Jay Shah: పంతం నెగ్గించుకుంటున్న జైషా.. పాక్​కు దిమ్మతిరిగేలా షాక్!

బీసీసీఐ సెక్రెటరీ జైషా గురించి తెలిసిందే. అనుకున్న పని పూర్తయ్యే దాకా వదిలిపెట్టకపోవడం అతడి నైజం. అలాంటోడు ఇప్పుడు పాకిస్థాన్​కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.

బీసీసీఐ సెక్రెటరీ జైషా గురించి తెలిసిందే. అనుకున్న పని పూర్తయ్యే దాకా వదిలిపెట్టకపోవడం అతడి నైజం. అలాంటోడు ఇప్పుడు పాకిస్థాన్​కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.

బీసీసీఐ సెక్రెటరీ జైషా గురించి తెలిసిందే. అనుకున్న పని పూర్తయ్యే దాకా వదిలిపెట్టకపోవడం అతడి నైజం. భారత క్రికెట్​ బోర్డులో అతడు ఎంత చెబితే అంత అన్నట్లు ఇప్పుడు పరిస్థితి ఉంది. ప్రెసిడెంట్​గా ఎవరున్నా షా మాటే ఫైనల్ అని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. అంతలా భారత బోర్డులో చక్రం తిప్పుతున్నాడు. బీసీసీఐ నిర్వహించే ఈవెంట్స్​లో, అలాగే టీమిండియా మ్యాచుల టైమ్​లో ప్రెసిడెంట్ కంటే షానే ఎక్కువగా హైలైల్ అవుతూ వస్తున్నాడు. ఆటగాళ్లతో సన్నిహితంగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అందుకే ప్లేయర్లు అతడ్ని ప్రశంసల్లో ముంచెత్తడం చూస్తూనే ఉన్నాం. ఇతర దేశాల బోర్డుతో ఏదైనా సమస్యలు వచ్చినా షానే వాటిని పరిష్కరించడం గమనార్హం. ఇలా చాలా తన మార్క్ చూపిస్తున్న షా.. ఇప్పుడు పాకిస్థాన్ పని పట్టాలని డిసైడ్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.

వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నీలో ఆడేందుకు మిగతా జట్లన్నీ ఓకే అన్నాయి. కానీ పాక్​కు వెళ్లేది లేదంటూ టీమిండియా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. సరిహద్దు సమస్యలు, దౌత్యపరమైన ఇబ్బందులు, సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల ఇరు దేశాల మధ్య క్రికెట్ రిలేషన్స్ స్తంభించిపోయాయి. గతేడాది భారత్ ఆతిథ్యం ఇచ్చిన వరల్డ్ కప్​లో పాకిస్థాన్ పాల్గొంది. కానీ ఆ దేశంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఆడేది లేదని బీసీసీఐ తెగేసి చెప్పింది. దీంతో టీమిండియా రాకపోతే ఇతర జట్టును ఆడించాలని, కానీ హైబ్రిడ్ పద్ధతిలో వేరే చోటకు వెన్యూస్ మారిస్తే ఊరుకోమంటూ అడ్డుపుల్ల వేస్తోంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. దీంతో సీరియస్ అయిన షా.. పెద్ద ప్లానే వేశాడని తెలుస్తోంది. పాక్ పని పట్టేందుకు ఏకంగా ఐసీసీ ఛైర్మన్​గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడని వినిపిస్తోంది.

ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్​లే జైషా మద్దతుతోనే ఆ పదవిని దక్కించుకున్నారు. ఆయన పదవీ కాలం ముగియడంతో త్వరలో ఎన్నిక నిర్వహించనున్నారు. బీసీసీఐ బాస్ కావాలని పట్టుదలతో ఉన్నాడు జైషా. అయితే ఆ పీఠం దక్కాలంటే ముందు ఐసీసీ ఛైర్మన్ సీట్​ దక్కాలి. అప్పుడు గానీ మన బోర్డు ప్రెసిడెంట్ పోస్ట్​కు పోటీ చేసేందుకు అర్హత దక్కదు. అందుకే ఐసీసీ ఛైర్మన్ ఎలక్షన్​లో నిలబడాలని అనుకుంటున్నాడట. సేమ్ టైమ్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ దేశం రావాల్సిందే అంటూ టీమిండియాకు అడ్డుపుల్ల వేస్తున్న పాకిస్థాన్​కు షాక్ ఇవ్వడం కోసం కూడా క్రికెట్​కు పెద్దన్న అయిన ఐసీసీకి ఛైర్మన్ అవ్వాలని భావిస్తున్నాడట షా. ఒకవేళ షా ఐసీసీ బాస్ అయితే పాక్ పని పట్టడం పక్కా అని.. అలాగే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచులు ఇతర వేదికలకు మారడం కూడా ఖాయమని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. మరి.. పాక్​కు షాక్ ఇస్తూ షా అడుగులు వేయడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments