iDreamPost
android-app
ios-app

CSKలోకి రిషబ్ పంత్? క్రేజీ హింట్ ఇచ్చిన టీమిండియా స్టార్!

  • Published Aug 20, 2024 | 10:28 PM Updated Updated Aug 20, 2024 | 10:31 PM

ఐపీఎల్-2025 మొదలవడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. మెగా ఆక్షన్ కూడా ఇప్పుడప్పుడే జరగదు. అయినా క్యాష్ రిచ్ లీగ్ గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. స్టార్ కీపర్ పంత్​కు సంబంధించిన ఓ న్యూస్ కూడా నెట్టింట షికార్లు కొడుతోంది.

ఐపీఎల్-2025 మొదలవడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. మెగా ఆక్షన్ కూడా ఇప్పుడప్పుడే జరగదు. అయినా క్యాష్ రిచ్ లీగ్ గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. స్టార్ కీపర్ పంత్​కు సంబంధించిన ఓ న్యూస్ కూడా నెట్టింట షికార్లు కొడుతోంది.

  • Published Aug 20, 2024 | 10:28 PMUpdated Aug 20, 2024 | 10:31 PM
CSKలోకి రిషబ్ పంత్? క్రేజీ హింట్ ఇచ్చిన టీమిండియా స్టార్!

ఐపీఎల్-2025 మొదలవడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. మెగా ఆక్షన్ కూడా ఇప్పుడప్పుడే జరగదు. అయినా క్యాష్ రిచ్ లీగ్ గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. జట్లలో జరిగే మార్పులు, రిటెన్షన్ ప్రాసెస్ తదితర విషయాలపై చర్చ జరుగుతోంది. మూడు జట్లు తమ కోచ్​లకు గుడ్​బై చెప్పనున్నానయని వినిపిస్తోంది. ఆల్రెడీ ఢిల్లీ క్యాపిటల్స్​ తమ హెడ్ కోచ్ రికీ పాంటింగ్​ను ఇంటికి సాగనంపింది. పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ కూడా తమ కోచ్​లకు గుడ్​బై చెబుతున్నాయని సమాచారం. కొందరు కెప్టెన్లు ఫ్రాంచైజీలు మారడం కూడా ఖాయమని అంటున్నారు. టీమిండియా స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ చెన్నై సూపర్ కింగ్స్​లోకి వెళ్లడం పక్కా అని చెబుతున్నారు. ఈ తరుణంలో పంత్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్​తో ఆ డిస్కషన్స్​కు మరింత బలం చేకూర్చాడు.

పంత్ సీఎస్​కేలోకి వెళ్లడం ఖాయమని.. అతడ్ని కెప్టెన్ కూడా చేస్తారంటూ కొన్నాళ్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అటు చెన్నై ఫ్రాంచైజీ నుంచి గానీ ఇటు పంత్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఈ తరుణంలో తాజాగా పంత్ ఓ పోస్ట్​తో సోషల్ మీడియాను షేక్ చేశాడు. తమిళ సూపర్​స్టార్ రజినీకాంత్​ను ఇమిటేట్ చేస్తూ అతడో పోస్ట్ పెట్టాడు. ‘కబాలి’ సినిమాలో రజినీ సూట్ వేసుకొని కాలు మీద కాలు పెట్టిన స్టైల్​గా కూర్చునే స్టిల్​ను పంత్ అచ్చం దింపేశాడు. మెరూన్ కలర్ సూట్ వేసుకొని బ్లాక్ కలర్ షూస్​తో దర్శనమిచ్చిన పంత్.. రజినీలాగే ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు పోజ్ ఇచ్చాడు. ఇది చూసిన నెటిజన్స్.. పంత్ హింట్ అదిరిపోయిందని అంటున్నారు. చెన్నైలోకి తాను వస్తున్నట్లు ఇన్​డైరెక్ట్​గా అతడు చెప్పేశాడని చెబుతున్నారు.

అప్పట్లో సీఎస్​కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఇలాగే తలైవా రజినీ స్టైల్​లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. బ్లూ కలర్ సూట్​ వేసుకొని అతడు ఇచ్చిన పోజు బాగా వైరల్ అయింది. ఇప్పుడు మాహీ కెరీర్ ముగుస్తుండటంతో ఆ ప్లేస్​ను పంత్ భర్తీ చేసే అవకాశం ఉందని ప్రచారం స్టార్ట్ అయింది. ఇక, బంగ్లాదేశ్​తో సిరీస్​కు ముందు భారీ గ్యాప్ దొరకడంతో కొన్నాళ్లు రెస్ట్ తీసుకున్న పంత్.. ఇప్పుడు ఢిల్లీ ప్రీమియర్ లీగ్​లో ఆడుతున్నాడు. త్వరలో జరిగే దులీప్ ట్రోఫీలోనూ అతడు పాల్గొంటాడు. టెస్టుల్లో కమ్​బ్యాక్ కోసం ఎదురు చూస్తున్న పంత్.. ఆ టోర్నమెంట్​లో సత్తా చాటాలని అనుకుంటున్నాడు. బంగ్లాతో సిరీస్​కు ముందు ఆ టోర్నమెంట్​ను మంచి ప్రాక్టీస్​గా వాడుకోవాలని భావిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో ఒక్క ఫొటోతో సోషల్ మీడియాను షేక్ చేశాడు. మరి.. పంత్ సీఎస్​కేలోకి వస్తాడని మీరు భావిస్తున్నారా? మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.