iDreamPost

Rohit Sharma: రోహిత్ సెంచరీ వృథా.. కానీ తొలి భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు

చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ సెంచరీతో చెలరేగాడు రోహిత్ శర్మ. కానీ తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. అయితే ఈ క్రమంలోనే సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ సెంచరీతో చెలరేగాడు రోహిత్ శర్మ. కానీ తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. అయితే ఈ క్రమంలోనే సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

Rohit Sharma: రోహిత్ సెంచరీ వృథా.. కానీ తొలి భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు

ఈ ఐపీఎల్ సీజన్ లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఫోర్లు, సిక్సర్లతో బ్యాటర్లు విరుచుకుపడటంతో.. ప్రేక్షకులు తడిచిముద్దైయ్యారు. ఇక ఈ సీజన్ లో వరుసగా రెండు విజయాలతో దూసుకెళ్తున్న ముంబై ఇండియన్స్ కు చెక్ పెట్టింది చెన్నై సూపర్ కింగ్స్. వారి సొంత గడ్డపైనే వారికి ఓటమిని రుచిచూపించి అదరగొట్టింది. భారీ లక్ష్య ఛేదనలో చివరి వరకు పోరాడిన ముంబై టీమ్ విజయానికి 20 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఇక ఈ మ్యాచ్ లో సెంచరీతో చెలరేగాడు ఎంఐ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే ఓ సరికొత్త చరిత్రకు నాందిపలికాడు.

చెన్నైతో జరిగిన వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగిపోయాడు. చివరి వరకు క్రీజ్ లో నిలబడినా.. టీమ్ కు మాత్రం విజయాన్ని అందించలేకపోయాడు. దీంతో రోహిత్ అద్భుతమైన శతకం వృథాకాక తప్పలేదు. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ టీమ్ కు మెరుపు ఆరంభమే దక్కింది. ఓపెనర్లు రోహిత్-ఇషాన్ తొలి వికెట్ కు 70 పరుగులు జోడించారు. కానీ మిగతా బ్యాటర్లు ఈ శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేక చేతులెత్తేశారు. గత మ్యాచ్ లో మెరుపు బ్యాటింగ్ చేసిన సూర్య.. ఈ మ్యాచ్ లో డకౌట్ గా వెనుదిరిగాడు. ఇషాన్(23), తిలక్(31), హార్దిక్(2), టిమ్ డేవిడ్(13), షెపర్డ్(1) విఫలమైయ్యారు. ఒకవైపు క్రమంగా వికెట్లు పడుతున్నప్పటికీ.. రోహిత్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. అయితే హిట్ మ్యాన్ కు మరో ఎండ్ లో సపోర్ట్ లభించి ఉంటే.. ముంబై విజయం సాధించేదే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Rohit created history as the first Indian cricketer

ఇక ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో మూడో సిక్స్ కొట్టడం ద్వారా ఈ ఘనత సాధించాడు హిట్ మ్యాన్. టీ20ల్లో 500 సిక్సులు కొట్టిన తొలి భారత ప్లేయర్ గా రోహిత్ నిలిచాడు. ఓవరాల్ గా ఈ లిస్ట్ లో ఐదో బ్యాటర్ గా కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో విండీస్ వీరుడు క్రిస్ గేల్ 1056 సిక్సులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కీరన్ పొలార్డ్(860), ఆండ్రీ రస్సెల్(678), కొలిన్ మున్రో(548) తర్వాతి ప్లేసుల్లో కొనసాగుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో దుబే(66*), గైక్వాడ్(69), ధోని(20*) పరుగులతో రాణించారు. అనంతరం భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై 6 వికెట్లు కోల్పోయి 186 రన్స్ దగ్గరే ఆగిపోయింది. దీంతో 20 పరుగుల తేడాతో అపజయాన్ని మూటగట్టుకుంది. రోహిత్ శర్మ 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులతో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరి సరికొత్త చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి