Nidhan
Guess The Cricketer Son: క్రికెటర్లకు సంబంధించిన ఏ న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. వాళ్ల ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిని ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తుంటారు.
Guess The Cricketer Son: క్రికెటర్లకు సంబంధించిన ఏ న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. వాళ్ల ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిని ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తుంటారు.
Nidhan
క్రికెటర్లకు సంబంధించిన ఏ న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ముఖ్యంగా టీమిండియా క్రికటర్స్ గురించి ఏ వార్త వచ్చినా వెంటనే వైరల్ అవుతుంది. ఆటగాళ్లకు సంబంధించిన చిన్న సమాచారం అయినా తెలుసుకునేందుకు అభిమానులు చాలా ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలోనే వాళ్ల ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు దొరికినా షేర్ చేస్తుంటారు. ఇప్పుడో టీమిండియా స్టార్ కొడుకు వీడియో వైరల్ అవుతోంది. బ్యాటింగ్ లో సచిన్ టెండూల్కర్ ను తలపిస్తున్నాడీ పిల్లాడు. భారీ షాట్లు బాదుతూ తండ్రిలా తానూ క్రికెటర్ అవుతానని అంటున్నాడు. బ్యాట్ తో విజృంభిస్తున్న ఈ బుడతడి తండ్రి ఎవరో తెలుసా? ఒకప్పుడు టీమిండియా తరఫున అదరగొట్టాడు. బాల్ ను రెండు వైపులా స్వింగ్ చేస్తూ బ్యాటర్లకు నరకం చూపించాడు. అతడి బౌలింగ్ లో బంతిని టచ్ చేయాలంటేనే బ్యాటర్లు భయపడేవారు.
అంతలా బ్యాటర్లతో ఆడుకున్న ఆ బౌలర్ మరెవరో కాదు.. ప్రవీణ్ కుమార్. ఇంటర్నేషనల్ క్రికెట్ లో తక్కువ కాలమే ఉన్నా తనదైన ముద్ర వేశాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ లో బంతులు వేస్తూ బ్యాటర్లను పరుగులు చేయకుండా ముప్పుతిప్పలు పెట్టేవాడు. అతడి స్వింగ్ కు టాప్ బ్యాటర్లు కూడా భయపడేవారు. బాల్ ఎటు పడి ఎటు వస్తుందో అర్థం కాక తలలు పట్టుకునేవారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్థాన్.. ఇలా బిగ్ టీమ్స్ అన్నింటినీ అప్పట్లో వణికించాడు ప్రవీణ్ కుమార్. ఐపీఎల్ లోనూ తిరుగులేని బౌలర్ గా అదరగొట్టాడు. అయితే గాయాలు వేధించడం, ఫామ్ కోల్పోవడం, మునుపటి స్థాయిలో బౌలింగ్ చేయలేకపోవడంతో టీమ్ కు దూరమయ్యాడు. అదే తరుణంలో భువనేశ్వర్ కుమార్, జస్ ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్లు దూసుకురావడంతో టీమిండియాకు దూరమయ్యాడు ప్రవీణ్.
రిటైర్మెంట్ తర్వాత లైమ్ లైట్ కు దూరమయ్యాడు ప్రవీణ్ కుమార్. ఈ మధ్య భారత జట్టు గురించి, పలువురు క్రికెటర్ల గురించి అతడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రవీణ్ మాట్లాడుతూ.. భారత జట్టులో చేరిన కొత్తలో పలువురు సీనియర్లు తనను మద్యం తాగడం మానేయాలని సూచించారని అన్నాడు. టీమ్ లో అంతా తాగుబోతులే ఉన్నా ఓ సీనియర్ మాత్రం తనను హైలైట్ చేసి బద్నాం చేసేవాడని చెప్పాడు. తాగుడు సాకుగా చూపి తనకు కోచింగ్ అవకాశాలు దక్కకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక, ప్రవీణ్ కుమార్ కొడుకు వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ బుడతడు వచ్చిన బాల్ ను వచ్చినట్లు భారీ షాట్లు బాదుతున్నాడు. ఇది చూసిన నెటిజన్స్. తండ్రి పేసర్ అయితే ఇతడు తోపు బ్యాటర్ అయ్యేలా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాగే ఆడితే తండ్రి కంటే గొప్ప క్రికెటర్ అవుతాడని చెబుతున్నారు.