iDreamPost
android-app
ios-app

IPL 2025: అతడే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్.. స్పష్టం చేసిన సౌరవ్ గంగూలీ!

  • Published Aug 13, 2024 | 8:20 AM Updated Updated Aug 13, 2024 | 8:20 AM

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ను మారుస్తారా? అతడు టీమ్ మారబోతున్నాడా? అన్న ప్రశ్నకు ఆ టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ సమాధానం ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ను మారుస్తారా? అతడు టీమ్ మారబోతున్నాడా? అన్న ప్రశ్నకు ఆ టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ సమాధానం ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

IPL 2025: అతడే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్.. స్పష్టం చేసిన సౌరవ్ గంగూలీ!

ఐపీఎల్ 2025.. ప్రస్తుతం అందరి దృష్టి ఈ మెగాటోర్నీపైనే పడింది. మెగా వేలంలో ఎవరెవరు పాల్గొంటారు? ఏ ప్లేయర్లు టీమ్స్ మారడానికి సిద్ధంగా ఉన్నారు? కెప్టెన్లను మారుస్తారా? లేక మేనేజ్ మెంట్స్ వారినే కొనసాగిస్తాయా? అన్న ప్రశ్నలు ఎన్నో ఫ్యాన్స్ మదిలో మెదులుతున్నాయి. ఇక మరోవైపు ఐపీఎల్ 2025 విధివిధానాలను ఖరారు చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఇందుకోసం ఫ్రాంచైజీల నుంచి సూచనలు, సలహాలు కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ను మారుస్తారా? అన్న ప్రశ్నకు ఆ టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ సమాధానం ఇచ్చాడు.

రిషబ్ పంత్.. కారు ప్రమాదం నుంచి కోలుకున్న తరువాత టీ20 వరల్డ్ కప్ 2024తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక రీ ఎంట్రీలో అదరగొట్టాడు పంత్. మునుపటిలాగే బ్యాటింగ్, కీపింగ్ లో అదరగొట్టాడు. అయితే ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ నుంచి వేరే టీమ్ కు పంత్ వెళ్లబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ గా మారాయి. ఇక ఇదే విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీని అడిగితే..”రిషబ్ పంత్ టీమ్ మారడం లేదు. పైగా ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా అతడే ఉంటాడు. ఇందులో ఎలాంటి మార్పులు లేవు” అని సమాధానం ఇచ్చాడు.

Sourav Ganguly has clarified that he is the captain of Delhi Capitals!

కాగా.. హెడ్ కోచ్ బాధ్యతల నుంచి పాంటింగ్ తప్పుకున్నాడని కూడా ఈ సందర్భంగా గంగూలీ చెప్పుకొచ్చాడు. త్వరలోనే భారత్ కు చెందిన వ్యక్తే ఢిల్లీ హెడ్ కోచ్ గా పగ్గాలు చేపడతాడని తెలిపాడు. కానీ మరోవైపు గంగూలీనే హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపడతాడు అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. టోర్నీకి ఇంకా సమయం ఉండటంతో.. సరైన వ్యక్తినే కోచ్ గా తీసుకోవాలని ఢిల్లీ మేనేజ్ మెంట్ భావిస్తోంది. ఇక పంత్ టీమ్ మారుతాడని, కెప్టెన్ గా తీసేస్తారని ఇన్ని రోజులు వచ్చిన వార్తలపై గంగూలీ క్లారిటీ ఇచ్చాడు.