వరుస విజయాలతో ఊపు మీద ఉంది భారత టీమ్. విక్టరీ జోష్‌లో ఉన్న భారత ప్లేయర్లకు ఒక విషయంలో బీసీసీఐ వార్నింగ్ ఇచ్చిందట. ఆ పనులు చేయొద్దని హెచ్చరించిందట.
వరుస విజయాలతో ఊపు మీద ఉంది భారత టీమ్. విక్టరీ జోష్‌లో ఉన్న భారత ప్లేయర్లకు ఒక విషయంలో బీసీసీఐ వార్నింగ్ ఇచ్చిందట. ఆ పనులు చేయొద్దని హెచ్చరించిందట.
వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా జైత్రయాత్ర కంటిన్యూ చేస్తోంది. వరుస విజయాలతో జోరుమీదున్న రోహిత్ సేన మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌కు రెడీ అవుతోంది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌పై విక్టరీలతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత టీమ్ తర్వాతి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో తాడోపేడో తేల్చుకోనుంది. లక్నో వేదికగా ఆదివారం జరిగే ఈ మ్యాచ్ మెగా టోర్నీలో ఆసక్తికరమైన పోరుల్లో ఒకటిగా చెప్పొచ్చు. కీలకమైన ఈ మ్యాచ్‌కు వారం రోజుల రెస్ట్ దొరకడంతో టీమిండియా ప్లేయర్స్ అంతా ధర్మశాలలోనే ఉండిపోయారు.
హిమాలయాల చెంతన ఉన్న ధర్మశాలలో ప్రకృతి అందాలను ఆస్వాదించాలని భారత క్రికెటర్స్ డిసైడయ్యారట. దసరా పండుగ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లకు రెండ్రోజులు హాలిడేస్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. కానీ వేల కిలోమీటర్లు జర్నీ చేసి ఇళ్లకు వెళ్లే బదులు ధర్మశాలలోనే ఉండి రెస్ట్ తీసుకోవడం బెటర్ అని ప్లేయర్స్ భావించారట. రెండ్రోజుల పాటు ధర్మశాలలోనే ఉండేందుకు భారత క్రికెట్ బోర్డు కూడా వారికి పర్మిషన్ ఇచ్చిందట. అయితే అక్కడ ట్రెక్కింగ్ చేసేందుకు మాత్రం వీలులేదని ఆటగాళ్లకు సూచించిందని సమాచారం. ట్రెక్కింగ్ చేస్తూ గాయపడే ఛాన్స్ ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఆదేశాలు జారీ చేసిందని తెలిసింది.
ధర్మశాల ప్రకృతి అందాలు చూసేందుకు క్రికెటర్స్‌కు అనుమతించిన బీసీసీఐ.. అక్కడ ఎలాంటి రిస్కీ పనులు చేయొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. పారాగ్లైడింగ్ లాంటి సాహస క్రీడలకు దూరంగా ఉండాలని.. ఆ పనులు చేస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చిందట. ఈ మేరకు ప్లేయర్స్ కాంట్రాక్ట్‌లోనే ఓ రూల్ ఉందని తెలిసింది. ఒక సిరీస్ జరుగుతున్న టైమ్‌లో ఏ ఆటగాడు కూడా పారాగ్లైడింగ్ చేయడానికి వీల్లేదట. ఇది బీసీసీఐ క్రికెటర్స్ కాంట్రాక్ట్ రూల్స్‌లోనే ఉండటంతో ప్లేయర్లు కూడా దీన్ని తప్పక పాటించాల్సిన పరిస్థితి ఏర్పడిందట. కాగా, ధర్మశాలలో ట్రెక్కింగ్ చేసేందుకు కొందరు భారత క్రికెటర్లు ఇంట్రెస్ట్ చూపించారట. అయితే దీనికి టీమ్ మేనేజ్మెంట్ నో చెప్పేసిందని సమాచారం. మరి.. రోహిత్ సేనకు బీసీసీఐ వార్నింగ్ ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రషీద్ ఖాన్ వెరైటీ బౌలింగ్ యాక్షన్.. ఇలాంటిది ఎప్పుడూ చూసుండరు!