iDreamPost
android-app
ios-app

Rohit Sharma: రోహిత్ శర్మకు బుజ్జగింపులు.. భారీ ఆఫర్ ఇచ్చిన ముంబై ఇండియన్స్!

  • Published Apr 12, 2024 | 3:10 PM Updated Updated Apr 12, 2024 | 3:10 PM

కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించిన ముంబై ఇండియన్స్ అతడిని బుజ్జగించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హిట్ మ్యాన్ కు భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటంటే?

కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించిన ముంబై ఇండియన్స్ అతడిని బుజ్జగించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హిట్ మ్యాన్ కు భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటంటే?

Rohit Sharma: రోహిత్ శర్మకు బుజ్జగింపులు.. భారీ ఆఫర్ ఇచ్చిన ముంబై ఇండియన్స్!

ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ గా రోహిత్ శర్మ ను తప్పించి.. హార్దిక్ పాండ్యాకు ఆ పగ్గాలు అందించడం ఎంత పెద్ద వివాదానికి దారితీసిందో మనందరికి తెలిసిందే. అయితే రోహిత్ ను సారథ్యం నుంచి తప్పించడం ఫ్యాన్స్ తో పాటుగా సగటు క్రికెట్ ఫ్యాన్స్ క్కూడా నచ్చలేదు. ఇక ఈ పరిణామం జరిగిన దగ్గర నుంచి హిట్ మ్యాన్ పై రోజుకో వార్త నెట్టింట వైరల్ గా మారింది. వేరే ఫ్రాంచైజీకి వెళ్తాడని, పాండ్యాను తీసేసి మళ్లీ రోహిత్ కే కెప్టెన్సీ ఇస్తారని ఇలా ఎన్నో వార్తలు వైరల్ గా మారాయి. తాజాగా మరో న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎంఐ కెప్టెన్ గా తొలగించడంతో.. అసంతృప్తిలో ఉన్నాడు హిట్ మ్యాన్. దీంతో అతడిని బుజ్జగించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది ముంబై యాజమాన్యం. అదీకాక తాజాగా ముంబై ఓనర్ ఆకాశ్ అంబానీ, రోహిత్ ఇద్దరూ కలిసి ఒకే కార్లో వచ్చారు. ఈ వీడియో తెగ వైరల్ గా మారింది. రోహిత్ పై పక్క ఫ్రాంచైజీలు కన్ను వేయడంతో.. హిట్ మ్యాన్ ను బుజ్జగించే పనిలో పడింది ఎంఐ యాజమాన్యం. అందులో భాగంగా.. అవసరమైతే ముంబై ఇండియన్స్ టీమ్ కు కెప్టెన్ గా తిరిగి రోహిత్ ను నియమించడానికి సిద్దమైనట్లు సమాచారం. ఈ సీజన్ సెకండాఫ్ లోనే ఈ నిర్ణయం రావొచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదే కాకుండా.. తమ బ్రాండ్ వాల్యూ తగ్గకుండా, బిజినెస్ పార్ట్ నర్స్ జట్టును వీడకుండా.. తమ వ్యాపారంలో విలువైన షేర్లను రోహిత్ కు ఇచ్చేందుకు ఎంఐ యాజమాన్యం సిద్ధమైందని తెలుస్తోంది. ఇక ఈ విషయం గురించి మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది. అయితే ప్రస్తుతం ముంబై విజయాల బాట పట్టింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత వరుసగా రెండు విజయాలు సాధించి.. రేసులోకి దూసుకొచ్చింది. దీంతో ఇప్పుడే పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించే ఛాన్సే లేదని మరికొందరు వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా.. రోహిత్ కోసం లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ యాజమాన్యాలు ట్రాన్స్ ఫర్ విండో ద్వారా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.