SNP
Virat Kohli, Rohit Sharma, Champions Trophy 2025: భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను గుండెల్లో పెట్టి చూసుకుంటాం అంటూ పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు విపరీతమైన ప్రేమను కురిపిస్తున్నారు. మరి వారి ప్రేమ వెనకున్న కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
Virat Kohli, Rohit Sharma, Champions Trophy 2025: భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను గుండెల్లో పెట్టి చూసుకుంటాం అంటూ పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు విపరీతమైన ప్రేమను కురిపిస్తున్నారు. మరి వారి ప్రేమ వెనకున్న కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు తెగ ప్రాథేయపడుతున్నారు. గుండెల్లో పెట్టి చూసుకుంటాం అంటూ విపరీతమైన ప్రేమ చూపిస్తున్నారు. సడెన్‌గా కోహ్లీ, రోహిత్‌పై పాకిస్థాన్ క్రికెట్ అభిమానులకు ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందని అనుకుంటున్నారా? ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడేందుకు తమ దేశానికి టీమిండియా రావాలని పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ వేదికగా జరగనుంది.
అయితే.. పాకిస్థాన్‌కు టీమిండియా వెళ్లేది లేనిది ఇంకా స్పష్టత లేదు. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని, టీమిండియా ఆడే మ్యాచ్‌లను దుబాయ్ లేదా శ్రీలంకలో జరిపించాలని బీసీసీఐ, ఐసీసీని కోరినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా పాకిస్థాన్‌లో భారత జట్టు పర్యటించడం లేదు. రెండు దేశాల మధ్య సరైన సంబంధాలు లేని కారణంగా అలాగే భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్‌కు ఇండియాను పంపేందుకు బీసీసీఐ సుముఖంగా లేదు. పైగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా జరగడం లేదు. కేవలం ఐసీసీ ఈవెంట్స్‌లోనే ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టీమిండియా పాకిస్థాన్ వెళ్లడం లేదు కానీ, పాక్ టీమ్ మాత్రం ఇండియాలో పర్యటిస్తుంది. గతేడాది వన్డే వరల్డ్ కప్ 2023 కోసం పాకిస్థాన్ జట్టు ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాకిస్థాన్‌కు రావాలని ఆ దేశ క్రికెట్ బోర్డు కూడా బలంగా కోరుకుంటోంది. టీమిండియాకు అద్భుతమైన ఆతిథ్యం ఇస్తామని, లాహోర్ స్టేడియంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని ఇప్పటికే బీసీసీఐని ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ సైతం టీమిండియా ఆటగాళ్లకు మంచి ఆతిథ్యం ఇస్తామని, అది వాళ్లు ఇండియాలో ఆతిథ్యం మర్చిపోతారంటూ పేర్కొన్నాడు. తాజాగా పాకిస్థాన్ అభిమానులు.. కోహ్లీ, రోహిత్‌ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం, దయచేసి మా దేశానికి రావాలంటూ ప్రాథేయపడుతున్నారు. మరి టీమిండియా క్రికెటర్లపై పాక్ అభిమానులు ఇంత ప్రేమ చూపిస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Hey, Virat & Rohit. Pakistan is the most hospitable country in world. Come to Lahore for Champions Trophy and we will treat you like Kings. You will have the time of your lives, and you will feel at home. The doors of my house are open for both of you 🇮🇳🇵🇰❤️ @imVkohli @ImRo45 pic.twitter.com/OCejXJilY3
— Farid Khan (@_FaridKhan) July 11, 2024