iDreamPost
android-app
ios-app

SRH vs MI: ముంబై ఓటమి.. SRHపై సూర్యకుమార్ ప్రశంసలు! పోస్ట్ వైరల్..

  • Published Mar 28, 2024 | 6:06 PM Updated Updated Mar 28, 2024 | 6:06 PM

ముంబై ఇండియన్స్ పై గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపాడు ఎంఐ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది.

ముంబై ఇండియన్స్ పై గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపాడు ఎంఐ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది.

SRH vs MI: ముంబై ఓటమి.. SRHపై సూర్యకుమార్ ప్రశంసలు! పోస్ట్ వైరల్..

ఐపీఎల్ 2024 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ చేతిలో 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత రెండో మ్యాచ్ లో గొప్పగా పుంజుకుని ముంబై ఇండియన్స్ టీమ్ ను 31 రన్స్ తో చిత్తు చేసింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లు నమోదు చేశాయి రెండు జట్లు. ఇక ఈ మ్యాచ్ లో ముంబై ఓడిపోగా.. సొంత టీమ్ ప్లేయర్ అయిన సూర్యకుమార్ యాదవ్ సన్ రైజర్స్ జట్టుపై ప్రశంసలు కురిపించాడు.

సూర్యకుమార్ యాదవ్.. కాలికి గాయం కావడంతో సర్జరీ చేయించుకుని ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం అయినా గానీ ఇంకా జట్టులో చేరలేదు. కానీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటాడు. ఇటీవలే హార్ట్ బ్రేకింగ్ స్టోరీ పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. తాజాగా మరోసారి ఎవ్వరూ ఊహించని విధంగా పోస్ట్ పెట్టాడు. ముంబై టీమ్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఇన్ స్టాగ్రామ్ వేదికగా SRH కు శుభాకాంక్షలు తెలిపాడు.

“క్రికెట్ చరిత్రలో ఇదొక అద్భుతమైన మ్యాచ్. ప్రేక్షకులను కంప్లీట్ గా ఎంటర్ టైన్ చేసింది. సన్ రైజర్స్ ప్లేయర్ సూపర్ గా ఆడారు. అలాగే ముంబై ఆటగాళ్లు కూడా ఎంతో గొప్పగా పోరాడారు. అమైజింగ్ ఫైట్” అంటూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. దీంతో సూర్యకుమార్ కు పాండ్యా కెప్టెన్సీ అంటే ఇష్టం లేదు.. అందుకే ఇలా పోస్ట్ లు పెడుతూ వస్తున్నాడు అంటూ నెటిజన్లు రాసుకొస్తున్నారు. ఇదిలా ఉండగా.. సూర్యకుమార్ గాయం గురించి ఎన్సీఏ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. అక్కడి నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తే సూర్య టీమ్ లో చేరుతాడు. మరి సూర్య సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IPL 2024: వెలుగులోకి సంచలన నిజాలు.. రెండుగా చీలిన ముంబై ఇండియన్స్!