iDreamPost
android-app
ios-app

టీమిండియాకు అసలు ప్రత్యర్థి ఆస్ట్రేలియానో, పాకిస్థానో కాదు.. అమెరికా! ఎలాగంటే?

  • Published Jun 07, 2024 | 5:11 PM Updated Updated Jun 07, 2024 | 5:11 PM

USA, T20 World Cup 2024, India, Pakistan: ఎలాగైనా వరల్డ్‌ కప్‌ సాధించాలని బరిలోకి దిగిన టీమిండియాకు ఒక్క శత్రువు తయారైంది. ఆ జట్టుతోనే గ్రూప్‌ దశలోనే రోహిత్‌ సేనకు భారీ ముప్పు పొంచి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

USA, T20 World Cup 2024, India, Pakistan: ఎలాగైనా వరల్డ్‌ కప్‌ సాధించాలని బరిలోకి దిగిన టీమిండియాకు ఒక్క శత్రువు తయారైంది. ఆ జట్టుతోనే గ్రూప్‌ దశలోనే రోహిత్‌ సేనకు భారీ ముప్పు పొంచి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Jun 07, 2024 | 5:11 PMUpdated Jun 07, 2024 | 5:11 PM
టీమిండియాకు అసలు ప్రత్యర్థి ఆస్ట్రేలియానో, పాకిస్థానో కాదు.. అమెరికా! ఎలాగంటే?

ఈ టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో ఊహించని ఫలితం వచ్చింది. గ్రూప్‌లో టీమిండియా తర్వాత స్ట్రాంగెస్ట్‌ టీమ్‌గా ఉన్న పాకిస్థాన్‌ను పసికూన అమెరికా చిత్తుగా ఓడించింది. పైగా మ్యాచ్‌ సూపర్‌ ఓవర్ వరకు వెళ్లినా.. పాక్‌ విజయం సాధించలేకపోయింది. అయితే.. ఈ టోర్నీలో టీమిండియాకు ప్రధాన ప్రత్యర్థి ఆస్ట్రేలియా అంటూ చాలా మంది తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అలాగే గ్రూప్‌ దశలో పాకిస్థాన్‌తో కూడా డేంజర్‌ అనే మరికొంత మంది అన్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే.. ఇండియాకు ప్రధాన శత్రువు ఆస్ట్రేలియానో, పాకిస్థానో కాదు.. అమెరికా అంటూ క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా చూద్దాం..

ఈ టోర్నీలో పాల్గొంటున్న 20 జట్లను నాలుగు గ్రూపులుగా విడదీశారు. ప్రతి గ్రూప్‌లో ఐదేసి టీమ్స్‌ ఉన్నాయి. గ్రూప్‌-ఏలో ఇండియా, ఐర్లాండ్‌, పాకిస్థాన్‌, అమెరికా, కెనడా జట్లు ఉన్నాయి. టీమిండియా ఇప్పటికే ఐర్లాండ్‌ను ఓడించింది. మిగతా టీమ్స్‌ ఒక్కో మ్యాచ్‌ ఆడనుంది. అలాగే అమెరికా ఇప్పటికే రెండు టీమ్స్‌.. కెనడా, పాకిస్థాన్‌ జట్లను ఓడించింది. పాకిస్థాన్‌ను ఓడించిన టీమ్‌కు ఐర్లాండ్‌ను ఓడించడం పెద్ద విషయం కాదు. అలాగే టీమిండియాతో ఒక్కటే ప్రస్తుతం అమెరికాకు టఫ్‌ మ్యాచ్‌లా కనిపిస్తోంది. ఒక వేళ అమెరికా టీమిండియాకు కూడా షాక్ ఇస్తుందా? అనే అనుమానం క్రికెట్‌ అభిమానుల్లో కలుగుతోంది.

ఎందుకంటే.. ఈ నెల 12న ఇండియా, అమెరికా మధ్య నసావు కౌంటీ క్రికెట్‌ స్టేడియంలో క్రికెట్‌ ఆడనుంది. హోం టీమ్‌గా అమెరికాకు కాస్త అడ్వాంటేజ్‌ ఉండొచ్చు. అమెరికా పరిస్థితుల్లో ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభవం అమెరికా టీమ్‌లోని క్రికెటర్లకు ఉంది. ఆ అనుభవంతోనే ఆ జట్టు పాక్‌ను ఓడించింది. అదే ఉత్సాహంతో టీమిండియాతో మ్యాచ్‌కు కూడా అమెరికా సిద్ధం అవ్వడం ఖాయం. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే.. ఓకే లేదా మ్యాచ్‌ కాస్త అటూ ఇటూ అయినా.. అమెరికాతో జరిగే మ్యాచ్‌లో ఇండియాపై ఒత్తిడి ఉంటుంది. మరి గ్రూప్‌ దశలోనే పాకిస్థాన్‌ కాకుండా ఇండియాకు పెద్ద తలనొప్పిగా అమెరికా మారడంపై మీ అభిప్రాయలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.