iDreamPost
android-app
ios-app

T20 World Cup: రోహిత్ శర్మ సంచలన నిర్ణయం? ఆందోళనలో ఫ్యాన్స్..

  • Published May 14, 2024 | 7:23 AM Updated Updated May 14, 2024 | 7:23 AM

రోహిత్ శర్మ ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తోంది. మరి హిట్ మ్యాన్ తీసుకునే ఆ డెసిషన్ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

రోహిత్ శర్మ ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తోంది. మరి హిట్ మ్యాన్ తీసుకునే ఆ డెసిషన్ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

T20 World Cup: రోహిత్ శర్మ సంచలన నిర్ణయం? ఆందోళనలో ఫ్యాన్స్..

టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ముంబై కెప్టెన్సీ నుంచి తప్పించడం, ఈ ఐపీఎల్ లో తన స్థాయికి తగ్గట్లుగా రాణించకపోవడం రోహిత్ ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశను కలిగిస్తోంది. హిట్ మ్యాన్ ను కెప్టెన్సీ నుంచి తీసేసి పాండ్యాకు ఆ పగ్గాలను అందించడం, ఈ సీజన్ లో ముంబై దారుణంగా విఫలం కావడం అన్నీ రోహిత్ ను మానసికంగా కుంగదీశాయి. ఈ నేపథ్యంతో అతడు ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరి హిట్ మ్యాన్ తీసుకోబోయే ఆ సంచలన నిర్ణయం ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం టీమిండియా ముందున్న టార్గెట్ టీ20 వరల్డ్ కప్ గెలవడమే. ఇందుకోసం గత కొన్ని నెలలుగా తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ వస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. సీనియర్లు, జూనియర్లతో, హిట్టర్లతో సమతూకంగా ఉంది. అయితే తాజాగా ఓ వార్త క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే? టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పబోతున్నట్లు సమాచారం. కాగా.. ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి వెళ్లడించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Rohit Sharma's sensational decision Fans are worried

ఇదిలా ఉండగా.. రోహిత్ డెసిషన్ ముందే తెలిసిన బీసీసీఐ, అతడి స్థానంలో టీ20లకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించాలని భావిస్తోందట. అందుకే వరల్డ్ కప్ జట్టుకు వైస్ కెప్టెన్ గా పాండ్యాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ పొట్టి ప్రపంచ కప్ తర్వాత వీడ్కోలు పలికితే.. పాండ్యానే కెప్టెన్ అని అంతా ఫిక్స్ అయ్యారు. పైగా ప్రస్తుతం టీ20లకు హిట్ మ్యాన్ అందుబాటులో లేకపోతే హార్దిక్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ ప్రారంభం అయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముంబై కెప్టెన్ గా పాండ్యా దారుణంగా విఫలం కావడంతో.. టీ20 పగ్గాలు అతడికే అందిస్తారా? లేక రిషబ్ పంత్ లాంటి యంగ్ స్టర్లకు ఛాన్స్ ఇస్తారా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనప్పటికీ రోహిత్ టీ20లకు గుడ్ బై చెప్పబోతున్నాడు అన్న వార్తలు ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తున్నాయి.

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet