Nidhan
ఒక టీమిండియా యంగ్ పేసర్‌కు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఊహించని షాక్ ఇచ్చింది. దీంతో ఆ క్రికెటర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చే సీజన్లో ఆడటం కష్టంగా మారింది.
ఒక టీమిండియా యంగ్ పేసర్‌కు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఊహించని షాక్ ఇచ్చింది. దీంతో ఆ క్రికెటర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చే సీజన్లో ఆడటం కష్టంగా మారింది.
Nidhan
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడటం ఎంతో మంది యంగ్ క్రికెటర్స్‌కు ఓ డ్రీమ్‌గా మారింది. కాసుల లీగ్‌లో రాణిస్తే భారీ మొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశం, క్రేజ్, పాపులారిటీ దక్కడంతో పాటు టీమిండియాలోనూ ఆడే అవకాశం లభిస్తోంది. దీంతో యంగ్‌స్టర్స్ ఈ లీగ్‌లో ఆడే ఛాన్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే డొమెస్టిక్ లెవల్లో బాగా పెర్ఫార్మ్ చేసిన వారికే ఎక్కువగా ఐపీఎల్లో ఆడే ఛాన్స్ దొరుకుతోంది. ఇలా దేశవాళీల్లో రాణించి ఐపీఎల్‌లోకి వచ్చిన క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు. వారిలో కొందరు మెగా లీగ్‌లోనూ బాగా పెర్ఫార్మ్ చేసి భారత టీమ్‌కు సెలక్ట్ అయ్యారు. అలాంటి వారిలో చేతన్ సకారియా ఒకడు. టీమిండియా తరఫున కొన్ని మ్యాచులు ఆడిన ఈ యంగ్ పేసర్.. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. అయితే ఇప్పుడు ఆ లీగ్‌లో అతడు ఆడటం కష్టంగా మారింది.
భారత యంగ్ బౌలర్, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ పేసర్ చేతన్ సకారియాకు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఊహించని షాక్ ఇచ్చింది. ఐపీఎల్-2024 ఆక్షన్‌కు ముందు చేతన్ సకారియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సౌరాష్ట్ర క్రికెటర్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానం వ్యక్తం చేసిన బీసీసీఐ.. అతడ్ని అనుమానిత బౌలింగ్ యాక్షన్ కలిగిన బౌలర్ల లిస్టులో చేర్చింది. సకారియాను బోర్డు పూర్తిగా నిషేధించనప్పటికీ, అతడి బౌలింగ్ యాక్షన్ మీద అనుమానాలు ఉన్నాయని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెప్పకనే చెప్పింది. దీంతో 25 ఏళ్ల ఈ లెఫ్టార్మ్ మీడియం పేసర్ ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా మారింది. అయితే చేతన్ సకారియాతో పాటు మరికొందరు బౌలర్లను కూడా అనుమానిత బౌలింగ్ యాక్షన్ కలిగిన బౌలర్ల జాబితాలో చేర్చింది బీసీసీఐ.
సకారియాతో పాటు రోహన్ కున్నుమ్మల్ (కేరళ), చిరాగ్ గాంధీ (గుజరాత్), తనుష్ కోటియన్ (ముంబై), కేఎల్ శ్రీజిత్ (కర్ణాటక), మనీష్ పాండే (కర్ణాటక), సల్మాన్ నిజార్ (కేరళ), సౌరబ్ దూబే (విదర్భ), అర్పిత్ గులేరియా (హిమాచల్ ప్రదేశ్)ను అనుమానిత బౌలింగ్ యాక్షన్ కలిగిన బౌలర్ల లిస్టులో బీసీసీఐ చేర్చింది. వీళ్లు అనుమానిత బౌలర్ల జాబితాలో మాత్రమే చేర్చబడ్డారు. ఈ ప్లేయర్ల మీద ఎలాంటి బ్యాన్ లేదు. బ్యాటింగ్‌కు సంబంధించి ఈ క్రికెటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఇక, ఐపీఎల్ ప్లేయర్ల రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ సకారియాను రిలీజ్ చేసింది. దీంతో తిరిగి ఐపీఎల్-2024 ఆక్షన్‌లో అతడు తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. కానీ బీసీసీఐ సకారియాను అనుమానిత బౌలర్ల జాబితాలో చేర్చడంతో ఫ్రాంచైజీలు అతడ్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోవచ్చు. కాగా, ఐపీఎల్లో 19 మ్యాచ్‌లు ఆడిన చేతన్.. భారత జట్టుకు రెండు టీ20లు, ఒక వన్డేలో ప్రాతినిధ్యం వహించాడు.
ఇదీ చదవండి: MS Dhoni: ధోనీపై సంచలన ఆరోపణలు చేసిన IPS ఆఫీసర్‌కు జైలు శిక్ష! అసలేం జరిగిందంటే..!