గ్రౌండ్ లో కోహ్లీని పట్టుకున్న వ్యక్తికి.. భారీ గిఫ్ట్ ప్రకటించిన ఖలిస్తానీ ఉగ్రవాది!

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాలస్తీన మద్దతుదారుడు కలకలం సృష్టించాడు. విరాట్ కోహ్లీని పట్టుకున్న ఆ యువకుడికి ఖలీస్తాని ఉగ్రవాది భారీ గిఫ్ట్ ప్రకటించాడు.

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాలస్తీన మద్దతుదారుడు కలకలం సృష్టించాడు. విరాట్ కోహ్లీని పట్టుకున్న ఆ యువకుడికి ఖలీస్తాని ఉగ్రవాది భారీ గిఫ్ట్ ప్రకటించాడు.

వన్డే వరల్డ్ కప్ 2023 సమరం ముగిసింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా, భారత్ పై విజయం సాధించి కప్ అందుకుంది. వరల్డ్ కప్ ఆరంభం నుంచి ఆదిపత్యం చెలాయించిన టీమిండియా ఫైనల్ లో ఉసూరుమనిపించింది. కోట్లాది మంది భారతీయుల ఆశలను అడియాశలు చేసింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆస్ట్రేలియా పౌరుడైన పాలస్తీన మద్దతుదారుడు గ్రౌండ్ లోకి చొచ్చకు రావడం తీవ్ర కలకలం రేపింది. భారత స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా పాలస్తీన మద్దతుదారుడు సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి చొరబడ్డాడు. అంతటితో ఆగకుండా కింగ్ కోహ్లీని వెనక నుంచి పట్టుకున్నాడు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని పట్టుకుని గ్రౌండ్ నుంచి బయటకు పంపించారు. అయితే కోహ్లీని పట్టుకున్న ఆ యువకుడికి ఖలీస్థానీ ఉగ్రవాది భారీ గిఫ్ట్ ప్రకటించాడు.

నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ పోరు జరిగిన విషయం తెలిసిందే. మ్యాచ్ జరుగుతున్న క్రమంలో పాలస్తీన మద్దతుదారుడు తీవ్ర కలకలం సృష్టించాడు. ఆ యువకుడు మైదానంలోకి ప్రవేశించి విరాట్ కోహ్లీని వెనుక నుండి పట్టుకున్నాడు. ఆ వ్యక్తి ధరించిన టీ షర్ట్‌ ముందు వైపు ‘పాలస్తీనాపై బాంబింగ్ ఆపండి’ అని వెనుక ‘ఫ్రీ పాలస్తీనా’ అనిపాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్‌ బాంబు దాడులకు వ్యతిరేకంగా ఈ సంఘటనకు పాల్పడ్డాడు. ఆ వ్యక్తిని స్టేడియం సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.

విరాట్ ను పట్టుకున్న ఆ యువకుడిని అరెస్టు చేసిన గుజరాత్ పోలీసులు, ఆస్ట్రేలియాకు చెందిన వేన్ జాన్సన్‌ గా గుర్తించారు. అయితే ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఈ ఘటనపై స్పందించాడు. విరాట్ కోహ్లీని పట్టుకున్న వ్యక్తికి 10,000 డాలర్లు ( 8 లక్షల 32 వేల రూపాయలు) ఇస్తానని ప్రకటించాడు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. మ్యాచ్ కు ముందు ఖలీస్తానీ టెర్రరిస్టు గురుపత్వంత్ సింగ్ పన్ను మ్యాచ్ నిలిపివేయాలని హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. భారత్ లో దాడులకు పాల్పడుతామంటూ ఓ వీడియో కూడా విడుదల చేశాడు.

Show comments