CSK vs MI: గైక్వాడ్, దుబే కాదు.. మా ఓటమిని శాసించింది అతడే: పాండ్యా

చెన్నైతో జరిగిన మ్యాచ్ లో తమ ఓటమిని శాసించింది రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే కాదని, అతడి వల్లే మేం ఓడిపోయమని షాకింగ్ కామెంట్స్ చేశాడు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా.

చెన్నైతో జరిగిన మ్యాచ్ లో తమ ఓటమిని శాసించింది రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే కాదని, అతడి వల్లే మేం ఓడిపోయమని షాకింగ్ కామెంట్స్ చేశాడు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా.

IPL 2024 సీజన్ లో హ్యాట్రిక్ విజయాలు సాధించాలని ఆశపడ్డ ముంబై ఇండియన్స్ టీమ్ కు ఊహించని షాక్ ఇచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. ముంబై సొంత గడ్డ అయిన వాంఖడేలోనే వారిని 20 రన్స్ తేడాతో చిత్తు చేసింది. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ ప్రేక్షకులకు మస్త్ మజాను ఇచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో తమ ఓటమిని శాసించింది రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే కాదని, అతడి వల్లే మేం ఓడిపోయమని షాకింగ్ కామెంట్స్ చేశాడు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా. పూర్తి వివరాల్లోకి వెళితే..

వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైన చోట కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 69 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న దుబే కేవలం 38 బంతుల్లోనే 10 ఫోర్లు, 2 సిక్సులతో 66 రన్స్ తో అజేయంగా నిలిచాడు. వీరిద్దరికి తోడు చివర్లో ధోని 4 బంతుల్లో 3 సిక్సులతో 20 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే 207 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై 6 వికెట్లు కోల్పోయి నిర్ణీత ఓవర్లలో 186 పరుగులకే పరిమితమైంది. రోహిత్ శర్మ(105*) సెంచరీతో అదరగొట్టాడు. కానీ టీమ్ ను మాత్రం గెలిపించలేకపోయాడు. ఇదిలా ఉండగా.. మ్యాచ్ అనంతరం తమ ఓటమికి కారణం చెప్పాడు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా.

ఓటమిపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందిస్తూ..”ఈ మ్యాచ్ లో చెన్నై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మరీ ముఖ్యంగా మతీష పతిరణ 4 వికెట్లతో మమ్మల్ని దెబ్బకొట్టాడు. అయితే మా ఓటమికి ప్రధాన కారణం మాత్రం మహేంద్రసింగ్ ధోనినే. అతడు వికెట్ల వెనక ఉండి జట్టును నడిపించిన తీరు అద్భుతం. పరిస్థితులకు తగ్గట్లుగా ఏం చేయాలో, ఎలా చేయాలో రుతురాజ్ ను గైడ్ చేస్తూ ఉన్నాడు. ఇక బ్యాటింగ్ లో కేవలం 4 బంతుల్లోనే 3 సిక్సులతో 20 పరుగులు చేసి.. మా ఓటమిని శాసించాడు” అంటూ ధోనిపై ప్రశంసలు కురిపించాడు. ముంబై కూడా ధోని కొట్టిన 20 పరుగుల తేడాతో ఓడిపోవడం గమనార్హం. మరి పాండ్యా అన్నట్లుగా ముంబై ఓటమిని ధోనినే కారణమా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments