Tirupathi Rao
Paraguay Swimmer Luana Alonso Olympics History And Background Details: ఒక స్విమ్మల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఆమెను ఒలింపిక్స్ నుంచి సొంతం దేశమే పంపేసింది అంటూ వార్తలు వచ్చాయి. అందుకు ఆమె అందంగా ఉండటమే కారణంగా చెప్పడంతో మరింత వైరల్ అయ్యింది. అయితే అసలు ఆ కథ ఏంటో చూద్దాం.
Paraguay Swimmer Luana Alonso Olympics History And Background Details: ఒక స్విమ్మల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఆమెను ఒలింపిక్స్ నుంచి సొంతం దేశమే పంపేసింది అంటూ వార్తలు వచ్చాయి. అందుకు ఆమె అందంగా ఉండటమే కారణంగా చెప్పడంతో మరింత వైరల్ అయ్యింది. అయితే అసలు ఆ కథ ఏంటో చూద్దాం.
Tirupathi Rao
పారిస్ ఒలింపిక్స్ 2024లో ఎన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ వింటున్నాం. కొందరు పతకాలు సాధించి తమ వీర గాథలను చెబుతుంటే.. ఇంకొందరు పతకాలు చేజార్చుకుని కన్నీటి గాథలు వినిపిస్తున్నారు. వీటన్నింటి మధ్య ఒక వింత కథ వినిపిస్తోంది. ఆ స్టోరీ విన్న తర్వాత ఆ స్విమ్మర్ పై జాలి పడాలో? ఆమెపై వస్తున్న ఆరోపణలు నిజమని నమ్మాలో ఎవరికీ అర్తం కావడం లేదు. మొత్తానికి ఆమె అందమే ఆమెకు శాపమైంది అంటున్నారు. ఆ స్విమ్మర్ మెరవరో కాదు.. పరాగ్వేకి చెందిన లువానా అలోన్సో. ఆమె అందం వల్ల తాము డిస్టర్బ్ అవుతున్నామని సొంత దేశానికి చెందిన మేల్ అథ్లెట్స్ ఫిర్యాదు చేయడంతో ఒలింపిక్స్ గ్రామం నుంచి పంపేశారు అంటున్నారు.
ప్రస్తుతం ఈ పరాగ్వే స్విమ్మర్ లువానా అలోన్సో టాక్ ఆఫ్ ది ఒలింపిక్స్ టౌన్ గా మారిపోయింది. 100 మీటర్స్ బటర్ ఫ్లై ఈవెంట్ లో కేవలం 0.24 సెకన్ల తేడాతో ఈమె క్వాలిఫికేషన్ నుంచి తప్పుకుంది. అయినా ఇంకా ఒలిపింక్స్ గ్రామంలోనే ఉంటూ.. తన దేశం వారిని చీర్ చేస్తూ వస్తోంది. తోటి అథ్లెట్స్ తో కలివిడిగా కలిసిపోతోంది. అయితే అదే ఇప్పుడు ఆమెకు చిక్కులు తీసుకొచ్చాయి. ఈ 20 ఏళ్ల టాలెంటెడ్ స్విమ్మర్ ను ఒలింపిక్స్ గ్రామం నుంచి సొంత దేశం వాళ్లే వెళ్లిపోవాలని కోరారు. అందుకు ఆమె ప్రవర్తనే కారణంగా చెబుతున్నారు. ఆమె చూడటానికి ఎంతో అందంగా ఉండటంతో ఆమె తమ ఏకాగ్రతను దెబ్బతీస్తోంది అని పరాగ్వే మేల్ అథ్లెట్స్ ఫిర్యాదు చేశారంట. అలాగే ఆమె ప్రవర్తన కూడా అభ్యంతరకరంగా ఉందని చెప్పారంట. ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం పడుతుందని ఆమెను వెళ్లిపోవాల్సిందిగా కోరారంట. అలాగే ఆమె తన కెరీర్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఒలిపింక్స్ లో అర్హత సాధించలేకపోయిన తర్వాత తాను స్విమ్మింగ్ కు వీడ్కోలు పలికింది.
లువానా అలోన్సో సెప్టెంబర్ 19, 2004న జన్మించింది. ఈమె బెస్ట్ కాంపిటేటివ్ స్విమ్మర్. ఎక్కువగా బటర్ ఫ్లై ఈవెంట్స్ లో పోటీ పడుతూ ఉంటుంది. ఆమె ప్రస్తుతం అమెరికాలో తన చదువును కొనసాగిస్తోంది. డల్లాస్ లోని సదరన్ మెథోడిస్ట్ యూనివర్సిటీలో చదువుతోంది. ఈమె తొలుత 2020 టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంది. అయితే కేవలం 28వ స్థానంతో సరిపెట్టుకుంది. సెమీ ఫైనల్స్ కు క్వాలిఫై కాలేదు. ఈ పారిస్ ఒలింపిక్స్ 2024లో హీట్స్ లో 6వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈమె యూత్ ఒలింపిక్స్ లో కూడా తన సత్తా చాటింది. అలాగే సౌత్ అమెరికా గేమ్స్, వరల్డ్ ఛాంపియన్ షిప్స్ లో కూడా తన మార్క్ చూపించింది.
లువానా అలోన్సో.. పారిస్ ఒలింపిక్స్ కి ముందు తన మనసులో మాట బయట పెట్టింది. అది చాలా పెద్దఎత్తున విమర్శలకు తావిచ్చింది. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో పరాగ్వేకి కాకుండా.. తనకు అమెరికాకి ప్రాతినిధ్యం వహించాలి అని ఉందని చెప్పింది. ఆ వ్యాఖ్యలు చాలానే దుమారం రేపాయి. ఆ తర్వాత ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. తన తోటి అథ్లెట్లకు సపోర్ట్ చేయడం కంటే.. ఆమె డిస్నీ ల్యాండ్ లోనే ఎక్కువ గడిపింది అంటూ పత్రికల్లో వార్తలు వచ్చాయి. అథ్లెట్స్ ని కూడా తన మాటలతో డిస్ట్రాక్ చేస్తోంది అంటూ విమర్శలు వచ్చాయి. అయితే తనని ఒలింపిక్స్ నుంచి పంపేశారు అనే వాదనను లువానా అలోన్సో ఖండించింది. తనను ఎవరూ ఎక్కడి నుంచి వెళ్లగొట్ట లేదని.. తప్పుడు ప్రచారాలు ఆపాలంటూ కోరింది. మొత్తానికి ఈమె ఇప్పుడు క్రీడా లోకంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇన్ స్టాగ్రామ్ లో ఈమెకు 1 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.