Nidhan
ప్రతిష్టాత్మక ఒలింపిక్ గేమ్స్‌లో ఓ క్రికెటర్ కొడుకు మెరిశాడు. ఏకంగా రెండు స్వర్ణ పతకాలు ఎగరేసుకుపోయాడు. ఏ పోటీలో అతడు విజేతగా నిలిచాడో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతిష్టాత్మక ఒలింపిక్ గేమ్స్‌లో ఓ క్రికెటర్ కొడుకు మెరిశాడు. ఏకంగా రెండు స్వర్ణ పతకాలు ఎగరేసుకుపోయాడు. ఏ పోటీలో అతడు విజేతగా నిలిచాడో ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
సినిమాలు, వ్యాపారం, క్రీడలు.. ఇలా ఏదైనా ప్రొఫెషన్లో సక్సెస్ అయిన కొందరు తమ వారసులను కూడా అదే రంగంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. అలా వచ్చిన వారిలో అందరూ విజయవంతం కాలేదు. కానీ కొందరు మాత్రం తమ తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ సక్సెస్ సాధించి శభాష్ అనిపించుకున్నారు. అయితే ఇంకొందరు సెలెబ్రిటీల పిల్లలు తమ పేరెంట్స్ వెళ్లిన ప్రొఫెషన్లో కాకుండా అభిరుచులకు తగ్గట్లు భిన్నమైన రంగాల్లోకి వెళ్లడం కూడా చూస్తూనే ఉన్నాం. అలా నచ్చిన వృత్తిని ఎంచుకొని ఎదిగిన వారూ ఉన్నారు. వీళ్లు క్రికెటర్ కొడుకు క్రికెట్ అవ్వక్కర్లేదు, ఫిల్మ్ స్టార్స్ వారసులు ఫిల్మ్స్లోకే వెళ్లాలని ఏమీ లేదని ప్రూవ్ చేశారు. ఈ కోవలోకి తాజాగా ఓ అథ్లెట్ వచ్చి చేరాడు.
పారిస్ ఒలింపిక్స్-2024లో అమెరికా అథ్లెట్ రాయ్ బెంజమిన్ 2 గోల్డ్ మెడల్స్ కొట్టాడు. ప్రతిష్టాత్మక క్రీడల్లో ఒక పతకం గెలిస్తే గొప్ప అనుకుంటే.. ఏకంగా రెండు స్వర్ణాలు సొంతం చేసుకొని ఔరా అనిపించాడు బెంజమిన్. 400 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా నిలిచాడు. అయితే ఈ బెంజమిన్‌కు క్రికెట్‌తో కనెక్షన్ ఉంది. వెస్టిండీస్ మాజీ బౌలర్ విన్స్టన్ బెంజమిన్ కుమారుడే ఈ రాయ్ బెంజమిన్ కావడం గమనార్హం. ఫాస్ట్ బౌలర్ అయిన విన్స్టన్.. టెస్టుల్లో 61 వికెట్లు, వన్డే క్రికెట్లో 100 వికెట్లు పడగొట్టాడు. ఎన్నో మ్యాచుల్లో కరీబియన్ టీమ్ సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాడు. అతడి తనయుడు రాయ్ బెంజమిన్ కూడా తొలుత క్రికెట్ వైపే అడుగులు వేశాడు. పేస్ బౌలింగ్‌పై ఫోకస్ పెట్టాడు.
రన్నింగ్‌లో రేయ్ బెంజమిన్‌కు మంచి ప్రతిభ ఉందని గుర్తించాడు అతడి కోచ్. దీంతో క్రమంగా క్రికెట్‌ను వదిలి ట్రాక్ అండ్ ఫీల్డ్ వైపు దృష్టి సారించాడు రాయ్. తక్కువ కాలంలోనే టాలెంటెడ్ అథ్లెట్‌గా పేరు తెచ్చుకున్నాడు. వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్-2013, వరల్డ్ రిలే-2015లో ఆంటిగ్వా తరఫున ఆడిన బెంజమిన్.. 2018లో అమెరికాకు వెళ్లిపోయాడు. టోక్యో ఒలింపిక్స్‌లో అదే దేశం తరఫున బరిలోకి దిగి సిల్వర్ మెడల్ సాధించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో ఏకంగా రెండు గోల్డ్ మెడల్స్ కొట్టాడు. 400 మీటర్ల హర్డిల్స్‌లో 46.46 సెకన్లలోనే పరుగును ముగించి విజేతగా నిలిచాడు. ఆ తర్వాత 4×400 రిలేలోనూ గోల్డ్‌ను కైవసం చేసుకున్నాడు. కుమారుడి సక్సెస్‌తో విన్స్టన్ బెంజమిన్ ఆనందంలో మునిగిపోయాడు. రాయ్ ఎంత శ్రమించాడో తనకు తెలుసునని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.