శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కొట్టిన ఓ సిక్స్ హైలైట్‌గా నిలిచింది. ఇది కదా సిక్స్ అనేలా ఆ షాట్ అనిపించింది. అయ్యర్ షాట్ చూసి లంక ప్లేయర్లు షాకయ్యారు.
శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కొట్టిన ఓ సిక్స్ హైలైట్‌గా నిలిచింది. ఇది కదా సిక్స్ అనేలా ఆ షాట్ అనిపించింది. అయ్యర్ షాట్ చూసి లంక ప్లేయర్లు షాకయ్యారు.
వన్డే వరల్డ్ కప్-2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా అదరగొడుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగింది రోహిత్ సేన. అయితే టీమ్‌కు మంచి స్టార్ట్ లభించలేదు. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ (4) రెండు బంతులు ఆడి పెవిలియన్‌కు చేరాడు. అయితే ఫస్ట్ డౌన్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ (88).. శుబ్‌మన్ గిల్ (92)తో కలసి సూపర్బ్ పార్ట్‌నర్‌షిప్‌ను నమోదు చేశాడు. వీళ్లిద్దరూ కలసి రెండో వికెట్‌కు ఏకంగా 189 పరులు జోడించారు. అయితే దురదృష్టవశాత్తూ ఒక్కరు కూడా సెంచరీ మార్క్‌ను చేరుకోలేకపోయారు. గిల్ 92 రన్స్ చేసి ఔటవ్వగా.. కోహ్లీ 88 రన్స్ చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఒకవేళ లంకతో మ్యాచ్‌లో మూడంకెల స్కోరు చేసి ఉంటే విరాట్ కోహ్లీ కెరీర్లో ఇది 49వ సెంచరీ అయ్యేది.
సచిన్ టెండూల్కర్ అడ్డా అయిన ముంబైలోని వాంఖడేలో అతడి సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేసేవాడు. కానీ కోహ్లీ ఆ ఫీట్‌ను అందుకోలేకపోయాడు. కోహ్లీ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ (45 నాటౌట్) మంచి నాక్ ఆడుతున్నాడు. కేఎల్ రాహుల్ (21)తో కలసి ఎడాపెడా షాట్స్ కొడుతూ స్కోరు బోర్డును బుల్లెట్ స్పీడ్‌తో పరిగెత్తించాడు. ఈ క్రమంలో అయ్యర్ ఓ అద్భుతమైన సిక్స్ కొట్టాడు. ఆ బాల్ కాస్తా 106 మీటర్ల దూరం వెళ్లింది. ఈ వరల్డ్ కప్‌లో ఇదే బిగ్గెస్ట్ సిక్సర్ కావడం విశేషం. ఇది కదా సిక్స్ అనేలా అయ్యర్ షాట్ అనిపించింది. భారీ సిక్సర్ల విషయంలో శ్రేయస్ తర్వాతి స్థానాల్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (101 మీటర్లు), ఫఖర్ జమాన్ (99 మీటర్లు), డేవిడ్ వార్నర్ (98 మీటర్లు) ఉన్నారు. మరి.. అయ్యర్ సిక్స్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: VIDEO: కోహ్లీ సూపర్ షాట్! రోహిత్ శర్మ రియాక్షన్ చూడండి!