iDreamPost
android-app
ios-app

MS Dhoni: పాక్ బౌలర్ వికెట్ తీస్తే.. ధోని, గంగూలీ సెలబ్రేషన్స్! వీడియో వైరల్..

  • Published Sep 13, 2024 | 10:11 AM Updated Updated Sep 13, 2024 | 10:11 AM

MS Dhoni, Sourav Ganguly, Mohammad Asif: పాకిస్థాన్ బౌలర్ మహ్మద్ ఆసిఫ్ వికెట్ తీస్తే.. అతడితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఎంఎస్ ధోని, సౌరవ్ గంగూలీ. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

MS Dhoni, Sourav Ganguly, Mohammad Asif: పాకిస్థాన్ బౌలర్ మహ్మద్ ఆసిఫ్ వికెట్ తీస్తే.. అతడితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఎంఎస్ ధోని, సౌరవ్ గంగూలీ. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

MS Dhoni: పాక్ బౌలర్ వికెట్ తీస్తే.. ధోని, గంగూలీ సెలబ్రేషన్స్! వీడియో వైరల్..

ప్రపంచ క్రికెట్ లో టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ ఇలా ఎన్ని టీమ్స్ తో మ్యాచ్ లు ఆడినప్పటికీ.. పాక్ తో పోరు కిందకురావు. దాయాదుల పోరంటే ఆ రేంజ్ లో ఉంటుంది మరి. ఇక ఇండియా-పాక్ మ్యాచ్ అంటే ఓ యుద్ధంలా చూస్తారు ప్రపంచ క్రికెట్ అభిమానులు. అలాంటి దాయాదుల కలిసి ఒకే టీమ్ లో ఆడితే.. వికెట్ పడితే కలిసి సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి. ఇలాంటి ఓ రేర్ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాకిస్థాన్ బౌలర్ మహ్మద్ ఆసిఫ్ వికెట్ తీస్తే.. మహేంద్రసింగ్ ధోని, సౌరవ్ గంగూలీలు అతడితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ పాత వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

పాకిస్థాన్ తో టీమిండియా మ్యాచ్ అంటే చాలు.. అందరి కళ్లు టీవీలకు అతుక్కుపోతాయి. అలాంటి క్రేజ్ ఉంది దాయాది దేశాల మ్యాచ్ కు. అయితే ఇరు దేశాలకు చెందిన ఆటగాళ్లు ఒకే టీమ్ లో ఆడితే.. ఎలా ఉంటుంది? పాక్ బౌలర్ వికెట్ తీస్తే.. భారత ఆటగాళ్లు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చూడాలని చాలా మందికి ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి ఓ రేర్ ఓల్డ్ వీడియోనే నెట్టింట వైరల్ గా మారింది. ఆ మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. ఆసియా వర్సెస్ ఆఫ్రికా టీమ్స్ మధ్య గతంలో ఓ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆసియా టీమ్ తరపున పాక్, శ్రీలంక, ఇండియాతో సహా మిగిలిన ఆసియా దేశాల జట్ల ఆటగాళ్లు పాల్గొన్నారు. అలాగే ఆఫ్రికా తరఫున కూడా ఆయా దేశాల ప్లేయర్లు ఆడారు.

ఇరు దేశాల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో ఒకప్పటి పాకిస్థాన్ స్టార్ పేసర్ మహ్మద్ ఆసిఫ్ వేసిన ఓ ఇన్ స్వింగర్ ను ఎదుర్కొవడంలో ఏబీ డివిలియర్స్ విఫలం అయ్యాడు. దాంతో బాల్ సరాసరి వికెట్లను గిరాటేసింది. ఈ క్రమంలో వికెట్ కీపింగ్ చేస్తున్న ధోని సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి.. ఆసిఫ్ తో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇదే సమయంలో టీమిండియా దిగ్గజం సౌరవ్ గంగూలీ సైతం వచ్చి.. అతడిని అభినందించాడు. వీరందరు కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఓల్డ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా జట్టు 313 పరుగుల భారీ స్కోర్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Prince Shahid Abro (@princeshahidabro)