Dharani
టీమిండియ ప్లేయర్ రిషబ్ పంత్ సహా.. అనేక మంది సెలబ్రిటలు, సామాన్యులు, స్టార్ హోటల్స్ ని మోసం చేసిన నిందితుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు..
టీమిండియ ప్లేయర్ రిషబ్ పంత్ సహా.. అనేక మంది సెలబ్రిటలు, సామాన్యులు, స్టార్ హోటల్స్ ని మోసం చేసిన నిందితుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు..
Dharani
గతంలో టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ ను 1.6 కోట్లకు మోసం చేసిన కేటుగాడిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకు ఎవరా క్రికెటర్.. అసలు రిషబ్ పంత్ అతడి చేతిలో ఎలా మోసపోయాడు అంటే.. . 25 ఏళ్ల మృనాంక్ సింగ్.. గతంలో హర్యానా తరఫున అండర్-19 క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలో విలాసాలకు అలవాటు పడిన ఈ కేటుగాడు.. స్టార్ హోటల్స్ సహా పలువురు సెల్రబిటీలను సైతం మోసం చేశాడు. ఇతగాడి బారిన పడి మోసపోయిన వారి జాబితాలో టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ సైతం ఉన్నాడు. పంత్‌ను ఏకంగా రూ.1.6 కోట్లకు ముంచాడు నిందితుడు మృనాంక్ సింగ్.
విలాసాలకు అలవాటుపడిన.. మృనాంక్ సింగ్.. ఫైవ్ స్టార్ హోటల్స్ లలో బస చేస్తూ.. తనను తాను ఐపీఎల్ ప్లేయర్ ని అని.. 2014 నుంచి 2018 వరకు తాను ముంబై ఇండియన్స్ తరఫున ఆడానని చెప్పుకునేవాడు. అలా ఎంతో మంది అమ్మాయిలను తన వలలో వేసుకున్నాడు. అంతేకాక స్టార్ హోటల్స్ లో బస చేస్తూ.. బిల్లు కట్టకుండా ఎగ్గొట్టి వెళ్లిపోయేవాడు. ఇలా ఉండగా తొలిసారి 2022లో మృనాంక్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో బస చేసిన నిందితుడు రూ.5.5 లక్షల బిల్లు కట్టకుండా వెళ్లిపోయాడు. దీని గురించి హోటల్ సిబ్బంది అడిగితే.. అడిడాస్ వాళ్లు బిల్లు కడతారని చెప్పి, వాళ్ల దగ్గర్నుంచి బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని అక్కడ నుంచి పరారయ్యాడు.
ఆ తర్వాత హోటల్ సిబ్బందికి రూ.2 లక్షల ట్రాన్సాక్షన్ ఐడీ చూపించాడు. కానీ అది ఫేక్ అని తేలింది. దాంతో తాజ్ ప్యాలెస్ హోటల్ వాళ్లు డబ్బుల కోసం అనేకసార్లు మృనాంక్ కి ఫోన్ చేశారు. అతడి నుంచి ఎలాంటి స్పందన లేదు. చివరకు ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో.. హోటల్ వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. అతడి మీద ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మృనాంక్ కోసం గాలింపు మొదలు పెట్టారు. విషయం తెలుపుకున్న నిందితుడు.. తన జాడ తెలియకుండా జాగ్రత్తపడి.. చివరకు దుబాయ్ లో సెటిల్ అయ్యానని అందరిని నమ్మించాడు. దాంతో అతడి మీద లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇక తాజాగా డిసెంబర్ 25న హాంగ్‌కాంగ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
మృనాంక్ 2020-21లో రిషబ్ పంత్‌ను రూ.1.6 కోట్ల మేర మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడి బాధితుల జాబితాలో క్యాబ్ డ్రైవర్లు, అమ్మాయిలు, బార్లు, రెస్టారెంట్లు.. కూడా ఉన్నాయి. మృనాల్ ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు.. అమ్మాయిలతో అతడు అసభ్యకరంగా దిగిన ఫొటోలను గుర్తించారు. అంతేకాక అతడు డ్రగ్స్ కూడా కొనుగోలు చేశాడని గుర్తించారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో అతడిపై కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని హిందూ కాలేజీ నుంచి కామర్స్‌లో డిగ్రీ చేసిన మృనాంక్.. రాజస్థాన్‌లోని ఓపీజేఎస్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశాడు. చెడు వ్యసనాలకు అలవాటుపడిన అతడిని తల్లీదండ్రులు పట్టించుకోవడం మానేశారు.