SNP
KKR, RCB, IPL 2024: ఐపీఎల్ 2024లో అత్యంత చెత్త బౌలింగ్ యూనిట్ ఉన్న టీమ్ ఏదంటే.. చాలా మంది ఆర్సీబీ అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. అంత కంటే చెత్త బౌలింగ్ యూనిట్ ఉన్న టీమ్ ఏదో ఇప్పుడు తెలుసుకుందాం..
KKR, RCB, IPL 2024: ఐపీఎల్ 2024లో అత్యంత చెత్త బౌలింగ్ యూనిట్ ఉన్న టీమ్ ఏదంటే.. చాలా మంది ఆర్సీబీ అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. అంత కంటే చెత్త బౌలింగ్ యూనిట్ ఉన్న టీమ్ ఏదో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ఐపీఎల్ 2024 జోరుగా సాగుతోంది. బ్యాటర్లు పండుగ చేసుకుంటున్నారు. పరుగుల వరద పారుతున్న ఈ సీజన్‌లో.. పాపం బౌలర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. అయితే.. అందరి బౌలర్లు కాదు కానీ, కొంతమంది బౌలర్లు మరీ దారుణంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. పిచ్‌లు ఫ్లాట్‌గా ఉన్నా, బౌండరీ లైన్లు దగ్గరగా ఉన్నా, ఇంప్యాక్ట్ ప్లేయర్ లాంటి రూల్స్ ఉన్నా కూడా బౌలర్లు తమ నైపుణ్యాలను కాస్త డిఫరెంట్‌గా ప్రయత్నించాలి. అలా కాకుండా.. ఎలాగో కొడుతున్నారు కదా అని మరింత లూజ్ బౌలింగ్‌తో భారీ భారీ స్కోర్లు కొట్టించుకుంటున్నారు. కాగా, ఇప్పటి వరకు ఐపీఎల్‌లో అత్యంత చెత్త బౌలింగ్ యూనిట్ ఉన్న టీమ్‌గా చాలా మంది ఆర్సీబీని భావించే వారు. కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది.
ఐపీఎల్‌లో అత్యంత చెత్త బౌలింగ్ యూనిట్ ఉన్న టీమ్ ఆర్సీబీ కాదు. మరో సక్సెస్‌ఫుల్ టీమ్ ఆ ప్లేస్‌లోకి వచ్చింది. ఆ టీమ్ ఏదంటే.. కోల్‌కత్తా నైట్ రైడర్స్. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ 5 విజయాలు, 3 పరాజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి, పటిష్టంగానే ఉంది. కానీ, ఆ జట్టు బౌలింగ్ మాత్రం కేకేఆర్ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. ఎందుకో ఇప్పుడు చూద్దాం.. ఈ సీజన్‌లో కేకేఆర్ ఆరంభంలో మంచి విజయాలే సాధించింది. కానీ, ఆ జట్టు ఆడిన చివరి మూడు మ్యాచ్‌లను ఒక సారి గమనిస్తే.. ఇంతకంటే దారుణమైన బౌలింగ్ ఎటాక్ ఏ టీమ్‌లో లేదని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే.
ఏప్రిల్ 16న కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 224 పరుగుల భారీ టార్గెట్‌ను కాపాడుకోలేకపోయింది. అలాగే ఏప్రిల్ 21న ఈడెన్ గార్డెన్స్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 222 పరుగులు చేసి కూడా.. కేవలం ఒక్క పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్లు 221 పరుగులు సమర్పించుకున్నారు. నిజానికి ఆ మ్యాచ్‌లో అంపైర్ల తప్పిదాలతో కేకేఆర్ గెలిచింది కానీ, నిజానికి విజేత ఆర్సీబీనే. ఇక క్రికెట్ చరిత్రలోనే తొలి 262 పరుగులను ఛేజ్ చేసి పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. అది కూడా కేకేఆర్ పైనే. ఏప్రిల్ 26న ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 262 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని కూడా కేకేఆర్ డిఫెండ్ చేసుకోలేకపోయింది. పైగా ఆ టీమ్‌లో మిచెల్ స్టార్క్, సునీల్ నరైన్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. అయినా కూడా భారీ టార్గెట్లు కాపాడుకోలేక.. ఈ ఐపీఎల్‌లో అత్యంత చెత్త బౌలింగ్ యూనిట్‌గా పేరు తెచ్చుకుంటోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#KKRvsPBKS #IPL2024 pic.twitter.com/ibCfVofWIB
— Sayyad Nag Pasha (@nag_pasha) April 29, 2024