iDreamPost
android-app
ios-app

వీడియో: భారత్-బంగ్లా మ్యాచ్​లో ఫైట్.. అభిమానికి తీవ్ర గాయం!

  • Published Sep 27, 2024 | 3:21 PM Updated Updated Sep 27, 2024 | 3:21 PM

IND vs BAN, Kanpur Test: టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మొదలైపోయింది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​కు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అయితే గ్రౌండ్​లో ఫైట్ జరగడం డిస్కషన్స్​కు దారితీసింది.

IND vs BAN, Kanpur Test: టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మొదలైపోయింది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​కు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అయితే గ్రౌండ్​లో ఫైట్ జరగడం డిస్కషన్స్​కు దారితీసింది.

  • Published Sep 27, 2024 | 3:21 PMUpdated Sep 27, 2024 | 3:21 PM
వీడియో: భారత్-బంగ్లా మ్యాచ్​లో ఫైట్.. అభిమానికి తీవ్ర గాయం!

భారత్-బంగ్లాదేశ్​ మధ్య రెండో టెస్ట్ ప్రారంభమైంది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. గురువారం రాత్రి వర్షం పడటంతో పిచ్ బౌలింగ్​కు అనుకూలిస్తుందనే ఉద్దేశంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అలాగే టీమ్​లో ఏ ఛేంజెస్ చేయలేదు. చెన్నై టెస్ట్​లో ఆడిన జట్టునే రిపీట్ చేశాడు. అయితే మ్యాచ్​ సంగతి కాస్త అటుంచితే.. స్టేడియంలో ఫైట్ జరగడం ఇప్పుడు హాట్ టాపిక్​గా మారింది. రోహిత్ సేన ఆట చూద్దామని భారీగా అభిమానులు తరలివచ్చారు. బంగ్లాదేశ్​ సపోర్టర్స్ కూడా మంచి సంఖ్యలోనే అటెండ్ అయ్యారు. అయితే ఇరు జట్ల మధ్య గొడవ జరగడం ఇప్పుడు డిస్కషన్స్​కు దారితీసింది. అసలు ఏం జరిగిందో డీటెయిల్డ్​గా తెలుసుకుందాం..

ఇండియా-బంగ్లాదేశ్​ మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తున్న కాన్పూర్​లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో అభిమానుల మధ్య ఫైట్ జరిగిందని తెలుస్తోంది. ఇరు టీమ్స్ ఫ్యాన్స్ కొట్టుకున్నారని వినిపిస్తోంది. ఈ గొడవలో గాయపడ్డ ఓ బంగ్లా అభిమానిని హాస్పిటల్​కు తరలిస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ బంగ్లా ఫ్యాన్ పేరు టైగర్ రాబీ అని తెలుస్తోంది. స్టేడియంలోని సీ-బ్లాక్ దగ్గర అతడ్ని గుర్తించామని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడని స్థానిక పోలీసులు తెలిపారు. దీంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లామని అన్నారు. దీనిపై రాబీ మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు తనను బాగా కొట్టారని, వెనుక నుంచి దాడి చేశారని చెప్పాడు. సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోతున్నానని వాపోయాడు.

బంగ్లా ఫ్యాన్ రాబీపై భారత అభిమానులు దాడి చేశారనే ఆరోపణలను పోలీసులు ఖండించారు. డీహైడ్రేషన్ వల్ల అతడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడని.. ఎలాంటి గొడవ జరగడానికి ఆస్కారం లేదన్నారు. అయితే అతడి కండీషన్​పై డాక్టర్లు ఏం చెబుతారో వెయిట్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక, సెకండ్ టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్​లో ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన బంగ్లా ప్రస్తుతం 3 వికెట్లకు 107 పరుగులతో ఉంది. మోమినుల్ హక్ (40 నాటౌట్), ముష్ఫికర్ రహీం (6 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఓపెనర్లు జాకీర్ హుస్సేన్ (0), షాద్మన్ ఇస్లాం (24)ను పేసర్ ఆకాశ్​దీప్ ఔట్ చేశాడు. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హసన్ షంటో​ (31)ను వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పెవిలియన్​కు పంపించాడు. వర్షం కారణంగా మ్యాచ్​ను నిలిపివేశారు అంపైర్లు. మరి.. గ్రౌండ్​లో ఫైట్ జరగడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.