బుమ్రాపై డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. తన కళ్లలోకి చూశాడంటూ..!

  • Author singhj Published - 10:14 PM, Fri - 6 October 23
  • Author singhj Published - 10:14 PM, Fri - 6 October 23
బుమ్రాపై డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. తన కళ్లలోకి చూశాడంటూ..!

వన్డే వరల్డ్ కప్​లో ఫస్ట్ మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు రెడీ అవుతోంది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత బలంగా కనిపిస్తున్న టీమిండియా.. తొలి సమరంలో ఆస్ట్రేలియాను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 8న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. రీసెంట్​గా ముగిసిన దైపాక్షిక సిరీస్​లో ఆస్ట్రేలియాను 2-1 తేడాతో ఓడించడం, అంతకంటే ముందు ఆసియా కప్​ను కైవసం చేసుకున్న రోహిత్ సేన ఫుల్ జోష్​లో ఉంది. మొదటి మ్యాచ్​లోనే ఆసీస్​ను చిత్తు చేసి ప్రత్యర్థులకు ప్రమాద హెచ్చరికలు పంపాలని భావిస్తోంది. ఈ మ్యాచ్​లో టీమిండియా స్పిన్ ఎటాక్​తో పాటు పేస్ యూనిట్ కూడా రాణించడం కీలకం.

భారత జట్టు పేస్​ యూనిట్​లో జస్​ప్రీత్ బుమ్రా పెర్ఫార్మ్ చేయడం ఇంపార్టెంట్ అనే చెప్పాలి. బుమ్రా గనుక రాణిస్తే ఆరంభంలోనే వికెట్లు పడతాయి. అప్పుడు ప్రత్యర్థి జట్టు డిఫెన్స్​లో పడుతుంది. కాబట్టి బుమ్రా ఎలా రాణిస్తాడనేది చూడాలి. బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి, ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా రూపంలో భారత్ దగ్గర బలమైన పేస్ అటాక్ ఉంది. ఈ యూనిట్​ను బుమ్రానే ముందుండి నడిపించనున్నాడు. గాయం తర్వాత కమ్​బ్యాక్ ఇచ్చిన ఈ పేసుగుర్రం తన ఫామ్​ను ఘనంగా చాటుకున్నాడు. ఆసియా కప్​తో పాటు ఇటీవల ఆసీస్​తో సిరీస్​లో రాణించి వరల్డ్ కప్​కు తాను రెడీగా ఉన్నానని చాటాడు. అలాంటి బుమ్రాపై సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్​తో పాటు ఇంటర్నేషనల్ మ్యాచుల్లోనూ ఏబీ డివిలియర్స్, జస్​ప్రీత్ బుమ్రా చాలాసార్లు పోటీపడ్డారు. అందులో కొన్నిసార్లు రన్స్ చేసి ఏబీడీ ఆధిపత్యం చూపిస్తే.. మరికొన్ని సార్లు అతడ్ని ఔట్ చేసి బుమ్రా తన ప్రతాపం చూపించాడు. అయితే తాజాగా బుమ్రాపై డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఐపీఎల్​లో భాగంగా వాంఖడేలో ఆడిన మ్యాచ్​లో బుమ్రా బౌలింగ్​ను గమనించాను. అప్పుడు అతను 130 కిలోమీటర్ల స్పీడ్​తో బౌలింగ్ వేసేవాడు. కానీ ఒక ఏడాది గ్యాప్​లో బుమ్రా తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. నెక్స్ట్ ఐపీఎల్​లో అతను 140 కి.మీ.ల వేగంతో బాల్స్ వేశాడు. అప్పుడు అతడిలో ఎంత సత్తా ఉందో తెలుసుకున్నా. ఆ రోజు బుమ్రా నా కళ్లలోకి కళ్లు పెట్టి చూశాడు. అతడు నాకు సవాల్ విసురుతున్నాడని అర్థమైంది’ అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.

ఇదీ చదవండి: భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్! వందే భారత్‌ రైళ్లలో..

Show comments