iDreamPost

MS Dhoni: ధోనీపై సంచలన ఆరోపణలు చేసిన IPS ఆఫీసర్​కు జైలు శిక్ష! అసలేం జరిగిందంటే..!

  • Published Dec 15, 2023 | 8:50 PMUpdated Dec 16, 2023 | 2:11 PM

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీపై సంచలన ఆరోపణలు చేసిన ఓ ఐపీఎస్ ఆఫీసర్​కు జైలు శిక్ష పడింది. అసలు ఆ అధికారి ఎవరు? ధోనీపై ఆయన చేసిన ఆరోపణలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీపై సంచలన ఆరోపణలు చేసిన ఓ ఐపీఎస్ ఆఫీసర్​కు జైలు శిక్ష పడింది. అసలు ఆ అధికారి ఎవరు? ధోనీపై ఆయన చేసిన ఆరోపణలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Dec 15, 2023 | 8:50 PMUpdated Dec 16, 2023 | 2:11 PM
MS Dhoni: ధోనీపై సంచలన ఆరోపణలు చేసిన IPS ఆఫీసర్​కు జైలు శిక్ష! అసలేం జరిగిందంటే..!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్​ ధోని మళ్లీ గ్రౌండ్​లో ఎప్పుడెప్పుడు దిగుతాడా అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేషనల్ టీమ్​కు ఎప్పుడో గుడ్​బై చెప్పేసిన మాహీ.. కేవలం ఇండియన్ ప్రీమియర్​ లీగ్​లో మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. పెద్దగా స్టార్లు లేకపోయినా యంగ్​స్టర్స్​తో నిండిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్​ను కెప్టెన్​గా అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్​లో అంతగా ఎక్స్​పెక్టేషన్స్ లేకుండా బరిలోకి దిగిన సీఎస్​కే విన్నర్​గా నిలిచింది. టీమ్​ ఆరోసారి టైటిల్ గెలవడంలో ధోని రోల్ ఎంతగానో ఉంది. అలాంటి ధోని మీద ఓ ఐపీఎస్ ఆఫీసర్ సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. 2013 ఐపీఎల్​ టైమ్​లో మాహీ బెట్టింగ్​కు, మ్యాచ్ ఫిక్సింగ్​కు పాల్పడ్డాడంటూ సంపత్ కుమార్ అనే అధికారి తీవ్ర ఆరోపణలు చేశారు.

ఐపీఎల్-2013 బెట్టింగ్ స్కాండల్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్ కారణంగానే చెన్నై సూపర్ కింగ్స్​తో పాటు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలను బ్యాన్ కూడా చేశారు. ఈ స్కామ్​కు సంబంధించి అప్పట్లో సీఎస్​కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మీద తమిళనాడుకు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జీ సంపత్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక టీవీ ఛానల్​ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ధోని బెట్టింగ్​కు, మ్యాచ్ ఫిక్సింగ్​కు పాల్పడ్డాడని అన్నారు. ఈ ఆరోపణల మీద సీరియస్ అయిన ధోని.. తన పరువుకు నష్టం కలిగించినందుకు గానూ సంపత్​తో పాటు టీవీ ఛానల్​పై 2014లో పరువు నష్టం దావా వేశారు. పరిహారంగా రూ.100 కోట్లు చెల్లించాలని, తనపై పరువు నష్టం కలిగించే ప్రకటనలు జారీ చేయకుండా నిషేధించాలని కోర్టును కోరాడు మాహీ.

ఈ కేసును తాజాగా విచారించిన మద్రాస్ హైకోర్టు సంపత్ కుమార్​కు 15 రోజుల జైలు శిక్ష విధించింది. జస్టిస్ సుందర్ మోహన్, జస్జిస్ ఎస్ఎస్ సుందర్​తో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. పదిహేను రోజుల శిక్ష మీద అప్పీలు చేసుకోవడానికి సంపత్ కుమార్​కు కోర్టు 30 రోజుల గడువు ఇచ్చింది. అలాగే ధోనీపై పరువు నష్టం కలిగించే ప్రకటనలు ఇవ్వొద్దని రిటైర్డ్ ఆఫీసర్​తో పాటు ఆ మీడియా సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. ధోనీకి అనుకూలంగా తీర్పు రావడంపై అతడ్ని అభిమానించే వాళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత ఐపీఎల్​ టైమ్​లో గాయపడిన మాహీ.. నెక్స్ట్ సీజన్​లో ఆడతాడో లేదో డౌట్​గా మారింది. కానీ ఇటీవల జరిగిన ప్లేయర్ల రిటెన్షన్ టైమ్​లో దీనిపై క్లారిటీ వచ్చింది. వచ్చే ఐపీఎల్​లో ధోని ఆడటం ఖాయం కావడంతో అతడి ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. అదే టైమ్​లో తాజాగా పరువు నష్టం కేసులోనూ అతడికి అనుకూలంగా తీర్పు రావడంతో వాళ్ల ఆనందం రెట్టింపు అయింది. మరి.. ధోని కేసులో మాజీ ఐపీఎస్​కు జైలు శిక్ష పడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Hardik Pandya: ముంబై ఇండియన్స్ సంచలన ప్రకటన! కెప్టెన్​గా హార్దిక్ పాండ్యా!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి