CSK vs LSG: గ్రేట్ కెప్టెన్ అనే ధోని వల్లే నిన్న మ్యాచ్ ఓడిపోయిన చెన్నై! ఇంత పిచ్చి పని ఎలా చేశాడు!

గ్రేట్ కెప్టెన్ గా, మాస్టర్ మైండ్ గా పేరుగాంచిన ధోని వల్లే లక్నోతో జరిగిన మ్యాచ్ లో చెన్నై ఓడిపోయిందని, ఇంత పిచ్చిపని ఎలా చేశాడు? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ధోని ఏం చేశాడంటే?

గ్రేట్ కెప్టెన్ గా, మాస్టర్ మైండ్ గా పేరుగాంచిన ధోని వల్లే లక్నోతో జరిగిన మ్యాచ్ లో చెన్నై ఓడిపోయిందని, ఇంత పిచ్చిపని ఎలా చేశాడు? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ధోని ఏం చేశాడంటే?

లక్నో సూపర్ జెయింట్స్ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. జడేజా, పతిరణ, ముస్తాఫిజుర్, దీపక్ చాహర్ లాంటి అద్భుతమైన బౌలర్లు, అదీకాక కెప్టెన్ గా రుతురాజ్ బాగానే రాణిస్తున్నాడు. ఇక అతడి వెనక కొండంత అండ, మాస్టర్ మైండ్ ధోని ఉండనే ఉన్నాడు. గైక్వాడ్ కు సలహాలు, సూచనలు ఇస్తూ తెరవెనక ఎత్తులు వేస్తుంటాడు ధోని. దీంతో ఈ మ్యాచ్ లో లక్నోకు ఘోర పరాభవం తప్పదని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా చెలరేగిన స్టోయినిస్ లక్నోకు తిరుగులేని విజయాన్ని అందించాడు. అయితే గ్రేట్ కెప్టెన్ గా, మాస్టర్ మైండ్ గా పేరుగాంచిన ధోని వల్లే ఈ మ్యాచ్ లో చెన్నై ఓడిపోయిందని, ఇంత పిచ్చిపని ఎలా చేశాడు? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ధోని ఏం చేశాడంటే?

మహేంద్రసింగ్ ధోని.. మాస్టర్ మైండ్, మిస్టర్ కూల్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ఓడిపోయే మ్యాచ్ ను సైతం ప్రత్యర్థినుంచి తన లాగేసుకోవడంలో దిట్ట ధోని. ఈ విషయం చరిత్రలో ఎన్నోసార్లు రుజువైంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకుని రుతురాజ్ కు ఆ బాధ్యతలు అప్పగించాడు. కానీ అతడి వెనకే ఉంటూ.. సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. కానీ లక్నోతో జరిగిన మ్యాచ్ లో గ్రేట్ కెప్టెన్ గా తన అనుభవాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు? ఆ చెత్త నిర్ణయం రుతురాజ్ తీసుకుంటుంటే ఎందుకు అడ్డుకోలేదు? దీని వల్లే లక్నో చేతిలో చెన్నై ఓడిపోయిందని నెటిజన్లు, ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. అసలేం జరిగిందంటే?

15 ఓవర్లకు లక్నో 137/3తో ఓటమిపై ఆశలు వదులుకునే ఉంది. ఎందుకంటే? చివరి 5 ఓవర్లలో 74 పరుగలు కావాలి. ఇలాంటి టైమ్ లో శార్దూల్ ఠాకూర్ వేసిన ఓవర్లో పూరన్ వరుసగా 6, 4, 6 బాది.. 20 పరుగులు పిండుకున్నాడు. ఇక ముస్తాఫిజుర్ వేసిన 18 ఓవర్లో 15 వచ్చాయి. అయితే 17వ ఓవర్లో 7 రన్స్ మాత్రమే ఇచ్చాడన్న నమ్మకంతో పతిరణకు 19వ ఓవర్ ఇచ్చాడు గైక్వాడ్. కానీ ఈ ఓవర్ లో మూడు ఫోర్లతో 15 పరుగులు రాబట్టారు లక్నో బ్యాటర్లు స్టోయినిస్, దీపక్ హుడా. ఇక చివరి ఓవర్లో లక్నో విజయానికి 17 రన్స్ అవసరం కాగా.. గైక్వాడ్ ముస్తాఫిజుర్ కు బంతిని అందించాడు. ఇక్కడే చెన్నై ఓటమి ఖాయమైంది. తన మరుసటి ఓవర్లోనే 15 రన్స్ ఇచ్చాడు ముస్తాఫిజుర్.

అప్పటికే అతడి బౌలింగ్ లో దంచికొడుతున్న లక్నో బ్యాటర్ స్టోయినిస్ వరుస బంతుల్లో 6, 4, 4 నోబాల్, 4తో ఇన్నింగ్స్ ముగించాడు. అయితే ఇక్కడ ధోని చేసిన పెద్ద తప్పు ఏంటంటే? దీపక్ చాహర్ కు బౌలింగ్ ఇవ్వకపోవడం. అతడు 2 ఓవర్లలో కేవలం 11 రన్స్ మాత్రమే ఇచ్చి ఓ వికెట్ కూడా తీశాడు. ఇలాంటి బౌలర్ కు చివరి ఓవర్ ఇవ్వాలన్న ఆలోచనను గైక్వాడ్ కు ధోని ఎందుకు ఇవ్వలేదు? చాహర్ కి ఆఖరి ఓవర్ ఇచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి చెన్నై ఓటమికి ధోనినే కారణం అంటున్న నెటిజన్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments