వీడియో: లిట్టన్ దాస్‌ను రెచ్చగొట్టిన బాబర్.. కసితో నసీంను ఉతికారేసిన బంగ్లా బ్యాటర్!

Litton Das, Naseem Shah, Babar Azam: బంగ్లాదేశ్ స్టార్ బ్యాటర్ లిట్టన్ దాస్ ను రెచ్చగొట్టినందుకు పాకిస్థాన్ కు తగిన శాస్తి జరిగింది. బాబర్ ఆజం చేసిన పనికి పేసర్ నసీం షా బలయ్యాడు. అసలేం జరిగిందంటే..

Litton Das, Naseem Shah, Babar Azam: బంగ్లాదేశ్ స్టార్ బ్యాటర్ లిట్టన్ దాస్ ను రెచ్చగొట్టినందుకు పాకిస్థాన్ కు తగిన శాస్తి జరిగింది. బాబర్ ఆజం చేసిన పనికి పేసర్ నసీం షా బలయ్యాడు. అసలేం జరిగిందంటే..

క్రికెట్ లో స్లెడ్జింగ్ కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి టీమ్స్ ప్లేయర్స్ ఎక్కువగా స్లెడ్జింగ్ చేసేవారు. కానీ ఇప్పుడు దాదాపుగా అన్ని టీమ్స్ లోనూ ఇది సాధారణంగా మారింది. అయితే స్లెడ్జింగ్ వల్ల లాభంతో పాటు నష్టం కూడా ఉంటుంది. కొందరు ప్లేయర్లను తిట్టినా, విసిగించినా, రెచ్చగొట్టినా వెంటనే ఔట్ అవుతారు. కొందరు బౌలర్లను స్లెడ్జ్ చేస్తే రిథమ్ కోల్పోయి కోపంలో అడ్డగోలుగా బౌలింగ్ చేస్తూ భారీగా పరుగులు సమర్పించుకుంటారు. కానీ ఇంకొందరు ఆటగాళ్లు మాత్రం రెచ్చగొడితే జూలు విదిల్చి ఆడతారు. తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తారు. ఇవాళ అదే జరిగింది. పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం అనవసరంగా బంగ్లాదేశ్ బ్యాటర్ లిట్టన్ దాస్ ను గెలికాడు. దీంతో రెచ్చిపోయిన దాస్.. పవర్ హిట్టింగ్ తో పాక్ బౌలర్ల మీద విరుచుకుపడ్డాడు.

బాబర్ మీద కోపాన్ని స్పీడ్ స్టర్ నసీం షా మీద చూపించాడు లిట్టన్ దాస్. అతడు వేసిన 89వ ఓవర్ లో ఏకంగా 18 పరుగులు పిండుకున్నాడు. మూడు బౌండరీలు, ఓ సిక్స్ బాది నసీంకు చుక్కలు చూపించాడు. దీంతో ఎందుకు గెలికానా అని బాబర్ తల పట్టుకున్నాడు. మొత్తంగా 78 బంతులు ఎదుర్కొన్న దాస్ 8 బౌండరీలు, ఒక సిక్స్ సాయంతో 56 పరుగులు చేశాడు. నసీం షాను అయితే ఆడుకున్నాడు. బాబర్ తో గొడవ తర్వాత ప్రతి బాల్ ను బౌండరీకి పంపాలనే కసితో కనిపించాడు దాస్. ఆఖరికి నసీం షా బౌలింగ్ లోనే కీపర్ మహ్మద్ రిజ్వాన్ కు ఈజీ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

లిట్టన్ దాస్ ఉన్నంత సేపు బంగ్లాదేశ్ స్కోరు బోర్డు వేగంగా పరుగులు పెట్టింది. దాస్-బాబర్ ఫైట్ పై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. అడిగి మరీ తన్నించుకోవడం అంటే ఇదేనని బాబర్ ను ఎగతాళి చేస్తున్నారు. ఆజం.. నువ్వు ఇక మారవా అని ట్రోల్ చేస్తున్నారు. గెలికి మరీ కొట్టించుకున్నారంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన పాక్ ఫస్ట్ ఇన్నింగ్స్ ను 448/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన బంగ్లా ఇప్పుడు 495/6తో ఉంది. ముష్ఫికర్ రహీం (173 నాటౌట్), మెహ్దీ హసన్ మిరాజ్ (50 నాటౌట్) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. 47 పరుగుల లీడ్ లో ఉంది పర్యాటక జట్టు. ముష్ఫికర్ డబుల్ సెంచరీ పూర్తయ్యాక ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసే ఛాన్స్ ఉంది. మరి.. బాబర్-దాస్ స్లెడ్జింగ్ ఘటనపై మీ ఒపీనియన్ ను కామెంట్ చేయండి.

Show comments