేత. మరి అనాథ నుంచి ఒలింపిక్ విజేతగా నిలిచిన అమన్ విజయ స్ఫూర్తి ప్రస్థానం గురించి తెలుసుకుందాం పదండి.

అమన్ సెహ్రావత్.. ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ కు రెజ్లింగ్ లో ఏకైక పతకాన్ని అందించిన హీరోగా ప్రశంసలు అందుకుంటున్నాడు అమన్. అయితే 21 ఏళ్ల ఈ కుర్ర రెజ్లర్ సాధించిన పతకం వెనక తీరని శోకం ఉందని చాలా తక్కువ మందికే తెలుసుకాబోలు. 2003 జులై 16న హర్యానా లోని బిరహర్ గ్రామంలో జన్మించాడు. ఇక 9 ఏళ్ల వయసులోనే తండ్రి ప్రోత్సాహంతో మట్టిలో రెజ్లింగ్ కు సంబంధించిన ఓనమాలు నేర్చుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్ లో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ రజతం గెలిచిన క్షణాన్ని టీవీలో చూసి, నేను కూడా ఢిల్లీలోని ఛత్ర్ శాల్ రెజ్లింగ్ సెంటర్ కు వెళ్లి ఎప్పటికైనా గొప్ప రెజ్లర్ అవుతానని నాన్నతో చెప్పేవాడు.

కానీ విధి వేరేలా తలచింది. అనుకోని విధంగా అమన్ తల్లిదండ్రులు మరణించడంతో అతడి జీవితం తలకిందులు అయ్యింది. అయితే తాత పెంపకంలో కొన్ని రోజులు పెరిగిన తర్వాత సన్నిహితుల ద్వారా 11 ఏళ్ల వయసులో ఛత్ర్ శాల్ రెజ్లింగ్ సెంటర్ కు చేరుకున్నాడు. అప్పటి నుంచి అదే అతడి ఇల్లుగా మారిపోయింది. రెజ్లింగ్ తప్ప అతడికి మరో ధ్యాస లేకుండా పోయింది. కోచ్ లలిత్ కుమార్ శిక్షణలో ఆరితేరాడు. 18 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ విజేతగా నిలిచాడు. ఈ తర్వాత పలు టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చాడు.

ఇక 19 ఏళ్ల వయసులో అండర్ -23 వరల్డ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ గెలవడంతో.. అందరి దృష్టిని ఆకర్షించాడు. దాంతో ఫ్యూచర్ స్టార్ గా అవతరిస్తాడు అందరూ ఒక అంచనాకు వచ్చారు. అందుకు తగ్గట్లుగానే 2022 ఆసియా క్రీడల్లో కాంస్యం, గతేడాది ఆసియా ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించాడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని మెగా టోర్నీల్లో నిరాశ పరిచి, పరాజయాల పాలైయ్యాడు. ఇలాంటి సమయంలో అతడికి ఓ స్టార్ రెజ్లర్ నుంచి ఊహించని ఫోన్ కాల్ వచ్చింది. అది చేసింది ఎవరో కాదు.. సుశీల్ కుమార్. “నీకు డిఫెన్స్ పనికి రాదు. నీ ఆటకు తగ్గట్లు ఎటాకింగ్ గేమ్ నే ఎంచుకో” అంటూ అతడు ఇచ్చిన సలహాతో అమన్ తిరిగి పుంజుకున్నాడు.

ఇదంతా ఒకెత్తు అయితే ఒలింపిక్స్ కు క్వాలిఫై కోసం తన గురువు రవి దహియాతో పోటీ పడి గెలవడం మరొకెత్తు. 57 కేజీల విభాగంలో పారిస్ ఒలింపిక్స్ వెళ్లేందుకు ఒక్కరికే అవకాశం ఉంది. రవి దహియా కూడా ఇదే విభాగంలో పోటీ పడుతున్నాడు. దాంతో ఇద్దరి మధ్య జరిగిన క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో గురువును ఓడించి పారిస్ ఒలింపిక్స్ బెర్త్  ను ఖరారు చేసుకుని, నేడు మన ముందు కాంస్య విజేతగా నిలబడ్డాడు. దేశం మెుత్తాన్ని గర్వించేలా చేసిన అమన్ ప్రస్తుతం ఓ హీరో.  అనాథ నుంచి ఒలింపిక్ విజేతగా మారిన అతడి జీవితం ఇప్పుడు ఎందరికో స్ఫూర్తి. అమన్ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments