iDreamPost

IPL 2024: వెలుగులోకి సంచలన నిజాలు.. రెండుగా చీలిన ముంబై ఇండియన్స్!

ముంబై ఇండియన్స్ టీమ్ కు సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆ జట్టు పేరుకే ఒక టీమ్ గా కనిపిస్తున్నా.. లోపల రెండు జట్లుగా విడిపోయిందని ప్రముఖ నేషనల్ మీడియా షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ముంబై ఇండియన్స్ టీమ్ కు సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆ జట్టు పేరుకే ఒక టీమ్ గా కనిపిస్తున్నా.. లోపల రెండు జట్లుగా విడిపోయిందని ప్రముఖ నేషనల్ మీడియా షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

IPL 2024: వెలుగులోకి సంచలన నిజాలు.. రెండుగా చీలిన ముంబై ఇండియన్స్!

ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్, పైగా జట్టులో స్టార్ ప్లేయర్లకు కొదవలేదు. దీంతో 6వ ఐపీఎల్ టైటిల్ పై కన్నేసింది ముంబై ఇండియన్స్. అందుకు తగ్గట్లుగానే ఐపీఎల్ 2024 సీజన్ కోసం జట్టులో సమూల మార్పులు తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ మార్పులే జట్టును మూలనపడేసేలా ఉన్నాయి. ముంబై ఇండియన్స్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఆ టీమ్ ను కాకవికలం చేస్తోంది. తాజాగా ముంబై ఇండియన్స్ టీమ్ లో జరుగుతున్న అంతర్గత యుద్ధం గురించి ఓ నేషనల్ మీడియా సంచలన నిజాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ముంబై టీమ్ రెండుగా చీలింది అంటూ షాకింగ్ న్యూస్ చెప్పింది. మరి నిజంగానే ఒకే జట్టుగా కనిపిస్తున్న ఎంఐ టీమ్ రెండుగా చీలిపోయిందా? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024 టైటిల్ ను ఎగురేసుకుపోవాలని ముంబై ఇండియన్స్ తెగ ఆరాటపడుతోంది. అందుకోసం ఐదు సార్లు టీమ్ ను ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను క్యాష్ ఆన్ ట్రేడింగ్ విధానం ద్వారా గుజరాత్ నుంచి కొనుగోలు చేసుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఆసక్తికర పరిణామంగా నిలిచింది. ఇక ఎప్పుడైతే రోహిత్ ను తప్పించి పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారో.. అప్పటి నుంచి ముంబై టీమ్ కు దరిద్రం పట్టుకుంది. తన కెప్టెన్సీతో మాయ చేస్తాడనుకున్న పాండ్యా వరుస ఓటములతో విమర్శలపాలవుతూ వస్తున్నాడు. ఇదంతా అందరికి తెలిసిన విషయమే.

కానీ తాజాగా వెలుగులోకి సంచలన విషయాలు వచ్చాయి. ప్రముఖ నేషనల్ మీడియా దైనిక్ జాగారన్ షాకింగ్ న్యూస్ చెప్పింది. దైనిక్ జాగారన్ ప్రకారం.. ముంబై ఇండియన్స్ టీమ్ రెండుగా చీలిపోయింది. ఒకవైపు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్లు ఉండగా.. మరోవైపు హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్లు ఉన్నారని తెలిపింది. హార్దిక్ కు ముంబై యాజమాన్యం సపోర్ట్ ఉందని పేర్కొంది. దీంతో అందరూ అనుకున్నట్లుగానే ముంబై టీమ్ లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయని అర్దమవుతోంది. బుమ్రాకు బౌలింగ్ ఇవ్వకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. అదీకాక సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ తర్వాత పాండ్యా సీనియర్లు అయిన మలింగ, పొలార్డ్ తో వ్యవహరించిన తీరు అందరికి కోపం తెప్పిస్తోంది. ఒక ఆటగాడు ఫామ్ లో లేకపోతే.. ఇబ్బంది లేదు కానీ.. ఒక టీమ్ లో మాత్రం ప్లేయర్ల మధ్య సఖ్యత లేకపోతే.. అది ఆ జట్టు విజయావకాశాలను పూర్తిగా దెబ్బతీస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మరి నిజంగానే ముంబై టీమ్ రెండుగా చీలిపోయిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: తెలుగోల్ల ప్రేమకి దండం పెట్టేసిన రోహిత్ శర్మ! నిన్న లైవ్ లో చూపించని వీడియో!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి