Somesekhar
IPL 2025 మెగా వేలం సందర్భంగా చాలా మంది ప్లేయర్లు టీమ్స్ మారుతున్నట్లు జోరుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ముంబై స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సైతం ఈ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైని వీడి ఆర్సీబీ జట్టులోకి బుమ్రా వస్తున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
IPL 2025 మెగా వేలం సందర్భంగా చాలా మంది ప్లేయర్లు టీమ్స్ మారుతున్నట్లు జోరుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ముంబై స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సైతం ఈ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైని వీడి ఆర్సీబీ జట్టులోకి బుమ్రా వస్తున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
IPL 2025.. ప్రస్తుతం అందరి దృష్టి ఈ మెగాటోర్నీపైనే ఉంది. ఇక ఇప్పటికే బీసీసీఐ ఈ టోర్నీకి సంబంధించి మెగా వేలాన్ని నిర్వహించే దానిపై ఫోకస్ పెట్టింది. దాంతో పాటుగా రిటెన్షన్ రూల్స్ మార్పులు, చేర్పులపై ఫ్రాంచైజీలతో సమావేశం కూడా నిర్వహించింది. దాంతో మెగా వేలం నేపథ్యంలో జట్లు పూర్తిగా మారిపోనున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ ప్లేయర్ పలానా జట్లలోకి వెళ్తారు అన్న వార్తలు జోరందుకున్నాయి. అందులో జస్ప్రీత్ బుమ్రా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ లోకి అతడు వెళ్లబోతున్నట్లు న్యూస్ వైరల్ గా మారింది.
టీమిండియా స్టార్ పేసర్, ముంబై ఇండియన్స్ కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆ జట్టును వీడతాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముంబైని వీడి బుమ్రా ఆర్సీబీలోకి వెళ్లనున్నాడట. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించిన దగ్గర నుంచి అతడు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని, పగ్గాలు అందుకునేందుకు తాను అర్హుడిని అని బుమ్రా భావించాడు. కానీ అనూహ్యంగా పాండ్యాను కెప్టెన్ చేయడంతో.. బుమ్రా నిరాశకు గురైయ్యాడు. అంతేకాదు ఓ మ్యాచ్ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. పాండ్యా సూచనలను బుమ్రా పట్టించుకోలేదు. అదీకాక ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కెప్టెన్సీపై ఆసక్తి చూపించడం, పేస్ బౌలర్లకు సారథ్య బాధ్యతలు ఇవ్వకపోవడంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అంటే టీమిండియా పగ్గాలతో పాటుగా ఐపీఎల్ లో కూడా కెప్టెన్ గా చేయాలని బుమ్రా భవిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో బుమ్రా ముంబైను వీడి ఆర్సీబీలోకి వస్తాడని జోరుగా చర్చనడుస్తోంది. 40 సంవత్సరాలకు పైబడిన ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ ను తప్పించి కొత్త కెప్టెన్ ను ఎంపిక చేయాలని ఆ ఫ్రాంచైజీ భావిస్తోంది. ఇదే టైమ్ లో బుమ్రాను తమ టీమ్ లోకి తీసుకుంటే.. ఇటు బౌలర్ గా అటు కెప్టెన్ గా సేవలు అందిస్తాడని మేనేజ్ మెంట్ భావిస్తోంది. వేలంలో వీలు కాకపోతే.. అవసరం అయితే ట్రేడింగ్ విండో ద్వారా బుమ్రాను జట్టులోకి తీసుకోవాలని ఆర్సీబీ యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి బుమ్రా ముంబై టీమ్ లోనే ఉంటాడా? లేదా ఆర్సీబీలోకి వెళ్తాడా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.