రోహిత్ శర్మ.. అతడో పది ఓవర్లు క్రీజులో ఉంటే ప్రత్యర్థి జట్టు మ్యాచ్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. ఇక సెటిలైతే ఆ రోజు చాలా రికార్డులు బ్రేక్ అయినట్లే. నీళ్లు తాగినంత అలవోకగా సిక్సులు కొట్టేయగల సమర్థుడతను. వరల్డ్ కప్ అంటే చాలు.. బీస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోతాడు హిట్‌మ్యాన్. మెగా టోర్నీలో తీవ్ర ఒత్తిడి మధ్య పరుగుల వరద ఎలా పారించాలో అతడికి బాగా తెలుసు. అయితే ఇంత పెద్ద టోర్నీలో ఫస్ట్ టైమ్ టీమ్‌కు కెప్టెన్సీ చేస్తున్నా ఎక్కడా ఆ ప్రెజర్ కనిపించనీయలేదు. ఆఫ్ఘానిస్థాన్‌పై భారీ సెంచరీతో భారత్‌కు మళ్లీ ఊపు తీసుకొచ్చాడు రోహిత్. ఒక్క మ్యాచ్‌తో అనేక రికార్డులను తన అకౌంట్లో జమచేసుకున్నాడు.
ఆస్ట్రేలియాతో ఫస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగినా ఆ ఎఫెక్ట్ ఈ మ్యాచ్‌లో ఎక్కడా కనిపించలేదు. తన ట్రేడ్ మార్క్ పుల్, లాఫ్టెడ్ షాట్లతో ప్రపంచ కప్‌లోనే టీమిండియా తరఫున అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా ఘతన సాధించాడు. 40 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డును హిట్‌మ్యాన్ చెరిపేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 84 బంతుల్లోనే 131 రన్స్ చేయగా.. అందులో 16 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ పెర్ఫార్మెన్స్తో పలు రికార్డులను అతడు బ్రేక్ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక సిక్సులు కొట్టిన ప్లేయర్‌గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మూడో సిక్సర్ బాదిన హిట్‌మ్యాన్.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌ను అధిగమించాడు.
వెస్టిండీస్ బ్యాటింగ్ గ్రేట్ క్రిస్ గేల్ ఇంటర్నేషనల్ క్రికెట్లో 553 సిక్సులు బాదాడు. ఇప్పుడీ లిస్టులో 555 సిక్సులతో ఫస్ట్ ప్లేసులో నిలిచాడు హిట్‌మ్యాన్. ఈ జాబితాలో రోహిత్, గేల్ తర్వాతి స్థానాల్లో షాహిద్ అఫ్రిదీ (476 సిక్సులు), బ్రెండన్ మెకల్లమ్ (398 సిక్సులు), మార్టిన్ గప్తిల్ (383 సిక్సులు) ఉన్నారు. తన రికార్డును బ్రేక్ చేసిన రోహిత్‌ను గేల్ అభినందించాడు. హిట్‌మ్యాన్‌తో కలసి దిగిన ఓ ఫొటోను నెట్టింట షేర్ చేశాడు గేల్. ఇద్దరి జెర్సీ నంబర్ ఒకటే (45).. ఇదే తమకు స్పెషల్ అంటూ రోహిత్‌ను మెచ్చుకున్నాడు గేల్. యూనివర్సల్ బాస్ ట్వీట్‌పై రోహిత్ స్పందించాడు. ఇద్దరి జెర్సీల వెనుక 4,5 ఉన్నప్పటికీ తమ ఫేవరెట్ నంబర్ మాత్రం 6 అని రోహిత్ ఫన్నీగా రిప్లయ్ ఇచ్చాడు.
ఇదీ చదవండి: VIDEO: కోహ్లీకి గురించి చెడుగా మాట్లాడే వారికి గట్టి కౌంటర్ ఇచ్చిన లెజెండరీ క్రికెటర్!
Congrats, @ImRo45 – Most Sixes in International cricket. #45 Special 🙌🏿 pic.twitter.com/kmDlM1dIAj
— Chris Gayle (@henrygayle) October 11, 2023