iDreamPost

Marcus Stoinis: 13 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన స్టోయినిస్! IPL హిస్టరీలో తొలి ప్లేయర్ గా..

చెన్నైతో జరిగిన మ్యాచ్ లో విధ్వంసకర సెంచరీతో 13 ఏళ్ల రికార్డ్ ను బద్దలు కొట్టాడు స్టోయినిస్. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచాడు. ఆ వివరాల్లోకి వెళితే..

చెన్నైతో జరిగిన మ్యాచ్ లో విధ్వంసకర సెంచరీతో 13 ఏళ్ల రికార్డ్ ను బద్దలు కొట్టాడు స్టోయినిస్. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Marcus Stoinis: 13 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన స్టోయినిస్! IPL హిస్టరీలో తొలి ప్లేయర్ గా..

ఈ ఐపీఎల్ సీజన్ లో మరో రసవత్తర పోరు ప్రేక్షకులకు మస్త్ మజాను ఇచ్చింది. మంగళవారం(ఏప్రిల్ 23) చెన్నై చెపాక్ వేదికగా లక్నో వర్సెస్ చెన్నై జట్లు తలపడ్డాయి. అయితే లక్నోతో మ్యాచ్ అనగానే చాలా మంది సీఎస్కే గెలుస్తుందని అనుకుని ఉంటారు. కానీ ఊహించని విధంగా లక్నో ప్లేయర్ మార్కస్ స్టోయినిస్ చెలరేగడంతో.. గైక్వాడ్ సేనకు పరాజయం తప్పలేదు. ఈ సీజన్ లక్నో చేతిలో సీఎస్కేకు ఇది రెండో ఓటమి కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్ లో విధ్వంసకర సెంచరీతో 13 ఏళ్ల రికార్డ్ ను బద్దలు కొట్టాడు స్టోయినిస్. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచాడు.

చెన్నై సూపర్ కింగ్స్ కు వరుసగా రెండో మ్యాచ్ లోనూ షాకిచ్చింది లక్నో సూపర్ జెయింట్స్. ఈ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో సీఎస్కేపై సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మెరాకిల్ సెంచరీ చేశాడు. అతడు 60 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గైక్వాడ్ ఆట ఒకెత్తు అయితే.. ఆ తర్వాత వచ్చిన శివం దుబే ఆట మరోఎత్తు. యశ్ ఠాకూర్ వేసిన 16వ ఓవర్లో వరుసగా 3 సిక్సర్లతో శివాలెత్తాడు. ఈ క్రమంలోనే 22 బంతుల్లోనే అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్ గా దుబే 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 66 రన్స్ చేశాడు.

Stoinis broke the 13-year-old record!

అనంతరం 211 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నోకు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్ లోనే క్వింటన్ డికాక్(0)ను పెవిలియన్ చేర్చాడు దీపక్ చాహర్. ఆ తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్(16) కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవలేకపోయాడు. అయితే ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా గానీ మార్కస్ స్టోయినిస్ మాత్రం అద్భుతమైన బ్యాటింగ్ తో చెలరేగాడు. నికోలస్ పూరన్(34)తో కలిసి 70 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత దీపక్ హుడా(17*)తో కలిసి 55 రన్స్ జోడించి జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఈ క్రమంలోనే 56 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు స్టోయినిస్. చివరి ఓవర్లో 17 రన్స్ అవసరం కాగా.. ముస్తాఫిజుర్ వేసిన ఈ ఓవర్లో వరుసగా 6, 4, 4నోబాల్, 4లతో లంఛనంగా విజయాన్ని పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ లో 63 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 6 సిక్సులతో 124 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో 19. 3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది లక్నో.

ఇక ఈ సెంచరీతో ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు స్టోయినిస్. క్యాష్ రిచ్ లీగ్ లో ఛేజింగ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ప్లేయర్ గా స్టోయినిస్ నిలిచాడు. దీంతో 13 సంవత్సరాల క్రితం పాల్ వాల్తాటి నెలకొల్పిన రికార్డు ఈ మ్యాచ్ లో బ్రేక్ అయ్యింది. 2011 ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ కు ఆడుతూ.. ఇదే చెన్నైపై ఛేజింగ్ లో 63 బంతుల్లో 120 పరుగులుచేసి పంజాబ్ కు విజయాన్ని అందించాడు. మరి సంచలన బ్యాటింగ్ తో 13 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన స్టోయినిస్ బ్యాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి