SNP
టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనితో తాజాగా ఓ కుర్రాడితో ఒక ఫొటో దిగాడు. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. ఆ ఫొటోలో ఉన్న కుర్రాడు మామూలోడు కాదనే విషయం కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ కుర్రాడు ఎవరు? ధోని ఎందకు అతనితో ఫొటో దిగాడు లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనితో తాజాగా ఓ కుర్రాడితో ఒక ఫొటో దిగాడు. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. ఆ ఫొటోలో ఉన్న కుర్రాడు మామూలోడు కాదనే విషయం కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ కుర్రాడు ఎవరు? ధోని ఎందకు అతనితో ఫొటో దిగాడు లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
టీమిండియా మాజీ క్రికెటర్ ధోనికి ఉన్న పాపులారిటీ, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికే ధోని ఉన్న క్రేజ్ ఇంచు కూడా తగ్గలేదు. ఇప్పటికీ ధోని ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఎక్కడికి వెళ్లినా అది టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్‌గా మారిపోతుంది. తాజాగా ఫ్యామిలీతో కలిసి ఓ పార్టీలో పాల్గొన్నాడు మహీ. అయితే.. ఆ పార్టీలో ధోనితో పాటు రిషభ్ పంత్ సైతం ఉన్నాడు. కానీ, ధోని ఓ కుర్రాడితో దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా ధోని ఎక్కడికి వెళ్లినా.. పెద్ద పెద్ద సెలబ్రెటీలే ధోనితో ఫొటో దిగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి.. ఇక్కడ మాత్రం ఏకంగా ధోనినే ఒక కుర్రాడితో ఫొటో దిగాడు. ఆ కుర్రాడిలో అంత స్పెషల్ ఏంటి? అసలు ఇంతకీ ఎవరతను? అంటూ ధోని ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేయడం మొదలుపెట్టేశారు.
ధోని లాంటి అంతర్జాతీయ లెజెండరీ క్రికెట్ స్టారే ఫొటో తీసుకున్నాడు అంటే.. ఆ కుర్రాడిలో ఏదో స్పెషాలిటీ కచ్చితంగా ఉండే ఉంటుంది అని కొంతమంది భావిస్తున్నారు. అలా భావిస్తున్న వారు వంద శాతం కరెక్ట్. ఆ కుర్రాడు మామూలోడు కాదు. అతను కూడా ఒక పెద్ద సెలబ్రెటీనే. పైగా అతను ఎదిగిన తీరుతోనే అతనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటాడు ధోని. ఆ కుర్రాడి పేరు అబ్దు రోజిక్. అతను తజికిస్థాన్‌కు చెందిన సింగర్. అలాగే హిందీ బిగ్‌బాష్ 16లో కూడా పాల్గొన్నాడు. నార్త్ ప్రేక్షకులకు రోజిక్ సుపరిచితుడే. అయితే.. రోజిక్ ఒక సింగర్‌గా, సోషల్ మీడియా ఇఫ్లూయన్సర్‌గా ఎదిగిన తీరు మాత్రం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం.
పుట్టుకతోనే మరుగుజ్జుగా ఉన్న రోజిక్.. అతని తల్లిదండ్రుల పేదరికంతో చిన్నతనంలో సరైన వైద్యం పొందలేకపోయాడు. దీంతో అతనిలో శారీరక పెరుగుదల నిలిచిపోయింది. ప్రస్తుతం రోజిక్ వయసు 20 ఏళ్లు. అయితే.. కుటుంబ ఆర్థిక్ పరిస్థితి కారణంగా చిన్నతనంలో రోజిక్ వీధుల్లో పాటలు పాడుతూ.. పైసలు సంపాదించి కుటుంబానికి ఆసరాగా నిలిచేవాడు. అప్పుడు కూడా అని శారీరక సమస్య అతనికి సమస్యగా అనిపించలేదు. తనలో టాలెంట్‌ను మాత్రమే నమ్ముకుని.. డబ్బు సంపాదించేవాడు. రోజిక్‌లోని సింగింగ్ టాలెంట్‌ను గుర్తించిన ఓ తజికిస్థానీ ర్యాపర్ రోజిక్ తండ్రిని ఒప్పించి, రోజిక్‌కు పాటలు ఇంకా బాగా పాడటం నేర్పించాడు. అక్కడితో రోజిక్ లైఫ్ పూర్తిగా మారిపోయింది. తజికస్థాన్ పాటలు పాడుతూ రోజిక్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. బిగ్‌బాష్‌తో హిందీ ప్రజలకు దగ్గరయ్యాడు. రోజిక్ పలు హిందీ పాటలు సైతం పాడి ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం రోజిక్ యూట్యూబ్ ఛానెల్‌కు ఏకంగా 1.35 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. మరి ధోని లాంటి వ్యక్తి ఫొటో దిగిన రోజిక్ బ్యాక్‌గ్రౌండ్ ఇది. మరి రోజిక్ లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
MS Dhoni with Abdu Rozik.
– Picture of the day. pic.twitter.com/dzOKtH8TeJ
— Johns. (@CricCrazyJohns) December 30, 2023
Abdu Rozik with MS Dhoni, Rishabh Pant & Sakshi.
– A beautiful picture. pic.twitter.com/UfeVM4EL5M
— Johns. (@CricCrazyJohns) December 30, 2023