iDreamPost

MI vs RCB: టీ20 చరిత్రలోనే తొలిసారి.. 21 ఏళ్ళ తర్వాత అరుదైన ఘనత!

ఐపీఎల్ కాదు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే ముంబై-ఆర్సీబీ మ్యాచ్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఐపీఎల్ కాదు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే ముంబై-ఆర్సీబీ మ్యాచ్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.

MI vs RCB: టీ20 చరిత్రలోనే తొలిసారి.. 21 ఏళ్ళ తర్వాత అరుదైన ఘనత!

ఈ ఐపీఎల్ సీజన్ పలు రికార్డులను బద్దలుకొడుతూ.. మరి కొన్ని ఘనతలను క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. తాజాగా జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లో ఓ అరుదైన ఘనత నమోదైంది. కేవలం ఐపీఎల్ కాదు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఇలా జరగడం 21 ఏళ్ళలో ఇదే తొలిసారి కావడం విశేషం. మరి ఇంతకీ ఆ ఘనత ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

ఐపీఎల్ 2024లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత విజయాల బాటపట్టింది ముంబై ఇండియన్స్ టీమ్. వరుసగా రెండు విజయాలు సాధించి.. రేసులోకి దూసుకొచ్చింది. ఇక తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై బ్యాటర్లు విజృంభించడంతో 197 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.3 ఓవర్లలోనే ఊదేసింది. ఇషాన్ కిషన్(69), సూర్యకుమార్(52) విధ్వంసకర బ్యాటింగ్ తో జట్టుకు విజయాన్ని అందించారు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ఈ మ్యాచ్ లో టీ20 చరిత్రలో తొలిసారి అరుదైన రికార్డు నమోదైంది.

2005 ఫిబ్రవరి 17న న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరిగింది. అయితే 2003లో అనధికారికంగా టీ20 మ్యాచ్ కూడా జరిగింది. కానీ ఇన్ని సంవత్సరాల పొట్టి క్రికెట్ చరిత్రలో తొలిసారి ఓ అరుదైన ఘనత నెలకొల్పబడింది. అదేంటంటే? టీ20 క్రికెట్ లో ముగ్గురు బ్యాటర్లు అర్ధశతకాలు సాధించడంతో పాటుగా ప్రత్యర్థి బౌలర్ 5 వికెట్లు పడగొట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. 21 ఏళ్ళ టీ20 చరిత్రలో ఈ రికార్డు ఇప్పటి వరకు నమోదుకాలేదు. దీంతో ముంబై-ఆర్సీబీ మ్యాచ్ ఈ రేర్ ఫీట్ కు వేదికగా నిలిచింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి