iDreamPost

IPL 2024: ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే.. 10 ఏళ్ల తర్వాత కప్ కొట్టనున్న ఆ టీమ్!

ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే.. 10 ఏళ్ల తర్వాత ఈసారి కూడా ఆ టీమే కప్ కొట్టబోతుందా? మరి ఆ సెంటిమెంట్ ఏంటి? కప్ కొట్టే ఆ టీమ్ ఏది? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే.. 10 ఏళ్ల తర్వాత ఈసారి కూడా ఆ టీమే కప్ కొట్టబోతుందా? మరి ఆ సెంటిమెంట్ ఏంటి? కప్ కొట్టే ఆ టీమ్ ఏది? పూర్తి వివరాల్లోకి వెళితే..

IPL 2024: ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే.. 10 ఏళ్ల తర్వాత కప్ కొట్టనున్న ఆ టీమ్!

ఐపీఎల్ 2024 సీజన్ ముగింపు దశకు చేరుకుంటోంది. గ్రూప్ దశ మ్యాచ్ లో దాదాపుగా ముగుస్తున్నాయి. ఇక ఇప్పటికే కోల్ కత్త నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ ను కన్ఫామ్ చేసుకుంది. మిగిలిన మూడు స్థానాల కోసం ఆరు జట్లు పోటీ పడుతున్నాయి. అయితే రాజస్తాన్ కూడా దాదాపు ప్లే ఆఫ్స్ చేరినట్లే. చెన్నై, సన్ రైజర్స్, ఢిల్లీ, ఆర్సీబీ, లక్నోలకు కు కూడా ప్లే ఆఫ్స్ చేరే ఛాన్స్ లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ హిస్టరీలో గతంలో జరిగిన సెంటిమెంట్ రిపీట్ అయితే.. 10 ఏళ్ల తర్వాత ఈసారి కూడా ఆ టీమే కప్ కొట్టబోతుందా? మరి ఆ సెంటిమెంట్ ఏంటి? కప్ కొట్టే ఆ టీమ్ ఏది? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ 2024 రసవత్తరంగా మారుతోంది. ప్లే ఆఫ్స్ లోకి వెళ్లడానికి ఆరు టీమ్స్ పోటీపడుతున్నాయి. ఇదిలా ఉండగా.. నిన్న గుజరాత్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో.. ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో కేకేఆర్ దర్జాగా ప్లే ఆఫ్స్ చేరింది. కానీ గుజరాత్ మాత్రం ఇంటిదారి పట్టింది. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. కోల్ కత్తా నైట్ రైడర్స్ మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడబోతోంది అంటే అవుననే అంటున్నాయి సెంటిమెంట్స్. ఇంతకీ రిపీట్ అయిన ఆ సెంటిమెంట్ ఏంటంటే?

Sentiment repeat

గౌతమ్ గంభీర్ నాయకత్వంలో కేకేఆర్ 2012 ఐపీఎల్ సీజన్ లో క్వాలిఫయర్ 1 ఆడింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ను 18 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ కు చేరింది. ఇక ఫైనల్లో చెన్నైను 5 వికెట్లతో ఓడించి.. తొలి ఐపీఎల్ టైటిల్ ను అందుకుంది. ఆ తర్వాత 2014లో కూడా క్వాలిఫర్ 1 మ్యాచ్ ఆడిన కేకేఆర్ ఈ ఏడాది కూడా ఫైనల్లో పంజాబ్ ను ఓడించి రెండో ఐపీఎల్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు మళ్లీ 10 ఏళ్ల తర్వాత క్వాలిఫయర్ 1 మ్యాచ్ ఆడుతుండటంతో.. ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే, ఈసారి కూడా ముచ్చటగా మూడో టైటిల్ కేకేఆర్ కొడుతుందని అంటున్నారు ఫ్యాన్స్. కాగా.. ఈ సీజన్ లో అద్భుతమైన ఆటతీరుతో అలరిస్తోంది కేకేఆర్. గౌతమ్ గంభీర్ మెంటర్ గా ఆ టీమ్ ను విజయవంతంగా ముందుండి నడిపిస్తున్నాడు. మరి ఈసారి సెంటిమెంట్ రిపీట్ అయ్యి కేకేఆర్ కప్ కొడుతుందా? ఏ టీమ్ కప్ కొడుతుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి