iDreamPost
android-app
ios-app

వీడియో: బుమ్రాను దారుణంగా ఆడుకున్న కోహ్లీ, జడేజా! మ్యాచ్‌ కంటే ఇదే హైలెట్‌!

  • Published Sep 27, 2024 | 6:46 PM Updated Updated Sep 27, 2024 | 6:46 PM

Virat Kohli, Jasprit Bumrah, Ravindra Jadeja: టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజా.. బుమ్రాను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. మరి వాళ్లు ఏం చేశారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Virat Kohli, Jasprit Bumrah, Ravindra Jadeja: టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజా.. బుమ్రాను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. మరి వాళ్లు ఏం చేశారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Sep 27, 2024 | 6:46 PMUpdated Sep 27, 2024 | 6:46 PM
వీడియో: బుమ్రాను దారుణంగా ఆడుకున్న కోహ్లీ, జడేజా! మ్యాచ్‌ కంటే ఇదే హైలెట్‌!

కోహ్లీ అంటే చాలా మందికి అగ్రెషన్‌ గుర్తుకొస్తుంది. కానీ, ఆన్‌ ఫీల్డ్‌లో తోటి టీమిండియా క్రికెటర్లతో ఎంతో సరదాగా ఉంటాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు నోరు పారేసుకుంటే.. మూడో కన్ను తెరిగిన శివుడిలా మారిపోతాడు కానీ.. నార్మల్‌ టైమ్‌లో పసిపిల్లాడే. ఎప్పుడూ నవ్వుతూ తన చుట్టూ ఉండే వాళ్లను నవ్విస్తూ ఉంటాడు. అందుకే కోహ్లీని కొన్ని కోట్ల మంది ఇష్టపడతారు. ఒక ప్లేయర్‌గా ఎప్పుడో ఎవరెస్ట్‌ స్థాయికి ఎదిగిపోయిన కోహ్లీ.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణాన్ని కూడా అలవర్చుకున్నాడు. ముఖ్యంగా జట్టులోని కొంతమంది ఆటగాళ్లతో కలిసి కోహ్లీ చేసే సరదా పనులు.. నవ్వులు పూయిస్తాయి. తాజాగా అలాంటి ఓ హిలేరియస్‌ యాక్షన్‌ చేశాడు కోహ్లీ..

టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రాను.. రవీంద్ర జడేజాతో కలిసి సరదాగా ఆడపట్టించాడు. బుమ్రా బౌలింగ్‌ యాక్షన్‌ను కోహ్లీ అచ్చుగుద్దినట్లు దింపేస్తాడనే విషయం తెలిసిందే. ఈ సారి కూడా అదే చేశాడు. అలాగే బాల్‌ వేసిన తర్వాత.. మళ్లీ రన్నప్‌ కోసం బుమ్రా ఎలా వెళ్తాడో కూడా చూపించాడు. కోహ్లీకి జత కలిసిన జడేజా సైతం.. బుమ్రాను ఇమిటేట్‌ చేశాడు. ఇందంతా.. అక్కడే ఉండి చూస్తున్న అసిస్టెంట్‌ కోచ్‌ టెన్‌ డస్కెటే కడుపుబ్బా నవ్వుకున్నాడు. పాపం.. బుమ్రా మాత్రం ఇక చాలు ఆపండి అన్నట్లు పేస్‌ పెట్టి నిల్చున్నాడు. బుమ్రాను కోహ్లీ, జడేజా ఇమిటేట్‌ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాన్పూర్‌ వేదికగా శుక్రవారం ప్రారంభమైన భారత్‌-బంగ్లా రెండో టెస్ట్‌ సందర్భంగా ఈ ఘటన జరిగింది. వర్షం కారణంగా ఆట సరిగ్గా సాగకపోవడంతో.. మ్యాచ్‌లో పెద్దగా హైలెట్స్‌ ఏం జరగలేదు. అయితే.. బుమ్రాను కోహ్లీ, జడేజా ఇమిటేట్‌ చేస్తూ.. ఏడిపించిన సీన్సే తొలి రోజు ఆటకు హైలెట్‌ అని చెప్పుకోవచ్చు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఫస్ట్‌ టెస్ట్‌ ఆడిన టీమ్‌తోనే రెండో టెస్ట్‌ బరిలోకి దిగాడు. వర్షం వచ్చే సూచనలు ఉండటంతో టాస్‌ గెలిచి.. బంగ్లాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. వర్షం కారణంగా.. తొలి రోజు ఆట కేవలం 35 ఓవర్లు మాత్రమే సాగింది. బంగ్లాదేశ్‌ 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. మోమినుల్‌ 40, ముష్పికర్‌ రహీమ్‌ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మరి ఈ మ్యాచ్‌ సందర్భంగా బుమ్రాను కోహ్లీ, జడేజా ఆటపట్టించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.