iDreamPost
android-app
ios-app

Yashasvi Jaiswal: జైస్వాల్ ఒక అద్భుతం.. కానీ, ఆసీస్ బౌలర్లను ఎదుర్కొవడం అంత ఈజీ కాదు: మాథ్యూ హెడెన్

  • Published Aug 22, 2024 | 9:51 PM Updated Updated Aug 22, 2024 | 9:51 PM

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ పై పొగడ్తల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా లెజెండ్ బ్యాటర్ మాథ్యూ హెడెన్.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ పై పొగడ్తల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా లెజెండ్ బ్యాటర్ మాథ్యూ హెడెన్.

Yashasvi Jaiswal: జైస్వాల్ ఒక అద్భుతం.. కానీ, ఆసీస్ బౌలర్లను ఎదుర్కొవడం అంత ఈజీ కాదు: మాథ్యూ హెడెన్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది టీమిండియా. ఈ నేపథ్యంలో టీమిండియా యంగ్ సెన్సేషన్ యశస్వీ జైస్వాల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్. జైస్వాల్ ఒక అద్భుత ఆటగాడని, ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అని పొగిడాడు. అయితే వచ్చే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మాత్రం ఆసీస్ బౌలర్ల నుంచి కఠిన పరీక్ష ఎదుర్కొంటాడు అని పేర్కొన్నాడు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ పై పొగడ్తల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా లెజెండ్ బ్యాటర్ మాథ్యూ హెడెన్. “టీమిండియాకు దొరికిన అత్యంత విలువైన ఆస్తి జైస్వాల్. అతడు అన్ని ఫార్మాట్స్ కు పనికొస్తాడు. జైస్వాల్ స్ట్రోక్ ప్లే చూడముచ్చటగా ఉంటుంది. ముఖ్యంగా కవర్స్ పై నుంచి ఆడే షాట్ గురించి ఎంత చెప్పిన తక్కువే. అతడి బ్యాటింగ్ స్కిల్స్ కు నేను ఫిదా అయ్యాను. అయితే ఆస్ట్రేలియా లాంటి బౌన్సీ పిచ్ లపై వరల్డ్ క్లాస్ బౌలర్లు అయిన ప్యాట్ కమ్మిన్స్, హేజిల్ వుడ్, మిచెల్ స్టార్క్ లను ఎదుర్కొవడం అంత సులభం కాదు” అని ప్రశంసిస్తూనే హెచ్చరికలు జారీ చేశాడు హెడెన్.

కాగా.. ఆసీస్ పిచ్ లపై సిక్సులు కొట్టడం అంత ఈజీ కాదని, ఇక్కడి మైదానాలు పెద్దగా ఉంటడంతో.. సిక్సులకు ప్రయత్నిస్తే.. ఔట్ అయ్యే ప్రమాదం ఉంటుందని సూచించాడు. కాబట్టి జైస్వాల్ కాస్త ఆచితూచి ఆడాలని హెడెన్ సలహా ఇచ్చాడు. అయితే టెస్టుల్లో జైస్వాల్ రికార్డు అద్భుతంగా ఉంది. కేవలం 9 టెస్టులు మాత్రమే ఆడిన అతడు 1028 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు ఉన్నాయి. మరి ఆస్ట్రేలియా పిచ్ లపై జైస్వాల్ ఎలా ఆడతాడో చూడాలి. జైస్వాల్ పై మాథ్యూ హెడెన్ ప్రశంసలు కురిపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.